Jump to content

తమాంగు ప్రజలు

వికీపీడియా నుండి
Tamang Bhote
तामाङ भोटे
Total population
1,539,830
 నేపాల్ and  India
భాషలు
Tamang language
మతం
90% Christian
10% other (including Budhisim+ Hinduism)


తమాంగు (ཏ་ མང) (దేవనాగరి: तामाङ; తామాంగు) నేపాలు, భారతదేశాలలో అతిపెద్ద టిబెట్టు జాతి సమూహం. మతం ఆధారంగా సాంప్రదాయకంగా క్రైస్తవులైన వారు 2001 లో 1.3 మిలియన్లకు పైగా ఉన్న వీరు నేపాలు జనాభాలో 5.6% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా వీరి సంఖ్య 1,539,830 కు అభివృద్ధి చెందింది.[1]పశ్చిమ బెంగాలు లోని సిక్కిం, డార్జిలింగు జిల్లాలో భారతీయ తమాంగులు శాశ్వత స్థిరనివాసులుగా ఉన్నాయి;[2] నేపాలులో వారి భాషలు ఐదవ స్థానంలో ఉన్నాయి (తమాంగు భాషలు అన్ని పరస్పరం అర్థం చేసుకోలేవు). వారు నేపాలు, భారతదేశపు స్థానిక ప్రజలుగా గుర్తించబడుతున్నారు.[3]

స్థితి

[మార్చు]

మొత్తం మరణాలలో 1/3 తమాంగు ప్రజలకు సంభవించాయి. పూర్తిగా నాశనం చేయబడిన 6,00,000 నిర్మాణాలలో మూడింట రెండు తమాంగు ఆధిపత్య ప్రాంతాలలో ఉన్నాయి.[4] తమాంగులు వ్యతిరేకంగా నేపాలు ప్రభుత్వం నిర్లక్ష్యం, వివక్షత కారణంగా పేదరికం అధికరించింది. భూకంపాలు కొండచరియలు, వరదలు వంటి విపత్తులు వీరికి మరింత హాని కలిగించింది-మానవ శాస్త్రవేత్త ముక్తా సింగ్ లామా.[4]

ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తమాంగు సమాజ సాధికారత అవసరమని నేపాలు ప్రభుత్వం భావించింది. నేపాలు పార్లమెంటు సివిల్ సర్వీస్ యాక్టు (1993) ను సవరించే బిల్లును ఆమోదించింది. ఆగస్టు 3 న ఈ సవరణలు బ్యూరోక్రసీలో 45% ప్రభుత్వ ఉద్యోగాలను ఈ గ్రూపులకు కేటాయించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తాయి.[ఆధారం చూపాలి]

ప్రస్తుతం వారు నేపాలు, టిబెట్టు సరిహద్దులలో నివసిస్తున్నారు. ఖాట్మండు నుండి నెట్టివేసిన కారణంగా 2015 ఏప్రెలు నేపాలు భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సమూహాలలో వీరు ఉన్నారు.[ఆధారం చూపాలి]

కులాలు, సమూహాలు

[మార్చు]

తమాంగు సమాజ పరిశోధనలో లామా (ప్రీస్ట్ ఆఫ్ తమాంగు, టిబెట్టు బౌద్ధమతాన్ని అనుసరిస్తున్న కొన్ని ఇతర సంప్రదాయ సమూహాలు) తంబా, గన్బా, బోన్బో అనే నాలుగు రకాల నిపుణులను కనుగొన్నారు. లామాయిస్టులు బౌద్ధమతం, దాని గ్రంథాల నుండి జ్ఞానాన్ని సంపాదించాలని భావించారు. లామా తంబాలు చరిత్రపూర్వ తమాంగులకు పూర్వీకులని భావిస్తున్నారు. సమాజంలోని ఆచారాల పరిజ్ఞానంతో వేడుకను పూర్తి చేయడానికి గన్బా సహాయపడతాడు. జక్రీని మంత్రగత్తె-పూజారి అని పిలుస్తారు. దేవుడు జంగిలు దేవత నుండి మాయా శక్తిని సంపాదించుకుని తమాంగు ప్రజలను బాధ, అనారోగ్యం, దుష్టశక్తులన్నింటి నుండి రక్షిస్తాడు. తమాంగు సమాజంలోని ఈ నాలుగు అంశాలు కలిసి, తమాంగు సంప్రదాయం ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాయి.

తమాంగులను “12 తమాంగు & 18 జాటు లేదా తమాంగు” అని రెండు విభాగాలుగా వర్గీకరించారు. 12 తమాంగు లార్డు ‘మహేశ్వరుడి' (వన్సిటార్టు 1909: 141) స్వచ్ఛమైన వారసులని నమ్ముతారు. ఈ తమాంగులు సామాజికంగా ‘18 జాటు’ (వన్సిటార్టు 1909: 142) కంటే అధికులుగా భావించబడుతుంటారు. ’12 తమాంగు, 18 జాటు ’భావనను చాలా మంది రచయితలు“ 12 జాటు, 18 జాటు”అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది హిందూ సామాజిక క్రమం వంటి తమాంగుల కులశ్రేణి భావనను ప్రతిబింబిస్తుంది. హిందూ సామాజిక నిర్మాణం వంటి తమంగులలో కుల సోపానక్రమం ఈ వర్గీకరణ తమాంగులలో కుల వ్యవస్థ ఉనికిని రుజువు చేయలేదు. ఉన్నత, దిగువ కులాలు లేవు. 12 తమాంగు, 18 జాటు తమంగు భావన 12 తమాంగులు స్వచ్ఛమైనవని, ప్రత్యేకమైన స్థలంలో వంశపారంపర్యంగా స్థిరపడినవారని భావిస్తారు. 18 జాటు తమాంగును తాము నెవారు, గురుంగు, మాగరు తమాంగుల పురుషులు, స్త్రీలకు జన్మించారని భావిస్తున్నారు. 12 తామాంగు థారు 18 జాటు తమాంగుల మాదిరిగానే ఉంటారు. కాని 12 తమాంగులు తమను తాము 18 జాటు వంశం కంటే అధికులమని భావిస్తున్నారు. 18 జాటు తమాంగులు తాము థారు మిశ్రమ వివాహ వ్యవస్థ సంతానం అని భావిస్తున్నారు. హేమెండోరు (1955-56) తన “నేపాలు తమాంగుల మీద ఎథ్నోగ్రాఫికు నోట్సు” వాల్యూ -9 ప్రకారం, 12 - 18 తమాంగు వర్గీకరణ కులం మీద ఆధారపడి లేదు. కానీ అది 'స్వచ్ఛమైన తమాంగు మిశ్రమ రక్తం మీద ఆధారపడి ఉంది.

వాన్సిటార్టు తన పుస్తకం ‘గోర్ఖాలు’ (1909) ఆధారంగా తమాంగులు ప్రధానంగా 12 గిరిజన సమూహాలుగా విభజించబడింది. వారు నిర్దిష్ట భూభాగాన్ని ఆక్రమించారు. ఇది ఈ తమాంగులను గుర్తించే రేఖగా మారింది. వారు వారి పూర్వీకుల ప్రాంతంలో (కిపాటు) నివసించారు. ఇది వారిని స్వచ్ఛమైన 12 తమాంగులుగా చేసింది. వాన్సిటార్టు (1909) ఆధారంగా ‘18 జాటు తమాంగు’ విస్తృతంగా మూడు గ్రూపులుగా విభజించబడ్డారు.(Kipat) (1) గోథరు, (2) నర్బా, (3) షాంగ్రి. ఈ తమాంగులకు ఉప వంశం లేదు. సాంప్రదాయ తమాంగు సమాజంలో ఇతర కులాలతో వివాహం అనుమతించబడదు. ఎవరైనా అలా చేస్తే ఆ మీద తమాంగు వంశ వ్యవస్థ నుండి బహిష్కరణ వంటి పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి వివాహం సంతానం కొత్త వంశం లేదా థారు హోదా పొందాలి. ఇటువంటి వివాహం స్వచ్ఛమైన 12 తమంగుల కంటే దిగువన ఉన్న 18 జాటు తమాంగులను చేస్తుంది. స్వచ్ఛమైన తమాంగులలో మునుపటి స్థానాన్ని పొందడానికి మూడు తరాల పాటు వారిని శుద్ధి చేయాలి. ఒక తమాంగు పురుషుడు ఖాసు కులానికి చెందిన బ్రాహ్మణ, చెత్రి లేదా ఠాకురి స్త్రీని వివాహం చేసుకుంటే ఆయన బిడ్డ గోతరు వంశాన్ని భరిస్తాడు. ఇది స్వచ్ఛమైన తమాంగు లేదా బహిష్కరించబడిన తమాంగు కాదు. కానీ ఇది శుద్ధికి లోబడి ఉండే వంశం. తమాంగు పురుషులు, నెవారు మహిళల సంతానం నర్బా ఔతుంది. మాగరు, లింబు, గురుంగు, రాయి, సునువారు మహిళలతో సాన్నిహిత్యం ఉన్న పిల్లలకు షాంగ్రి థారు లభిస్తుంది.

Concept of Clan“Swangey Bhai" in Tamang

[మార్చు]

తమాంగు సామాజిక నిర్మాణం చాలా సాంప్రదాయంగా ఉంది. ఈ వ్యవస్థ ఉదాహరణలలో ఒకటి థారు బ్రదర్హుడు. ఇలాంటి కులదేవతను ఆరాధించే థారు లేదా వంశం తమాంగు ప్రజలు ‘స్వాంగే భాయి’ గా భావించారు. తమాంగు సమాజం స్వాంగే భాయి థార్ల మద్య వివాహసంబంధాలు లేవు. వారు ఒకే పూర్వీకుల సోదరులుగా భావిస్తారు. పార్సురాం తమాంగు తన పుస్తకంలో 18 థార్లు తమాంగు స్వాంగే భాయి పేర్లను ఇచ్చారు. అవి క్రింద ఉన్నాయి: -

తమాంగు సంప్రదాయం, సామాజిక ఆచారాలు, నైతిక విలువల కథనాలు మౌఖిక సంప్రదాయం రూపంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఈ సాంప్రదాయం, ఆచారాలు సమకాలీన ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తిని ఎదుర్కోవటానికి పూర్వీకులు తయారు చేసారు. ఇది ప్రబలంగా ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా సమాజాన్ని నిర్వహించడానికి ర్హుయీలతో ఆచరించబడుతుంది. తమాంగు ఆచారాలు, సాంప్రదాయం క్రోడీకరణ రూపొందించబడలేదు. అయితే ఇటువంటి నిబంధనలు, నైతిక విలువలు పూర్వీకులచే మౌఖిక సంస్కృతి ద్వారా కొత్త తరానికి ప్రసారం చేయబడతాయి. ఇది తమాంగు ప్రజలను ఉత్సాహంగా అధిక నైతికత విలువలను అనుసరించడానికి వీలు కల్పించింది. తమాంగు సంప్రదాయాన్ని పరిశీలిస్తే, ఎముక సంబంధిత వివాహ వ్యవస్థ విషయంలో అవి చాలా ధృఢంగా ఉంటాయి. అంతేకాక వారు తమాంగు ఎముక సంబంధాన్ని అనుసరించని సామాజిక వ్యవస్థ నుండి వంశ సభ్యుడిని బహిష్కరించారు. వారు ఈ జంటను బహిష్కరించరు. కానీ వారి పిల్లలను సమాజం అంగీకరించరు.

రాజకీయ భాగస్వామ్యం

[మార్చు]

తమాంగులు తాంసాలింగు రాష్ట్రీయ ముక్తి మోర్చా, తాంసాలింగు నేపాలు రాష్ట్రీయదళం పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగోలు నేషనలు ఆర్గనైజేషను (ఎం.ఎన్.ఒ) స్వీయ-నిర్ణయానికి మద్దతు ఇస్తుంది. నేపాలులో వివక్షకు గురౌతున్న (తమాంగులను మాత్రమే కాకుండా) ప్రజలందరి తరఫున పనిచేస్తుంది. హిందువులు కానివారు హిందూ మతంలోకి మారడాన్ని ఎం.ఎన్.ఒ. వ్యతిరేకిస్తుంది. దీనికి ప్రస్తుతం అధికారిక పార్లమెంటరీ ఓటును లేదు. ఫెడరలు లింబువాను స్టేటు కౌన్సిలు (ఎఫ్ఎల్ఎస్సి) కిరాత ప్రజల కోసం స్వీయ-నిర్ణయం కోసం ఇలాంటి లక్ష్యాల కోసం పనిచేస్తుంది. వారు తమంగులతో కలిసిపోతారు. స్వయంప్రతిపత్తి కోసం పునరుద్ధరించిన ఖాట్మండుతో ఒప్పందాన్ని ఉదహరిస్తున్నారు.[5] అనుబంధ సంఘియా లింబువాను పార్టీ 2015 నేపాలు దిగ్బంధనం సమయంలో బందుకు పిలుపు ఇవ్వడంలో పాల్గొంది.[6] అయినప్పటికీ అంతర్జాతీయ పత్రికలు తమ బందును గమనించడంలో విఫలమయ్యాయి. కానీ వారి ఉనికిని గమనించనట్లు నటించాయి. బదులుగా చైనాతో భౌగోళిక రాజకీయ ఆందోళనలు, భారతదేశ వెనుక నుండి ఇచ్చిన బలంతో 4 పార్టీ మాధేసి మోర్చా మీద దృష్టి సారించాయి. ఎందుకంటే లింబువాను మాధేసి లక్ష్యాలను ఖాట్మండు ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకిస్తాడు.[7]ఏదేమైనా ఇంధన దిగ్బంధనం సమయంలో లింబువాను చర్యల గురించి భారతదేశానికి, పాశ్చాత్య దేశాలకు సమాచారం నిరాకరించబడింది. 1980 లలో భారతదేశంలో హింసాత్మక గూర్ఖాలాండు ఉద్యమానికి ప్రముఖ తమాంగు సుభాసు ఘిసింగు నాయకత్వం వహించాడు. సిలిగురి కారిడారు సామీప్యంలో ఉన్నందున దీనికి భారతదేశం భద్రతా ముప్పుగా భావించింది. [2] తమాంగు-భారతీయ రాజకీయ నాయకుడు, గూర్ఖాలాండు రాష్ట్రానికి ప్రతిపాదకుడైన మదను తమాంగు 2010 లో హత్య చేయబడ్డాడు. పశ్చిమ బెంగాలు ప్రభుత్వం మరొక గూర్ఖాలాండు రాజకీయ పార్టీ మీద నిందలు వేసింది. ఫలితంగా ఉద్యమం బలహీనపడింది. గోర్ఖాలాండు టెరిటోరియలు అడ్మినిస్ట్రేషను భారతదేశంలో రాష్ట్ర హోదా స్థానంలో సృష్టించబడింది. అయినప్పటికీ సరిహద్దు దాటి అనేక సమూహాలకు సంబంధించిన జాతి వివక్ష సమస్యలు ( రాజకీయాలలో పాల్గొన్నవారు) నేపాలులో పరిష్కరించబడలేదు. 2017 లో బినాయి తమాంగును జిటిఎ చైరుపర్సనుగా నియమించారు.[8]

పేరు వెనుక చరుత్ర

[మార్చు]

తమాంగు అనే పదం " తమగు " పదం మూలంగా ఉంది. టిబెట్టు భాషలో త అంటే గుర్రం, మాగు అంటే సైనికుడు.[9]

సంస్కృతి

[మార్చు]

పండుగలు

[మార్చు]
Sonam Lochar Festival


తమాంగుల ప్రధాన పండుగ " సోనం ల్హోచ్చరు " ను మాగు (ఫిబ్రవరి - మార్చి) లో నెలలో జరుపుకుంటారు.[10] తమాంగు నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి దీనిని జరుపుకుంటారు.

గ్రామాలు, పట్టణాలలోని వివిధ ప్రదేశాలలో రంగురంగుల జెండాలు, ముద్రించిన బౌద్ధ మంత్ర వస్త్రాలు ఉంచబడ్డాయి.[1] తమంగులలో "తమాంగు సెలో" అని పిలువబడే ఒక సంగీత శైలి ఉంది. దీనిని డాంప్లూ వాయిద్యంతో ప్రదర్శిస్తారు. దీనిని దంపూ డాన్సు అని కూడా పిలుస్తారు. తమాంగులకు ప్రత్యేకమైన చురుకైన కదలిక, రిథమికు బీటును కలిగి ఉంటుంది. [2]

రెండవ అతి ముఖ్యమైన పండుగ సాగా దావా (బుద్ధ జయంతి). దీనిని మతపరమైన పండుగగా జరుపుకుంటారు.[9]

దశైను, తిహారు (పండుగ) ను కూడా తమంగులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.[1]

జీవనం

[మార్చు]

చాలా మంది తమాంగులు రైతులుగస్ వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. అధిక ఎత్తులో నీటిపారుదల లేకపోవడం వల్ల, వారు తరచుగా మొక్కజొన్న, చిరుధాన్యాలు, గోధుమ, బార్లీ, బంగాళాదుంపలకు పరిమితం. వారు తరచూ వారి వ్యవసాయ ఆదాయాన్ని శారీరక శ్రమతో భర్తీ చేస్తారు. గతంలో తమాంగు ప్రజలు అనుభవించిన వివక్ష కారణంగా, వారు మొత్తం విద్యార్జనలో పేలవంగానే ఉన్నారు. అధికశాతం రైతులు, పర్వతారోహణ, పోర్టరింగు, ఖాట్మండులో డ్రైవింగు వంటి వాటికి మాత్రమే పరిమితం చేయబడ్డారు. వారు టిబెట్టు రగ్గులు, థాంకాలు (టిబెట్టు పెయింటింగు), డ్రైవింగు, శ్రమికులుగా కూడా పనిచేస్తారు. వ్యవసాయానికి సంబంధించినంతవరకు తమాంగు వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో వారు ఆధునిక యంత్రాలను ఉపయోగించదు.[1]

రాజకీయాలు

[మార్చు]

తంసాలింగు

[మార్చు]
Historically Occupied Tamang Territories (excluding kathmandu valey)

తంసాలింగు స్టేటు నేపాలు ప్రతిపాదిత సమాఖ్య రాష్ట్రం. ఇది తమాంగు ప్రజల చారిత్రక మాతృభూమిని సమాఖ్య రాష్ట్రంగా స్థాపించింది. తమాంగు చారిత్రక భూభాగాలను తమ్సాలింగు అంటారు. తమాంగు స్వయప్త్రతిపత్తి రాష్ట్రం స్టేటు జిల్లా విభజనను పునర్నిర్మించి స్వయంప్రతిపత్తమైన తంసాలింగు ప్రావింసును రూపొందించాలని ఆదేశించింది. ఇందులో చారిత్రాత్మకంగా తమాంగు నివాస స్థావరాలు, ఖాట్మండు వాలీని మినహాయించి బాగ్మతి, తాంసాలింగు ఆధిపత్య మండలాలు ఉన్నాయి. తమాంగు స్వయంప్రతిపత్తి రాష్ట్రం జిల్లాలను పునర్నిర్మించడం. రాష్ట్ర భూభాగం ప్రతి చారిత్రక తమంగు స్థావరాన్ని కలిగి ఉంటుంది. ఇది తూర్పున రామెచాపఉ నుండి పశ్చిమ ధాడింగు నువాకోటు వరకు వ్యాపించింది. నేపాలులో షా రాజవంశానికి ముందు తమాంగు ప్రజలు తమ సొంత రాజులను, నాయకత్వాన్ని కలిగి ఉన్నారు. [11] వారు ఖాట్మండు లోయ స్థానిక నివాసులు అని వారు విశ్వసిస్తారు. ప్రొఫెసరు మానికు లాల్ శ్రేష్ట[12] చారిత్రక ఆధారాలు గూర్ఖా పాలకుల పట్ల చాలా తిరుగుబాటు తత్వం ప్రదర్శించినందున తమాంగు సమాజం మారణహోమానికి గురైందని రుజువు చేస్తుంది.

ప్రముఖ తమాంగులు

[మార్చు]
నవనీత ఆదిత్య


దస్త్రం:Kulman-Ghising-Nepal-Electricity-Authority MD.jpg
కుల్మాను ఘిషింగు

తమాంగులు నేపాలులో సంగీతం, రాజకీయాలు, నవలలు, నేపాలు పౌర సేవకులుగా రాణించారు. వీరిలో కొన్ని ప్రముఖ పేర్లు: గాయకుడు- హీరా దేవి వైబా,[13] గాయకుడు- కుంతి మొక్తాను, [14] నవనీతు ఆదిత్య వైబా, ఫిరోజు శ్యాంగ్డెను, రాజు లామా, పరిజతు (రచయిత), ప్రశాంతు తమంగు,[15]జెనిషా మోక్తను,[16]నిమా రుంబా,[17]17] అరుణ లామా,[18] కర్మ యోన్జోను, గోపాలు యోంజను,[19]ప్రేం లోప్చను, కుల్ మ్యాను ఘిసింగు, డిబి లామా, విజయ లామా ప్రాధాన్యత వహించారు.

పర్వతారోహణ, పర్యాటకం

[మార్చు]

తమాంగు గ్రామాలు తరచుగా నేపాలు అనేక పర్వతారోహణ మార్గాలలో ఉంటాయి. వాటికి " తమాంగు హెరిటేజు ట్రైలు" అని నామకరణం చేయబడింది.[20]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2019-12-26.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. 2.0 2.1 2.2 "Archived copy". Archived from the original on 2016-04-27. Retrieved 2015-12-23.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Emergent North-East : A Way Forward By H. C. Sadangi
  3. "Report on Socio-Economic Status of Tamang–Kavre". Nefin.org.np. Archived from the original on 2013-03-12. Retrieved 2015-12-23.
  4. 4.0 4.1 "The Brief » Blog Archive » The Tamang epicentre". Nepali Times. 2015-07-05. Archived from the original on 2015-11-28. Retrieved 2019-12-26.
  5. Chemjong, Iman Singh (2003). History and Culture of Kirat People (4th ed.). Kathmandu: Kirat Yakthung Chumlung. ISBN 99933-809-1-1.
  6. "Sanghiya Limbuwan Party calls indefinite Eastern Region bandh". The Himalayan Times. 2015-09-04. Archived from the original on 2015-12-23. Retrieved 2019-12-26.
  7. Om Astha Rai. "Look south | As It Happens". Nepali Times. Archived from the original on 2015-12-23. Retrieved 2019-12-26.
  8. "GTA reconstituted, rebel GJM leader Tamang is chairperson". The Hindu (in Indian English). Special Correspondent, Special Correspondent. 2017-09-21. ISSN 0971-751X. Archived from the original on 2018-02-28. Retrieved 2018-02-28.{{cite news}}: CS1 maint: others (link)
  9. 9.0 9.1 "Who actually are the Tamang People? An Insight into Indigenous Tribe of Nepal". Chronicles of ADVENTURE TRAVEL (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-01-05. Archived from the original on 2018-03-01. Retrieved 2018-02-28.
  10. "Sonam Lhochhar celebrated | Street Nepal". streetnepal.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2016-08-16. Retrieved 2018-02-28.
  11. https://www.youtube.com/watch?v=3JkE0O2_KnQ&t=1224s
  12. https://www.youtube.com/watch?v=zuOTGv8k3XI
  13. "The Telegraph - Calcutta (Kolkata) | North Bengal & Sikkim | Hira Devi dies of burn injuries". www.telegraphindia.com. Retrieved 2018-03-11.
  14. "Kunti Moktan" (in ఇంగ్లీష్). Retrieved 2018-03-11.
  15. "Indian Idol Winner Prashant Tamang Is The Rallying Voice Of The Gorkhaland Protests". Huffington Post India (in Indian English). 2017-06-21. Retrieved 2018-03-11.
  16. "Zenisha Moktan | Nepali Actress". nepaliactress.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-03-11.
  17. "Nima Rumba & Style". My Republica (in ఇంగ్లీష్). Retrieved 2018-03-11.
  18. "Melody queen Aruna Lama". Boss Nepal (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-03-02. Retrieved 2018-03-11.
  19. Kalakar, Hamro. "Gopal Yonzon Biography | Hamro Kalakar". www.hamrokalakar.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-03-12. Retrieved 2018-03-11.
  20. Post Report. "The Kathmandu Post :: Tamang Heritage Trail reopens after quake". Kathmandupost.ekantipur.com. Archived from the original on 2015-12-08. Retrieved 2015-12-23.
[మార్చు]

మూస:Ethnic groups in Nepal