తరగతి గది దాటి
తరగతి గది దాటి (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మల్లిక్ రామ్ |
---|---|
నిర్మాణం | కొల్లా ప్రవీణ్ |
తారాగణం | హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల |
సంగీతం | నరేన్ ఆర్కే సిద్దార్థ |
సంభాషణలు | కిట్టు విస్సాప్రగడ |
ఛాయాగ్రహణం | మోనిష్ భూపతిరాజు |
విడుదల తేదీ | ఆగస్ట్ 20, 2021 |
భాష | తెలుగు |
తరగతి గది దాటి 2021లో విడుదలైన వెబ్‌సిరీస్. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్లుగా ఆగస్ట్ 20న ఆహా ఓటీటీలో విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]రాజమండ్రిలో ట్యూషన్స్ చెప్పే దంపతులు(రమణ భార్గవ్, బిందు చంద్రమౌళి) కుమారుడు కృష్ణ అలియాస్ కిట్టు(హర్షిత్ రెడ్డి). అతను సిన్సియర్ స్టూడెంట్ కానీ చదువు వంటపట్టదు. అతనికి వంట చేయడంపై ఆసక్తి ఉంటుంది. మంచి చెఫ్ కావాలని అనుకుంటుంటాడు. అయితే ‘జీవితమంటే జోక్ కాదు’ అంటూ అతని తండ్రి అతన్ని నిరుత్సాహపరుస్తుంటాడు. అదే సమయంలో ఆ ట్యూషన్ సెంటర్‌కు వచ్చిన జాస్మిన్ (పాయల్ రాధాకృష్ణ) అనే అమ్మాయిని చూసి కృష్ణ ప్రేమలో పడతాడు. ఇద్దరూ సరదాగా క్లాసులను ఎగ్గొట్టి తిరుగుతుంటారు. కిట్టు ప్రేమను వ్యక్తం చేయడానికి, అతని స్నేహితులు కూడా అతని టిప్స్ చెబుతారు. మరి వారి ప్రేమ కథ చివరకు ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- హర్షిత్ రెడ్డి
- పాయల్ రాధాకృష్ణ
- నిఖిల్ దేవాదుల
- స్నేహాల్ కామత్
- వాసు ఇంటూరి
- బిందు చంద్రమౌళి
- రమణ భార్గవ్
- జయవాణి
- సుజాత
- స్వపిక
- అశ్వత్
- మహేందర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- నిర్మాత: కొల్లా ప్రవీణ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మల్లిక్ రామ్
- సంగీతం: నరేన్ ఆర్కే సిద్ధార్థ
- సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతిరాజు
- డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 August 2021). "'తరగతి గది దాటి'..ఇప్పుడు 'ఆహా'లో". Archived from the original on 16 ఆగస్టు 2021. Retrieved 16 August 2021.
- ↑ TV9 Telugu (17 August 2021). "Tharagathi Gadhi Daati: ఆహాలో సరికొత్త వినోదం.. తరగతి గది దాటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే." Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (20 August 2021). "Tharagathi Gadi Daati Movie Review: ఆహాలో విడుదలైన తరగతి గది దాటి.. ఎలా ఉందంటే." Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 21 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV (20 August 2021). "రివ్యూ: తరగతి గది దాటి (వెబ్ సీరిస్)". NTV. Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 21 August 2021.