Jump to content

తరహై కత్‌బర్ట్

వికీపీడియా నుండి

తరహై కత్‌బర్ట్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన విలవంకోడ్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] జూన్ 12న శాసనసభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసింది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తరహై కత్‌బర్ట్ 1976లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, విలవన్‌కోడ్ మండలం, అన్‌బాగం గ్రామంలో జన్మించింది. ఆమె ఎంఏ, ఎంఫిల్, పీసీడీసీఏ, ఎంబీఏ పూర్తి చేసి పీహెచ్‌డీ చేసింది

రాజకీయ జీవితం

[మార్చు]

తరహై కత్‌బర్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి జిల్లా అధ్యక్షురాలిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా, అఖిల భారత వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, తమిళనాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2021లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే ఎస్. విజయధరణి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించడంతో 2024లో జరిగిన విలవంకోడ్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వీఎస్ .నంతినిపై 40,174 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఈ ఎన్నికలలో ఆమెకు 91,054 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి వీఎస్ .నంతిని 50,880 ఓట్లు సాధించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (4 June 2024). "Vilavancode Assembly bypoll: Tharahai Cuthbert of Congress wins" (in Indian English). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. EENADU (13 June 2024). "విళవంకోడు ఎమ్మెల్యేగా తారగై ప్రమాణ స్వీకారం". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  3. Election Commision of India (5 June 2024). "Vilavancode Assembly Constituency Bye Election 2024 Result". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.