తలసరి ఆదాయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2018

తలసరి ఆదాయము అనగా ఏదైనా ఒక ప్రాంతములో ఒక మనిషికి సగటున లభించే ఆదాయము. ఆ ప్రాంతంలో అన్ని రకాలుగా వచ్చే ఆదాయాన్ని (స్థూల జాతీయోత్పత్తి) లెక్కించి జనాభాతో భాగించగా వచ్చేదాన్ని తలసరి ఆదాయము అంటారు.

శ్రేయస్సుకు కొలమానము[మార్చు]

తలసరి ఆదాయము = మొత్తము ఆదాయము/జనాభా తలసరి ఆదాయమును ఒక దేశము యొక్క అభివృద్ధికి కొలమానముగా వాడుతారు (ముఖ్యముగా ఇతర దేశాలతో పోల్చేటప్పుడు).అది దేశ జీవన ప్రమాణాలను అంచనా వేయటానికి కూడా ఉపయోగపడును. దీనిని ఎక్కువగా వాడే కరెన్సీలలో (డాలర్ లేదా యురో) వెల్లడిస్తారు. ఎందుకనగా జీడీపీ వగైరావన్ని అందులోనే లభిస్తాయి. ఇందులో అయితే వివిధ దేశాలతో పోల్చడానికి చాలా సులువుగా ఉంటుంది. మన దేశము ఏ స్థానములో ఉందో తెల్సుకోవచ్చు.

విమర్శలు[మార్చు]

దీనిని అభివృధ్ధికి సూచికగా వాడటములో చాలా లోపాలు ఉన్నాయనే విమర్శకులూ లేకపోలేదు.

వారు చెప్పే లోపాలు[మార్చు]

  1. తలసరి ఆదాయమును కాలముతో పాటు పోల్చేటప్పుడు ధరల పెరుగుదలతో సరి చేయాలి. లేకపోతే ద్రవ్యోల్బణ ప్రభావము వలన ఎక్కువ పెరుగుదల కనిపిస్తుంది. మన అంచనా తప్పుతుంది.
  2. అంతర్జాతీయముగా పోల్చేటప్పుడు ఆ ఆ దేశాల మారక విలువలలో కనిపించని జీవన వ్యయములోని తేడాల వల్ల మన అంచనాలు వక్రీకరింబడతాయి. మన లక్శ్యము జీవన ప్రమాణాలను పోల్చడానికి కాబట్టి తలసరి ఆదాయాన్ని ఆయా దేశాల కొనుగోలు శక్తిని అనుసరించి సరి చేయగలిగితే నిజమైన ఫలితాలు వస్తాయి. అప్పుడు మనము కచ్చితమైన అంచనా, నిజమైన భేదాలు తెలుస్తాయి.
  3. ఇది సగటు విలువ కనుక ఆదాయ పంపిణీ గురించి స్పశ్టమైన అవగాహన రాదు. ఒకవేళ ఆ పంపిణీ వక్రముగా ఉన్నచో ఎక్కువ భాగస్తులైన బీద వర్గము ఉన్నా తక్కువ మంది ఉన్న ధనిక వర్గము వలన తలసరి ఆదాయము భారీగా మారుతుంది. కాబట్టి “మధ్యస్థ” విలువ దీనికి ఎక్కువ ఉపయోగ పడుతుంది. ఎందుకనగా ఇది ధనిక వారి వలన ఎక్కువగా మారదు.
  4. ద్రవ్య రూపములో లేని ఆదాయలు ఉదాహరణ: కుటంబములో మనము చేసే సేవలు, వస్తుమార్పిడి ద్వారా జరిగే లావాదేవీలు మొదలయినవి ఇందులో కలవవు. వీటి ద్వారా వచ్చే ఆదాయము దేశదేశానికి మారుతుంది.
  5. ఇందులో మన ఆదాయము ఏ ఏ మూలాల నుంచి వస్తుందో తెలియదు. అనగా అభివృద్ధికి ఉపయోగపడే రంగాల్లోనా (వైద్య, విద్య, రవాణా వగైరాలు) లేక స్వప్రయోజనాల కోసమో తెలియదు.

మూలాలు[మార్చు]

==ఇతర లింకులు==income method