తలైయార్ జలపాతం
తలైయార్ జలపాతం | |
---|---|
ప్రదేశం | కొడైకెనల్ |
అక్షాంశరేఖాంశాలు | 10°13′25″N 77°35′54″E / 10.22361°N 77.59833°E |
సమద్రతలం నుండి ఎత్తు | 820 మీటర్లు (2,690 అ.) |
మొత్తం ఎత్తు | 975 అ. (297 మీ.) |
నీటి ప్రవాహం | మంజలార్ |
ప్రపంచములో ఎత్తువారిగా ర్యాంక్ | 267, భారతదేశంలో 6వది |
తలైయార్ జలపాతం తమిళనాడు రాష్ట్రంలోని దిండిగుల్ ప్రాంతంలోని పళని కొండల్లో ఉంది. ఇది 975 అడుగుల ఎత్తులో ఉండి భారతదేశంలోనే ఆరవ జలపాతంగా, ప్రపంచ వ్యాప్తంగా 267 వ ఎతైన జలపాతంగా ఉంది.[1]
జలపాతం వివరాలు
[మార్చు]ఈ జలపాతాన్ని రాట్ టైల్ జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ జలపాతాన్ని కొడైకెనాల్ ఘాట్ రోడ్ మార్గం పశ్చిమం వైపు ఉన్న 3.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న డమ్ డమ్ రాక్ వ్యూ ప్రాంతం నుంచి చూడవచ్చు.[2] జలపాతం పై అంచున కాంక్రీటు గోడ ఆకారంలో ఉండి నీళ్లు ఎలుక తోక ఆకారంలో ప్రవహిస్తుంది. ఈ జలపాతం అంచున 1.5 మీ. వెడల్పుతో పెద్ద రాతి రాయి ఉంటుంది. దీనికి కొంచెం దూరంలో ఉన్న అడవి ప్రాంతంలో నది ప్రవహిస్తుంది.[3]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ జలపాతాన్నికి సరైన రహదారి లేదు. అందుకే ఇక్కడికి చేరుకోవడానికి సందర్శకులకు పెను సవాలే. ఈ జలపాతాన్ని సందర్శనకు వేసవికాలం అనువైన సమయం. ఇక్కడికి మంజలార్ ఆనకట్ట నుంచి నీళ్లు వస్తాయి. ఈ జలపాతం దగ్గర కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఉండే కామాక్షి అమ్మవారు జలపాతం అంచున ఉన్న వెదురు పొదల్లో జన్మించిందని పురాణం చెప్పుతోంది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని మూన్కిలనై కామక్షి అని, ఈ చోటును అమ్మ మచు అని పిలుస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ World Waterfall Database, World's Tallest Waterfalls Archived 2011-06-11 at the Wayback Machine
- ↑ తలైయార్ జలపాతం. "తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జలపాతాలు !!". telugu.nativeplanet.com. Retrieved 6 October 2019.
- ↑ Purdy, Strother (2006), "Hike description", Mondaugen's Law