Jump to content

తవాఫ్ అల్-జియారహ్

వికీపీడియా నుండి
కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.

తవాఫ్ : (ఆంగ్లం : Tawaf) (అరబ్బీ భాష, ఉర్దూ భాష : طواف ) అనునది హజ్, ఉమ్రా సమయంలో ఆచరించు ఒక ఇస్లామీయ సాంప్రదాయం. మక్కా లోని కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఈ సాంప్రదాయాన్నే తవాఫ్ అని వ్యవహరిస్తారు. ఈ తవాఫ్ 7 సార్లు, గడియారపు ముల్లు చందంగా తిరుగుతూ ఆచరించబడుతుంది. ఈ విధము బీబీ హాజరా (ఇబ్రాహీం పవక్త భార్య) 'సఫా', 'మర్వా'ల మధ్య తన కుమారుడు ఇస్మాయీల్ కోసం నీటి కొరకు 7 సార్లు పరిగెత్తినది, అల్లాహ్ ఆ సమయంలోనే జమ్ జమ్ బావిని ఆవిష్కరించాడు. ఇందుకు చిహ్నంగా, తవాఫ్ కొరకు ఈ ఏడు సార్లు అనే సంఖ్య వచ్చింది. ఈ తవాఫ్ చేయు సమయంలో "లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్" (ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను) అని అంటారు.

కాబా చుట్టూ తవాఫ్ చేయడం, అర్ష్ ఎ ముఅల్లా, "జన్నత్ అల్ ఫిర్దోస్" చుట్టూ ప్రదక్షిణం చేయునట్లు ముస్లింల విశ్వాసం.

సాంప్రదాయ వివరాలు

[మార్చు]
దుఆ చేస్తున్న ఓ ముస్లిం.

ముస్లిం సమూహాలు ఈ హజ్ర్ ఎ అస్వద్ (కాబాకు ఓ మూల నున్నది, కు సృజిస్తారు లేదా ముద్దు పెట్టుకుంటారు, లేదా దీనిని సమీపించినపుడు తక్బీర్ (అల్లాహ్ ఒ అక్బర్) పఠిస్తారు. పురుషులు, కాబా చుట్టూ వేగంగా మూడు సార్లు, నాలుగవసారినుండి వేగం తగ్గించి తవాఫ్ చేయుట ఆచారం. ఆఖరు తవాఫ్ (7వ తవాఫ్) అయిన తరువాత మఖామ్ ఎ ఇబ్రాహీం చోట నమాజ్ ఆచరిస్తారు, తరువాత జమ్ జమ్ బావిని సందర్శించి, జమ్ జమ్ నీటిని సేవిస్తారు. ఆతరువాత హజ్ సాంప్రదాయమైన సయీ ఆచరిస్తారు. ముస్లింలు హజ్ సమయంలో ఒకసారి, మక్కా నుండి తిరుగుప్రయాణం చేయు సమయంలో ఈ తవాఫ్ ఆచరించడం ఉత్తమమని భావిస్తారు.[1]

తవాఫ్ రకాలు

[మార్చు]

తవాఫ్ లు పలురకాలు, దీని ఆచరణా విధానాలు క్రింద ఇవ్వబడినవి :

తవాఫ్ అల్-నిసా ఉమ్రాహ్, హజ్ సమయంలో రెండవసారి ఆచరించు తవాఫ్. ఈ సాంప్రదాయం షియా ముస్లింలలోనే కానవస్తుంది.

తవాఫ్ ఖుదూమ్ ('స్వాగత తవాఫ్') మక్కాలో నివసించని ప్రజలు, మక్కాను సందర్శించిన సమయంలో ప్రథమపర్యాయం చేసే తవాఫ్.

తవాఫ్ తహియా మస్జిద్ అల్ హరామ్లో ప్రవేశించునపుడు చేయు తవాఫ్ (ఇది "ముస్తహబ్" లేదా ఐచ్ఛికం.)

తవాఫ్ ఉమ్రాహ్ ఉమ్రాహ్ సమయంలో చేయు తవాఫ్.

తవాఫ్ విదా ('వీడ్కోలు తవాఫ్') మక్కానుండి తిరుగు ప్రయాణ సమయంలో చేయు తవాఫ్.

తవాఫ్ జియారాహ్ / ఇఫాదా (తవాఫ్ అల్-హజ్)

పాదపీఠికలు

[మార్చు]
  1. Mohamed, Mamdouh N. (1996). Hajj to Umrah: From A to Z. Mamdouh Mohamed. ISB 0-915957-54-x.

మూలాలు

[మార్చు]