తవిటి పురుగు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
The microscopic mite Lorryia formosa (Tydeidae)
Lime nail galls on Tilia × europaea, caused by the mite Eriophyes tiliae
Sarcoptes scabiei, the cause of scabies

తవిటి పురుగు (Mite) ఒక కీటకము. ఇది చిరుత కన్నా వేగంగా పరిగెత్తగలదని పరిశోధకులు గుర్తించారు.ఇన్నాళ్లు భూమిపై ఉన్న జీవుల్లో పరిమాణంతో పోల్చితే టైగర్ బీటిల్ అనే కీటకం వేగంగా పరుగులు తీస్తుందనే రికార్డు ఉండేది. ఇప్పుడు దాని కన్నా వేగంగా వెళ్లే మరో జీవి ఉందనే విషయం కొత్తగా తెలిసింది. అదే మైట్ (తవిటి పురుగు) అనే చిన్ని కీటకం.ఈ తవిటి పురుగుల్ని మొదటిసారిగా 1916లో గుర్తించారు.

విశేశాలు[మార్చు]

  • ఇది సెకనులో దాని శరీర పరిమాణం కన్నా 322 రెట్లు అధిక దూరం వెళుతుందిట. అంటే మనం గంటకు 2,000 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీసిన దాంతో సమానమన్నమాట!
  • దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఈ కీటకాలు ఎనిమిది కాళ్లతో గోరంత దేహంతో ఉంటాయి. చటుక్కున శత్రువును పట్టేస్తాయి.
  • పరిశోధనలలో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని పూర్తిగా పరిశీలించారు. 60 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచి చుట్టూ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ పరీక్షించారు. కెమెరాలకు కూడా అందని దీని వేగం చూసి ఆశ్చర్యపోయారు.దృశ్యాలన్నింటినీ పరిశీలించి చివరకు పరిమాణంలో పోలిస్తే మిగతా ప్రాణులకంటే ఇదే వేగంగా వెళ్లే జీవని తెలుసుకున్నారు. 'ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్'గా రికార్డు ఇచ్చారు.
  • చిరుత పులి సెకనులో దాని శరీరం కన్నా 16 రెట్ల దూరం పరుగులు తీస్తుందిట. టైగర్ బీటిల్ 171 రెట్లు. మనుషుల్లోనైతే పరుగుల వీరుడు ఉసెయిన్ బోల్ట్ సెకనులో శరీరం పొడవుకన్నా ఆరింతలు పరుగెత్తగలడు.

బయటి లంకెలు[మార్చు]