Jump to content

తాజ్ కన్నెమర

వికీపీడియా నుండి

భారత దేశంలోని తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో “వివంత - తాజ్ కన్నెమర” అనేది ఒక చారిత్రక ఫైవ్ స్టార్ హోటల్. ఈ హోటల్ ఇంపీరియల్ పేరుతో 1854లో ప్రారంభమైంది. చెన్నైలో ఇది ఒక చారిత్రక హోటల్[1] తాజ్ గ్రూప్ యొక్క వ్యాపార హోటళ్ల విభాగాలను వర్గీకరించినప్పుడు ఈ హోటల్ నగరంలోనే అతి ప్రాచీన హోటల్ గా చెప్పుకోవచ్చు.[2] హోటల్ చిరునామా: 2, బిన్నీ రోడ్, అన్నాసాలై, చెన్నై, తమిళనాడు- 600 002.

చరిత్ర

[మార్చు]

చెన్నై నగరంలో 160 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ హోటల్ అతి ప్రాచీన హోటల్ గా ప్రసిద్ధి గాంచింది. దీని చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుత తాజ్ కన్నెమర హోటల్ నిజానికి ట్రిప్లికేన్ రతనవేలు ముదలియార్ అనే వ్యక్తి యాజమాన్యంలో 1854 లో ఇంపీరియల్ హోటల్ పేరుతో నిర్మించారు. 1886లో మరో ఇద్దరు ముదలియార్ సోదరులు దీనిని అద్దెకు తీసుకున్న తర్వాత హోటల్ పేరును అల్బనీ గా మార్చారు. తిరిగి 1890లో ఈ హోటల్ ను కన్నెమర

పేరుతో పునః స్థాపించారు.[3] 1891లో స్పెన్సర్స్ హోటల్ యజమాని అయిన ఓక్ షాట్ ఇక్కడి అన్నా సర్కిల్ సమీపంలో ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడి 9 ఎకరాల స్థలంలో ఓ భారీ షోరూంను నిర్మించారు. ఆ తర్వాత ఆయన ఆసియా ఖండంలోనే పెద్ద దైన ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ ను నిర్మించాలని అనుకున్నాడు. స్పెన్సర్స్ దర్శకుడైన జేమ్స్ స్టివెన్ హోటల్ ఆధునీకరణ పనులను 1934లో ప్రారంభించి 1937లో పూర్తి చేశారు.[4] హోటల్ టవర్ కు ఆర్కిటెక్చర్ గా జెఫరీ బవ 1974లో పనిచేశారు. 1984లో తాజ్ గ్రూప్ ఈ హోటల్ ను కొనుగోలు చేసింది.[5]

2008లో ఈ హోటల్ చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రముఖ చరిత్ర కారుడు ముత్తయ్య “ఎ ట్రెడిషన్ ఆఫ్ మద్రాస్ దట్ ఈస్ చెన్నై- ది తాజ్ కన్నెమర” [2] పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. అంటే హోటల్ చరిత్ర తెలుసుకుంటే మద్రాసు చరిత్ర కూడా తెలుస్తుందన్నది రచయిత భావనగా చెప్పుకోవచ్చు. ఈ పుస్తకంలో ఈ హోటల్ గురించి గొప్పగా వర్ణించారు. దీంతో హోటల్ కు విస్తృత ప్రచారం లభించింది. పుస్తక రచయిత మద్రాసు నగరం గురించి, హోటల్ గురించి విస్తృత పరిశోధన చేసి, పాత మద్రాసు నగరానికి సంబంధించిన రోడ్లు, భవనాలు, హోటళ్లలోని ఇంటీరియర్స్ వంటి ఎన్నో అరుదైన ఫొటోలను పుస్తకంలో ముద్రించారు. అంతేకాదు 1939 నుంచి ఈ హోటల్ ధరల పట్టికను సేకరించి ఈ పుస్తకంలో ముద్రించారు.[4] అనేక విశేషాలను దీనిలో పొందుపరిచారు. ముత్తయ్య రాసిన పుస్తకం ప్రకారం బ్రిటీష్ వాళ్లు కన్నెమర హోటల్ గా ప్రపంచంలోనే ఉత్తమ హోటల్ రేటింగ్ ఇచ్చారు.[6]

సెప్టెంబరు 2010లో ఈ హోటల్ పేరును వివంత బై తాజ్ –కన్నెమర, చెన్నై గా మార్చారు.[7]

ప్రదేశం

[మార్చు]

చెన్నైలోని తాజ్ కన్నెమర హోటల్ కూమ్ నదీ తూర్పు ఒడ్డున గల బిన్నీ రోడ్ లోని అన్నాసాలై లో స్పెన్సర్ ప్లాజాను అనుకుని ఉంటుంది. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్పెన్సర్ ప్లాజా అనేది కూడా కూడా చెన్నైలో పేరెన్నిక గల ప్రదేశం.

సదుపాయాలు

[మార్చు]

ప్రస్తుతం తాజ్ కన్నెమర హోటల్లో 141 డబుల్ బెడ్ రూం గదులు, 9 సూట్లు సహా మొత్తం 150 గదులుంటాయి. ఈ హోటల్లో ఓ బాల్ రూం సహా 5 సమావేశ మందిరాలు ఉన్నాయి.[8] 400 మంది వరకు కూర్చునే విధంగా థియేటర్ వాతావరణంలో ఇవి ఉంటాయి. అదేవిధంగా కాక్ టైల్ కోసం 600 మంది వరకు పాల్గొనే విధంగా ఉంటుంది. అదేవిధంగా కాన్ఫెరెన్స్ హాల్ లో 30 కూర్చునే విధంగా థియేటర్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఈ హోటల్లోని వరండా సహా రెస్టారెంట్ లో 24 గంటల పాటు కాఫీ షాపు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా భారతీయ, కాంటినెంటల్, చైనీస్, థాయ్ దేశాలకు చెందిన ఆహార పదార్థాలు లభిస్తాయి. వివిధ రకాల కాక్ టేయిల్స్, స్పిరిట్స్, వైన్స్, బీర్, తేలిక రకపు స్నాక్స్ లభిస్తాయి. రాజుల కాలం నాటి వాతావరణాన్ని తలపించే సంగీతం, ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ లో దక్షిణ భారత దేశంలోని తమిళనాడు వంటి రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి రోజు రాత్రి ఉంటాయి. కాంటినెంటల్ లంచ్, రాత్రిపూట ప్రత్యేక డిన్నర్, మధ్యాహ్నం ప్రత్యేక లంచ్ వంటి సౌకర్యాలు ఉంటాయి.[9]

ఆధునికీకరణ

[మార్చు]

తాజ్ గ్రూపు లోని ఈ హోటల్లో ఉన్న మొత్తం 65 గదులను 2004లో ఆధునీకరించారు.[10]

బయటి లింకులు

[మార్చు]

సూచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Deluxe - India Hotels" (PDF). Worldwide Tours. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 6 Oct 2012.
  2. 2.0 2.1 "Taj Connemara proud symbol of our tradition". The Hindu. Chennai: The Hindu. 26 August 2008. Archived from the original on 28 ఆగస్టు 2008. Retrieved 3 Dec 2011.
  3. Kataria, Dayanad. "Inaugural Session" (PDF). Seminar on Conservation of Heritage Buildings/Precincts in Chennai Metropolitan Area. Chennai Metropolitan Development Authority. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 6 Oct 2012.
  4. 4.0 4.1 Haripriya, V. (25 August 2008). "Tracing its roots". Ergo 360°. Archived from the original on 8 మార్చి 2012. Retrieved 3 Dec 2011.
  5. Ramanathan, Malathi (5 September 2008). "Not just smiles and style". Business Line. Chennai: The Hindu. Retrieved 3 Dec 2011.[permanent dead link]
  6. "Chidambaram's bid to save Chennai's heritage". NDTV Travels Beta. Indo-Asian News Service. 25 August 2008. Retrieved 3 Dec 2011.
  7. "19 Taj Hotels migrate to a new brand" (PDF). Introducing a brand new signature in hospitality: Vivanta Hotels & Resorts by Taj. Taj Hotels. Archived from the original (PDF) on 23 సెప్టెంబరు 2010. Retrieved 6 Oct 2012.
  8. "Vivanta By Taj Connemara Rooms". cleartrip.com.
  9. "Taj Connemara". The Finest Hotels of the World. Archived from the original on 2 మే 2012. Retrieved 12 Nov 2011.
  10. "Taj gives a facelift to Connemara". The Times of India. Chennai: The Times Group. 9 February 2004. Archived from the original on 19 అక్టోబర్ 2014. Retrieved 3 Dec 2011. {{cite news}}: Check date values in: |archive-date= (help)