అక్షాంశ రేఖాంశాలు: 14°31′26″N 78°01′42″E / 14.523792153916908°N 78.02822844448815°E / 14.523792153916908; 78.02822844448815

తాతిరెడ్డి పల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాతిరెడ్డి పల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
తాతిరెడ్డి పల్లె is located in Andhra Pradesh
తాతిరెడ్డి పల్లె
తాతిరెడ్డి పల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°31′26″N 78°01′42″E / 14.523792153916908°N 78.02822844448815°E / 14.523792153916908; 78.02822844448815
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం లింగాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516390
ఎస్.టి.డి కోడ్

తాతిరెడ్డి పల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, లింగాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం. జనాభా సుమారు 1,000.

గతంలో కక్షలు, గృహదహనాలతో అట్టుడికిపోయిన తాతిరెడ్డిపల్లె గ్రామంలో నేడువర్గ కక్షలు తొలగిపోయినవి. అందరూ వొక్కటై 35 సంవత్సరాల తరువాత, తొలిసారిగా, 2014, ఏప్రిల్-13, ఆదివారం నాడు, గ్రామం మొత్తం వనభోజనాలకు వెళ్ళారు. గ్రామస్థులు అందరూ ఉదయాన్నే ఆలయాలలో పూజలుచేసారు. మహిళలు భక్తిశ్రద్ధలతో గంపలను ఎత్తుకొని పొలాలలోకి వెళ్ళినారు. బి.సి.కాలనీ సమీపంలోని చెట్లక్రింద వంటచేసి సామూహిక వనభోజనాలు చేసారు. దైనందిన జీవితంలో వ్యవసాయం, ఇంటి పనులతో తీరిక లేకుండా గడిపిన వారిలో ఇది నూతన ఉత్సాహాన్ని నింపింది. మహిళలు, పిన్నలు, పెద్దలు అనే వయోభేదం లేకుండా కబడ్డీ, పరుగు పందెం, క్యారంస్ వంటి ఆటలు ఆడారు. ఉత్సాహంగా ఊయలలు ఊగారు. సాయంత్రం, వరకూ అక్కడే సంతోషంగా గడిపి, అనంతరం ఇళ్ళకు చేరుకున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో గ్రామం ఆర్థికం చితికిపోయింది. మళ్ళీ పూర్వపు స్థితికి చేరడంతో అందరూ కలిసి మెలిసి, వనభోజనాలలో పాలు పంచుకున్నారు. ఇలా చేయడం వలన స్నేహం, సమైక్యత పెంపొందుతాయనీ, వర్షాలు బాగా కురుస్తాయనీ, మనస్పర్ధలు తొలగి అందరూ ఒకటౌతారని గ్రామస్తుల నమ్మకం.

మూలాలు

[మార్చు]