తారా శర్మ
తారా శర్మ (జననం 1977 జనవరి 11) బ్రిటిష్ నటి, వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా హోస్ట్ చేసిన తారా శర్మ షో కు సృష్టికర్త, సహ నిర్మాత కూడా.[1]
ఆమె 2002లో అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ఓం జై జగదీష్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె మస్తీ (2004), పేజ్ 3 (2005), ఖోస్లా కా ఘోస్లా (2006), మహారథి (2008), ముంబై కట్టింగ్ (2009), దుల్హా మిల్ గయా (2010), కడఖ్ (2019) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆమె హిందీ చిత్రాలతో పాటు, ఆమె ఇంగ్లీష్ టెలివిజన్ షోలు, రావెన్: ది సీక్రెట్ టెంపుల్ (2007), ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ (2008) వంటి సినిమాలలోనూ నటించింది.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె భారతీయ రచయిత పర్తాప్ శర్మ, బ్రిటిష్ రచయిత్రి, కళాకారిణి కూడా అయిన సుసాన్ శర్మల కుమార్తె.[2] ఆమె బొంబాయి ఇంటర్నేషనల్ స్కూల్, ఇటలీలోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ అడ్రియాటిక్ లలో చదువుకుంది. ఆ తర్వాత, ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
కెరీర్
[మార్చు]ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత, సిటీ బ్యాంక్, యాక్సెంచర్ లలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేసింది. ఆ తరువాత, ఆమె లక్మే, గార్నియర్, లిరిల్, పెప్సీ ప్రకటనలలో మోడల్ గా కెరీర్ మలచుకుంది. ఆ సమయంలోనే షారుఖ్ ఖాన్‌తో వచ్చిన ఒక వాణిజ్య ప్రకటన ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టేలాచేసింది.[3]
ఆమె అనుపమ్ ఖేర్ ఓం జై జగదీష్ (2002), తర్వాత సాయా (2003), మస్తీ (2004), పేజ్ 3 (2005), ఖోస్లా కా ఘోస్లా (2006) చిత్రాలలో నటించింది.[4]
స్త్రీలు, పిల్లల సమస్యలను చర్చించడానికని ఒక ప్లాట్‌ఫారమ్ ఉండాలని తారా శర్మ షోను ఆమె సృష్టించింది.[5] సహ-నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ షో ఆమెనె స్వయంగా హోస్ట్ చేసింది. పోగో, ఎన్డీటీవీ ఇమాజిన్, కలర్స్, నికెలోడియన్, స్టార్ వరల్డ్‌లలో ప్రసారమైన ఈ కార్యక్రమం ఐదు సీజన్‌లను పూర్తి చేసింది.[6] ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా ఈ ప్రదర్శనను వీక్షించడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె నవంబర్ 2007లో మీడియా వ్యవస్థాపకుడు రూపక్ సలూజాను వివాహం చేసుకుంది.[7][8] వారికి ఇద్దరు పిల్లలు జెన్, కై ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "The Tara Sharma Show". Archived from the original on 11 డిసెంబర్ 2019. Retrieved 3 November 2022.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Gene Junction: Tara Sharma Saluja". Verve Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). 8 March 2016. Archived from the original on 29 November 2019. Retrieved 10 February 2020.
- ↑ Methil Renuka (23 April 2001). "Pepsi ad girl Tara Sharma bags more modelling spots and a film : EYECATCHERS - India Today 23042001". India Today. Archived from the original on 14 October 2013. Retrieved 25 February 2017.
- ↑ "Tara Sharma wants to do more movies". Gulf News (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2018. Retrieved 10 February 2020.
- ↑ "Tara Sharma: My chat show imparts life lessons without being preachy". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 16 January 2020. Archived from the original on 17 January 2020. Retrieved 10 February 2020.
- ↑ "The Tara Sharma Show - Platform to discuss topical family & parenting issues". tarasharmashow.com. Archived from the original on 26 December 2019. Retrieved 26 December 2019.
- ↑ "Gene Junction: Tara Sharma Saluja". Verve Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). 8 March 2016. Archived from the original on 29 November 2019. Retrieved 10 February 2020.
- ↑ "Glitzy wedding of Tara Sharma - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 10 February 2020.
- 1977 జననాలు
- భారతదేశానికి వలస వచ్చిన బ్రిటిష్ వారు
- బ్రిటీష్ సినిమా నటీమణులు
- బ్రిటీష్ నేపథ్య గాయకుకులు
- భారత సంతతికి చెందిన బ్రిటీష్ ప్రజలు
- హిందీ సినిమా నటీమణులు
- భారతదేశంలోని యూరోపియన్ నటీమణులు
- లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థులు
- యునైటెడ్ వరల్డ్ కాలేజీ పూర్వ విద్యార్థులు
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)