తారుమారు
Appearance
తారుమారు (1941 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.జగన్నాథ్ |
---|---|
రచన | కొడవటిగంటి కుటుంబరావు |
తారాగణం | వేమూరి పరబ్రహ్మశాస్త్రి, డి.హేమలతాదేవి, కొడవటిగంటి కుటుంబరావు, జె.శంకరం |
గీతరచన | కొడవటిగంటి కుటుంబరావు |
సంభాషణలు | కొడవటిగంటి కుటుంబరావు |
నిర్మాణ సంస్థ | జగన్నాథ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
శ్రీ జగన్నాథ్ ప్రొడక్షన్, పతాకాన 'తారుమారు' చిత్రాన్ని హాస్యప్రధానంగా దర్శక నిర్మాత ఎస్.జగన్నాథ్ రూపొందించారు. వేమూరి పరబ్రహ్మశాస్త్రి, హేమలత, కొడవటిగంటి, జె.శంకరం నటించిన ఈ చిత్రం నిడివి ఆరు రీళ్లు మాత్రమే. బాలాంత్రపు రజనీకాంతరావు సంగీత దర్శకత్వం వహించారు. కొడవటిగంటి కుటుంబరావు, ఓ ఇంగ్లీష్ కథ ఆధారం చేసుకుని 'తారుమారు' కథ, మాటలు, పాటలు రాశారు. తాయెత్తు ద్వారా వశీకరణ చేసుకోవాలని భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు ప్రయోగం చేయడం ఈ చిత్ర ఇతివృత్తం.[1]