తిమ్మానగర్ (మెదక్ మండలము)
తిమ్మానగర్,తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా,మెదక్ మండలం, మక్తా భూపతిపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని గ్రామ పంచాయితీ హోదా కలిగిన శివారు గ్రామం.[1].ఈ గ్రామం మెదక్ పట్టణం నుండి 12 కి.మీ. దూరంలో ఉంది.
ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం.ఈ గ్రామంలో రెండు దేవాలయాలు ఉన్నాయి.అవి హరి హర దేవాలయం, గట్టు మైసమ్మ తల్లి దేవాలయం.హరి హర దేవాలయం దాదాపుగా 550 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా గ్రామ పెద్దలు చెబుతుంటారు. ఈ గట్టు మైసమ్మ తల్లి దేవాలయం తిమ్మానగర్ గ్రామం నుండి 3.7 కి.మీ.దూరంలో ఉంది.ఈ దేవాలయం అడవులకి పంట పొలాలకి మధ్య ఉంది. అక్కడ ప్రతి గురు, ఆదివారాలలో పండగలు జరుపుకుంటారు.పంచపాండవులు ఈ గ్రామం గుండా ప్రయాణించినట్టు గ్రామ ప్రజలు చెబుతుంటారు.పూర్వం ఈ గ్రామం కాకతీయుల పరిపాలనలో ఉండేది.ఆ తరువాత నిజాం పరిపాలనలో ఉండేది.భూపతిపూర్, తిమ్మానగర్ కలిసి ఒక గ్రామంగా ఉండేవి.కాని కొన్ని సంవత్సరాల తరువాత తిమ్మానగర్ ప్రత్యేక గ్రామ పంచాయితీగా వేరు చేయబడింది.ఇక్కడి విద్యార్థులు ఐదవతరగతి వరకు ఈ గ్రామంలో చదివి, పదవ తరగతి వరకు చదువుకోవటానికి పక్క గ్రామానికి (భూపతిపూర్) వెళ్లి చదువుకుంటారు.ఉన్నత విద్యకు మెదక్, హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతలకు వెళతారు.ఈ గ్రామ ప్రజలు దసరా, నల్లపోచమ్మ జాతరను చాలా వైభవంగా నిర్వహిస్తారు.
వెలుపలి లంకెలు
[మార్చు]- ↑ "గ్రామ దర్శిని, తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ రాజ్ & గ్రామీణాబివృద్ది శాఖ". Archived from the original on 2017-08-02. Retrieved 2018-10-17.