Jump to content

తిలక్ లేఖలు

వికీపీడియా నుండి

తిలక్ లేఖలు దేవరకొండ బాలగంగాధర తిలక్ తెలుగులో రచించబడిన లేఖల సంకలనం. ఇది 1968లో ముద్రించబడినది.

సంకలనం

[మార్చు]

తిలక్ ఎందరో కవిమిత్రులకు ఎన్నో లేఖలు వ్రాశారు. వాటిలో సుమారు 70 లేఖలు లభించాయి. 1966లో తిలక్ మరణానంతరం తణుకులోని ఆయన మిత్రులు, అభిమానులు ముఖ్యంగా శ్రీమతి మోగంటి మాణిక్యాంబాదేవి, "తిలక్ సాహితీ సరోవరము" అనే సంస్థను స్థాపించారు. తిలక్ ఆమెకు వ్రాసిన లేఖలతో బాటు సోమసుందర్, వరవరరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, మిరియాల రామకృష్ణ, జానకీ జాని లాంటి మిత్రులకు వ్రాసిన లేఖలు మొత్తం 63 సేకరించారు. ఆమె 1968 జూన్ నెలలో "తిలక్ లేఖలు" అనే పేరుతో 76 పుటల లేఖలు, మరో 62 పుటల వ్యాసానుబంధం, 6 పుటల పీఠికను కలిపి మొత్తం 144 పేజీల గ్రంథాన్ని ప్రచుతించారు.[1]

తిలక్ సాహితీ సరోవరం లేఖలు

[మార్చు]

తిలక్ అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ గారికి 1952-1966 మధ్యకాలంలో 22 లేఖలు వ్రాశారు. అలాగే వరవరరావు గారికి 1963-1966 మధ్య 17 లేఖలు వ్రాశారు. మిరియాల రామకృష్ణగారికి 1961-66 కాలంలో 15 లేఖలు పంపారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారికి 1964లో ఒక పెద్దలేఖ వ్రాశారు. ఒక సంవత్సరకాలంలో (1961-62) మోగంటి మాణిక్యాంబాదేవి గారికి 8 సుదీర్ఘమైన లేఖలు వ్రాశారు. తంగిరాల సుబ్బారావుగారి ప్రకారం ఈ లేఖల్లో తిలక్ హృదయం, ఆత్మ ఆవిష్కరించబడ్డాయి.

నవత లేఖలు

[మార్చు]

తిలక్ 1964-66 కాలంలో దిగంబరకవులు అయిన నగ్నమునికి, నిఖిలేశ్వర్కి, అబ్బూరి గోపాలకృష్ణకి, శిష్ట్లా జగన్నాథం గార్లకి మొత్తం ఏడు లేఖలు వ్రాశారు. ఇవి నవత పత్రికలో ప్రచురించబడ్డాయి.

మూలాలు

[మార్చు]
  1. దేవరకొండ బాలగంగాధర తిలక్ లభ్యరచనల సంకలనం, తంగిరాల వెంకట సుబ్బారావు (సంపాదకులు) మనసు ఫౌండేషన్ వారి సహకారంతో ఎమెస్కో, 2013.