తీతువుపిట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తీతువుపిట్ట
Vanellus indicus indicus
Calls
Scientific classification Edit this classification
Unrecognized taxon (fix): Vanellus
Species:
Binomial name
Template:Taxonomy/VanellusVanellus indicus
(Boddaert, 1783)
Bounding distribution range
Synonyms

Hoplopterus indicus
Lobivanellus indicus
Lobivanellus goensis
Tringa indica
Sarcogrammus indicus

తీతువుపిట్టను ఇంగ్లీషులో Red Wattled lpapwing(Vanellus indicus) ఏసియన్ లాప్ వింగ్ అని లేక పెద్ద ప్లౌ అని, Chardriidle కుటుంబానికి చెందిన వేడర్ర్ అని అంటారు. వీటిలో నాలుగు ఉప జాతులు ఉన్నాయి. ఈ పిట్ట ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇండస్ లోయ అంతటా, భారతదేశం అంతటా, శ్రీలంక వరకు కనిపిస్తుంది. శ్రీలంకవి కొంచం ఆకారంలో చిన్న పిట్టలు. ఆడ, మగ ఒకేరకంగా ఉంటాయి, 14 అంగుళాల వరకు పొడవు, మగవాటి రెక్కలు అయిదు శాతం పెద్దవిగా ఉంటాయి. తేలిక మట్టిరంగు లేక తేలిక బ్రౌన్ వర్ణంలో రెక్కలపయిన ఆకుపచ్చని రంగురేఖ కనిపిస్తుంది. కళ్ళముందు వెనక నలుపు, కంటికిముండు యెరుపురంగు మచ్చ, ముక్కుకొన మాత్రం నలుపు, మిగతా భాగం ఎరుపు వర్ణం, మెడ ముందు, వెనక నలుపు, పొడవాటి కాళ్ళు పసుపురంగులో ఉంటాయి. తీతువుపిట్టలు పొలాల్లో, బీళ్లల్లో, వ్యవసాయ పొలాల్లో, అడవి కొట్టగా ఏర్పడిన నీటి చెలమలవద్ద, పల్చగా ఉన్న నీటిమడుగుల వద్ద, రెండో మూడో పక్షులు మేస్తూ కనిపిస్తాయి. ఎప్పుడయినా 20-నుంచి 200 దాక గుంపు మేస్తూ కనిపించవచ్చు. పురుగులు, జలచరాలు, నత్తలు, ధాన్యం గింజలు, అన్నీ ఆహారమే. రాత్రి, పగలు ఈ పక్లులు ఆహార సేకరణలో ఉంటాయి. ప్రత్యేకంగా వెన్నెల రాత్రుల్లో ఆహార సంపాదనలో కనిపిన్తాయి. మార్చి ఆగస్టు నెలల మధ్య బీళ్లల్లో గడ్డిగాదం, కొయ్యగాళ్ళ దుగ్గులో, బండరాళ్ళ నడుమ గుడ్లు పెడతాయి. యెప్పుడయిన మానవ ఆవాసాలలో ఇండ్లకప్పపుల పయిన గుడ్లు పెడతాయి. గుడ్లపైన చిన్న చిన్న మచ్చలవల్ల అవి పరిసరాలలో కలసిపోయి, వాటిని తినే జంతువులకు కనిపించవు. ఆడ, మగ పిట్టలు పొదుగుతాయి. సుమారు 26-30 రోజులలో పిల్లలవుతాయి. పిల్లలు తల్లి పిట్టను అనుసరించి ఆహార సేకరణలో చేరతాయి. పొదిగిన గుడ్లలో సుమారు 40 శాతం మాత్రమే పెరిగి పెద్దవవుతాయి. తీతువుపిట్ట నిరంతరం తన జాగ్రత్తలో ఉంటుంది. ఏమాత్రం మనుషుల, జంతువుల అలికిడయినా హెచ్చరికగా పెద్దగా "ఉత్తీతు ఉత్" అని అరిచి పక్షులను, జంతువులను హెచ్చరిస్తుంది. దొంగలకు, వేటగాళ్ళకు చాలా ఇబ్బంది. తీతువుపిట్ట ఎప్పుడూ అరుస్తూ రణగొణధ్వని చేస్తూ ఉంటుంది కనుక సమీపంలో ఉండే వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

  1. BirdLife International (2016). "Vanellus indicus". IUCN Red List of Threatened Species. 2016: e.T22694013A89569039. doi:10.2305/IUCN.UK.2016-3.RLTS.T22694013A89569039.en.