తుతార్లు
Jump to navigation
Jump to search
తుతార్లు వాయు ఫూరక సంగీత వాద్య పరికరము. ఇవి జంటగా వుంటాయి. నాదస్వరం ఆకారంలో వుండి అంతకన్న చిన్నవిగా వుంటాయి. ఈ గొట్టాకారపు పరికరాలు లోహంతో కూడ చేస్తారు.
ఉపయోగము
[మార్చు]వీటిని కేవలం దేవుని సంబందమైన పనులకు అనగా పూజలు, దేవుని పెళ్ళి, దేవుని వూరేగింపు మొదలైన కార్య క్రమాలకు మాత్రమే వాడుతారు. మిగతా ఎటువంటి సంగీత కార్య క్రమాల్లోను వీటిని ఉపయోగించరు. గుడులలో కొమ్ము వాయిద్యాన్ని అప్పుడప్పుడూ వూది నట్లే.... తుతార్లను కూడ కొంత విరామం తర్వాత అప్పుడప్పుడు వూదుతారు. ఇవి రెండు అయినందున శబ్దం కూడ జంటగా వస్తుంది. దీని శబ్దం వినసొంపుగానుండి చాల దూరం వరకు వినిపిస్తుంది.
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |