తులసి కుటుంబము
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(సెప్టెంబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
తులసి మొక్క:
- డళ వలయము
- సంయుక్తము. ఓష్టాకారము
- కింజల్కములు నాలుగు. రెండు పెద్దవి రెండు చిన్నవి. ఇవి దళవలయము యొక్క అడుగు భాగము నంతు కొని యుండును.
అండ కోశము: అండాశయము ఉచ్చము. రెండు గదులు అండములు 4 కాయ నాలుగు చీలికలుగానగును. కీలము అండాశయము అడుగు నుండి బయలు దేరు చున్నది. కీలాగ్రము రెండు చీలికలు.
- రుద్ర జడను తోటలలో బెంచు చున్నారు.
- ప్రకాండము
- నాలుగు పలకలుగా నున్నది.
- ఆకులు
- అభిముఖ చేరిక. లఘు పత్రములు. తొడిమ పొడుగు. కణుపు పుచ్చములు లేవు. పత్రము అండాకారము. కొన సన్నము. విషమ రేఖ పత్రము. ఈనెల మీద రోమములు గలవు.
- పుష్ప మంజారి
- కొమ్మల చివరల నుండి గాని, కణుపు సందులనుండి గాని కంకులు. వీని మీద ఒక్కొక చోట మూడేసియో నాల్గేసియో పువ్వులు ఉన్నాయి. వీని క్రింద చేటికలు గలవు. వీనిలో మధ్య పుష్పము మొదట వికసించును గాన నివి మధ్యారంభ మంజరులు. పువ్వులు చిన్నవి. ఆసరాళములు.
- పుష్ప కోశము
- సంయుక్తము ఓష్టాకారము. పై పెదవి కొంచెము గుండ్రముగా నున్నది. క్రింది దానికి నాల్గు దంతములు గలవు నీచము.
- దళవలయము
- ఆరంగుళముల లోపుగా నుండును. సంయుక్తము ఓష్టాకారము. పైపెదవికి నాల్గు దంతములు గలవు.
- కింజల్కములు
- 4 దళవలయపుటడుగు పెదవిపై నున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాకారము ఇవి ఒక చోటనే పగులును.
- అండ కోశము
- అండాశయము ఉచ్చము. దీనికి నాల్గు తమ్మెలున్నవి. కీలము ఈ తమ్మెల మధ్య నుండి వచ్చును. కీలాంగ్రము రెండు చీలికలు. ఇది పుష్ప కోశములో నడగి యుండును. పగిలి నాలుగగా చీలును. ఇవి గింజలను కొందుము గాని నిజమైన గింజలు వీనిలోపల నొక్కటి గలదు.
ఈ కుటుంబములోని మొక్కలు చిన్నవి. వాని యాకులు అభిముఖ చేరిక. వానికి గణుపు పుచ్ఛములు లేవు. ఆకులకు కొమ్మలకు ఒక విధమగు వాసన గలదు. పుష్ప కోశము సాధారణముగా కాయతో బెరుగు చుండును. దళ వలయము ఓష్టాకారము. కింజల్కములు నాలుగు. అండాశయము ఉచ్చము. కీలము అండాశయమున కడుగున నుండి వచ్చును. ఇదియే ముఖ్య లక్షణము. కాయలెండి పగులును. ఈ కుటుంబము అడ్డసరపు కుటుంబమును టేకు కుటుంబమును పోలి యుండును. ఈ కుటుంబపు మొక్కలలో గింజల్కములు నాలుగో రెండో పై జత పెద్దదో, అడుగు జత పెద్దదో, పుప్పొడి తిత్తులు కలిసియున్నవో విడిగా యున్నవో మొదలగు అంశములను బట్టి జాతులుగను, తెగలుగను విభజించి యున్నారు.
తులసి మొక్క మనకు మిగుల గౌరవ మైనది. దానిని మనము పూజింతుము.
రామ తులసి కృష్ణ తులసి కంటే (పైదాని కంటే) ఎక్కువ వాసన వేయును. దీని ఆకులు నిడివి చౌక పాకారము.
రుద్ర జడ ఆకులు మంచి వాసన వేయుటచే దానిన తోటలలో బెంచు చున్నాము. దీని గింజలు నీళ్ళలో వేసిన ఉబ్బును. వీనిని ఔషధములలో గూడ వాడుదురు.
మంచి తుమ్మి ఒకటి రెండడుగులు ఎత్తు పెరుగును. దీని మీద దట్టముగ రోమములు గలవు. ఇది వర్షాకాలములో పుష్పించును. దీనికిని మంచి వాసన గలదు. మూలం: https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:VrukshaSastramu.djvu పూఅల్లాతుమ్మి పలు చోట్ల పెరుగు చున్నది. దీని ఆకులు దూర దూరముగా నుండును. పువ్వులు తెలుపు, వీని తోడ పూజ చేతురు.
గరుస తుమ్మి పై రెండింతి నుండి కొంచము పుష్ప వైఖరిలో భేదించును.
కొండజాజి కొండల మీద పెరుగును. ఆకులు సన్నము. పువ్వులు గులాబి రంగుగాను మంచి వాసన గాను వుండును.
- పచ్చాకు
- కచ్చూరములతో గలిపి నూనెలో వేసి కొను పచ్చాకు మొక్క ఈ కుటుంబము లోనిదే. కాని అంగళ్ళ యందు అమ్ము పచ్చాకు సాధారణము రెండు మూడు జాతుల ఆకులు కలిసి యున్నవి. పచ్చాకు మొక్కలు మన దేశములో అంతగా పెరుగుట లేదు. దీనికి రాగడి నేల గావలయును. చిన్న మొక్కలను దూర దూరముగ గోతులు దీసి పాతి, వానికి ఎండ దుగులనీయ కుండ కాపాడుదురు. అవి పెద్దవైన పిదప వానిని నరికి, పగలు ఎండలో బెట్టుచు రాత్రి మంచు దగుల నీయకుండ కప్పు చుందురు.
లవండరు నిచ్చెడు మొక్క కూడా ఈ కుటుంబము లోనిదే గాని మన దేశములో పెరుగుటయే లేదు.
- పుదీన
- తోటల యందు పెరుగు చిన్న మొక్క. కింజల్కములు దళవలయముల కంటే బొడుగుగా నుండును. ఆకులుకు కొంచము ఘాటు వాసన గలదు. ఈ ఆకును అరోగ్యకర మందురు.
- పర్ణము
- అస్ఫుట దళ వంతము.