తులసీ తాంతీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తులసీ తాంతీ
జననం1958 ఫిబ్రవరి 2
రాజ్‌కోట్‌, గుజరాత్‌
మరణం2022 అక్టోబరు 1
పూణే
మరణ కారణంగుండెపోటు
వృత్తిసుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్‌
ప్రసిద్ధివిండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా
భార్య / భర్తగీత
పిల్లలుప్రణవ్‌ (కుమారుడు ), నిధి (కుమార్తె)
Notes
భారతదేశంలో గ్లోబల్ వెల్త్ క్లబ్ లిస్ట్ లో 8వ స్థానంలో ఉన్నాడు.

తులసీ తాంతీ (ఆంగ్లం: Tulsi Tanti; 1958 ఫిబ్రవరి 2 - 2022 అక్టోబరు 1) సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రసిద్ధి చెందిన భారతీయ వ్యాపారవేత్త. ఆయన 2006లో ప్రపంచంలోని ఇద్దరు అత్యంత సంపన్న ఇంధన వ్యాపారవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందాడు.[1]

1995లో స్థాపించిన సుజ్లాన్‌ ఎనర్జీ 19.4 గిగావాట్ల సామర్థ్యం, 34 శాతం మార్కెట్‌ వాటాతో భారతదేశంలోనే కాక మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పవన విద్యుత్ సంస్థగా ఎదిగింది. సుమారు 17 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

జీవితం తొలి దశలో[మార్చు]

1958లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తులసీ తాంతీ జన్మించారు. ఆయన గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం వ్యాపారంలోకి ప్రవేశించిన ఆయన 1995లో సుజ్లాన్‌ ఎనర్జీని స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.8,535.9 కోట్లు.

కెరీర్[మార్చు]

తులసీ తాంతీ వృత్తిరీత్యా ఇంజనీర్, ఒక చిన్న టెక్స్‌టైల్ సంస్థకు యజమాని, నిర్వాహకుడు. అస్థిరమైన విద్యుత్ సరఫరాతో ఇబ్బంది పడి, సమస్యను పరిష్కరించడానికి ఆయన రెండు విండ్ టర్బైన్‌లను కొనుగోలు చేశాడు. చివరికి ఆయన విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందాడు.[2] మే 2006 నుండి బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న విండ్ టర్బైన్ గేర్‌బాక్స్‌ల తయారీదారు అయిన జెడ్‌ఎఫ్‌ విండ్ పవర్ ఆంట్‌వెర్పెన్(ZF Wind Power Antwerpen) ఛైర్మన్‌గా వ్యవహరించారు.[3] అంతే కాకుండా ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్య’కు అధ్యక్షుడిగానూ పనిచేశారు. భారతదేశం గ్లోబల్ వెల్త్ క్లబ్ లిస్ట్ లో ఎనిమిదో స్థానంలో ఉన్న తులసీ తాంతీ[4] ఫోర్బ్స్ 2008 బిలియనీర్ బ్లోఅప్‌ల జాబితాలోనూ చోటుచేసుకున్నాడు.[5]

మరణం[మార్చు]

64 ఏళ్ళ తులసీ తాంతీ 2022 అక్టోబరు 1న గుండెపోటుతో మరణించారు.[6] ఆయన అహ్మదాబాద్‌ లో ఓ కార్యక్రమం హాజరు అయి పూణేకు తిరుగు ప్రయాణంలో గుండెనొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకునేలోపే తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య గీత, కుమారుడు ప్రణవ్‌, కుమార్తె నిధి ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. Development policy as a way to manage climate change risks. Bert Metz, M. T. J. Kok (2015 ed.). London. p. 141. ISBN 978-1-136-56819-0. OCLC 1050521561.{{cite book}}: CS1 maint: others (link)
  2. Lama, HRH the Dalai (2011). The Leader's Way : Business, Buddhism and Happiness in an Interconnected World. Laurens van den Muyzenberg. London: Nicholas Brealey Pub. ISBN 978-1-85788-421-0. OCLC 784883396.
  3. "'Wind man of India' Suzlon Energy chairman Tulsi Tanti passes away". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-10-02. Retrieved 2022-10-02.
  4. Hiscock, Geoff (2008). India's global wealth club : the stunning rise of its billionaires and the secrets of their success. Hoboken, N.J.: Wiley. pp. 30, 156. ISBN 978-0-470-82238-8. OCLC 173718757.
  5. Pratiyogita Darpan. March 2009. p. 1580. ISSN 0974-6390.
  6. "Tulsi Tanti: 'విండ్‌మ్యాన్ ఆఫ్‌ ఇండియా' తులసీ తాంతీ ఇకలేరు". web.archive.org. 2022-10-02. Archived from the original on 2022-10-02. Retrieved 2022-10-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)