తూము (కొలత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రాసు - ఇది ఒక కొలిచే పద్ధతి

ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.

బరువులు, కొలతల ఇంపీరియల్ నియంత్రణను అంగీకరిస్తున్న శాసనంతో కాంస్య మోడియస్ కొలత (సా.శ. 4 వ శతాబ్దం)

వివరణ[మార్చు]

ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.[1][2]

  1. రెండు ఇరసలు ఒక తూము.
  2. నాలుగు కుంచాలు ఒక తూము.
  3. 16 మానికలు ఒక తూము.
  4. రెండు తూములను ఇద్దుము అంటారు.
  5. నాలుగు తూములను నలుతుము అంటారు.
  6. అయిదు తూములను ఏదుము అంటారు.
  7. ఏడు తూములను ఏడ్దుము అంటారు.
  8. ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.
  9. తొమ్మిది తూములను తొమ్మందుము అంటారు.

మూలాలు[మార్చు]

  1. "ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-09-09. Retrieved 2020-05-08.
  2. "అలనాటి కొలతలు, ద్రవ్యం | జాతర | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2020-05-08.[permanent dead link]