తృప్తి భోయిర్
Jump to navigation
Jump to search
తృప్తి భోయిర్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
తృప్తి భోయిర్ మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.[1] అనేక మరాఠీ సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. అగద్బం సినిమాలోని నాజూక పాత్రతో గుర్తింపు పొందింది.[2]
జననం, విద్య
[మార్చు]తృప్తి 1980 మే 17న మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. యశోధం హైస్కూల్ & జూనియర్ కాలేజీలో చదువుకున్నది.
నటనారంగం
[మార్చు]తొలినాళ్ళలో నాటకరంగంలో నటిగా రాణించింది. నాటక పోటీల్లో పాల్గొనడంతోపాటు శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకుంది. కాలేజీ రోజుల్లో ఉత్తమ నటనకు రాష్ట్రస్థాయి అవార్డులు గెలుచుకుంది.[3] తృప్తి నటించిన టూరింగ్ టాకీస్ అకాడమీ అవార్డుల ఉత్తమ చిత్ర విభాగంలో మొదటి రౌండ్ అర్హతలో 290 ఇతర చిత్రాలతోపాటు షార్ట్‌లిస్ట్ చేయబడింది.[4]
నటించినవి
[మార్చు]నటిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | నిర్మాత | పాత్ర |
---|---|---|---|---|
2000 | బాగ్ హాట్ దఖావన్ | విశాల్ బహందారి | ప్రదీప్ గార్గ్ | |
2008 | తుఝ్యా మాఝ్యా సంసారాల ఆని కాయ్ హవ్ | సతీష్ మోట్లింగ్ | తృప్తి భోయిర్ | |
2010 | అగద్బం | సతీష్ మోట్లింగ్ | తృప్తి భోయిర్ | నాజూకా |
2011 | హలో జై హింద్ | గజేంద్ర అహిరే | తృప్తి భోయిర్ | దుర్గ |
2012 | ఉచలా రే ఉచలా | యశ్వంత్ చౌఘులే, అమోల్ భావే | యశ్వంత్ చౌఘులే | కామిని |
2013 | టూరింగ్ టాకీస్ | గజేంద్ర అహిరే | తృప్తి భోయిర్ | చండీ |
2018 | మజా అగద్బమ్ | నాజూకా |
నిర్మాతగా
[మార్చు]- టూరింగ్ టాకీస్
- హలో జై హింద్
- తుఝ్యా మాఝ్యా సంసారాల ఆని కాయ్ హవ్
- అగద్బం
- మఝా అగద్బమ్
టెలివిజన్
[మార్చు]- చార్ దివాస్ ససుచే
- వదల్వాట్
నాటకరంగం
[మార్చు]- ఇంద్రాక్షి (సహ్యాద్రి ప్రొడక్షన్)
- సాహి రే సాహి
మూలాలు
[మార్చు]- ↑ "Trupti Bhoir". Gomolo. Archived from the original on 2016-03-04. Retrieved 2022-12-09.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "'Maaza Agadbam': Reasons to watch the Trupti Bhoir and Subodh Bhave starrer". The Times of India (in ఇంగ్లీష్). 2018-10-25. Retrieved 2022-12-12.
- ↑ "Trupti Bhoir is Gabbar Singh's female version". The Times of India. 12 January 2017. Retrieved 2022-12-12.
- ↑ "Trupti Bhoir's Marathi film reaches the Oscars". Retrieved 2022-12-12.