తెప్పకాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెప్పకాడు
తెప్పకాడు లాగ్ హౌస్, మార్చి 2021
తెప్పకాడు లాగ్ హౌస్, మార్చి 2021
Country India
Stateతమిళనాడు
Districtనీలగిరి జిల్లా
Languages
 • Officialతమిళం
Time zoneUTC+5:30 (IST)
Telephone code04262
Vehicle registrationTN 43 Z

తెప్పకాడు తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాకు చెందిన గ్రామం. ఇది 188.57 కిమీ2 (72.81 చదరపు మైళ్ళు) విస్తరించి ఉన్న ముదుమలై గ్రామంలో భాగం. ఇది పశ్చిమ తమిళనాడులోని ముదుమలై నేషనల్ పార్క్‌లో భాగమైన రిజర్వ్ ఫారెస్ట్‌ను కలిగి ఉంది. ఇది కర్ణాటకకు దక్షిణంగా ఉంటుంది. బెంగుళూరు నుండి మైసూర్ మీదుగా తెప్పకాడు చేరుకోవడానికి 240 కి.మీ.[1] 2011 జనాభా లెక్కల ప్రకారం 1,694 మంది జనాభాను కలిగి ఉంది.[2][3]

ఎలిఫెంట్ క్యాంప్‌[మార్చు]

మార్చి 21లో తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌ ప్రాంతంలోని మోయార్ నదిలో ఏనుగు జలకాలాటలు

ముదుమలై నేషనల్ పార్క్‌లోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ పర్యాటక ఆకర్షణకు నెలవాలం. కలప వ్యాపారులు ఉపయోగించే ఏనుగుల కోసం 1910లో ఈ శిబిరం ఏర్పడింది.[4]

ప్రభుత్వం అడవులను స్వాధీనం చేసుకున్న తర్వాత, పని చేసే ఏనుగులు లేదా కుమ్కీలు ఇప్పుడు అనేక రకాల పనులు చేస్తున్నాయి. పర్యాటకుల సవారీలకు, వర్షాకాలంలో పెట్రోలింగ్ కోసం వీటిని ఉపయోగిస్తారు.[5]

ఇక్కడ రఘు, అమ్ము అనే రెండు ఏనుగు పిల్లలను బొమ్మన్‌, బెల్లీ దంపతులు పెంచిన తీరును ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ లఘుచిత్రం డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ కేటగిరిలో అవార్డును గెలుచుకుని ఆ విభాగంలో మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.

ప్రధాని పర్యటన[మార్చు]

2023 ఏప్రిల్ 9న తెప్పకాడు ఎలిఫెంట్‌ క్యాంప్‌ ను సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా తినిపించాడు. ఈ సందర్భంగా ఆయన ఎలిఫెంట్ విష్పరర్స్‌ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్‌, బెళ్లి దంపతులు, అందులో కనిపించిన ప్రతినిధులు, నిర్మాత దర్శకులు, మావటిలతో ముచ్చటించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Theppakadu". greenwaysroad.com. Archived from the original on 2013-10-29. Retrieved 2013-09-24.
  2. District Census Handbook The Nilgiris: Village and Town Wise Primary Census Abstract (PCA) (PDF). Vol. PART XII-B. Directorate of Census Operations Tamil Nadu. 2011. p. 88.
  3. Schlögl, Walter (23 Oct 2011). "Node: Thepakkadu (287835457)". OpenStreetMap. Archived from the original on 20 Mar 2022. Retrieved 20 Mar 2022.
  4. District Census Handbook The Nilgiris: Village and Town Directory (PDF). Vol. PART XII-A. Directorate of Census Operations Tamil Nadu. 2011. p. 66.
  5. Radhakrishnan, D. (4 Aug 2010). "100 years: Theppakadu Elephant Camp going strong". The Hindu. Archived from the original on 21 Apr 2013.