తెలంగాణ గ్రంథాలయ పరిషత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణలో అతి పురాతన గ్రంధాలయం శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, హైదరాబాదు దృశ్యచిత్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఏర్పాటైంది. ఇండియన్‌ పబ్లిక్‌ లైబ్రరీ మూవ్‌ మెంట్‌ (గ్లోబల్‌ లైబ్రరీస్‌, బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వారు నాస్కామ్‌ ఫౌండేషన్‌ మద్దతుతో) స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పౌర గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించుటకు చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో అంతర్జాల సేవలను, కంప్యూటర్‌ సేవలను ఉచితంగా చదువరులకు అందిస్తుంది. చదువరులకు అవసరమైన పుస్తకాలను (పోటీ పరీక్షలకు, దిన, మాస పత్రికలు, పీరియాడికల్స్‌) ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో తెస్తున్నవి. నూతన జిల్లాల అవిర్బావం తరువాత ప్రతి జిల్లాలో భవన నిర్మాణం, హైదరాబాదు మహానగరం లో నాలుగు ప్రధాన గ్రంథాలయాలు నిర్మాణం చేపట్టింది.ఉద్యోగులకు నైపణ్యాలు పెంపొందించడానికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టుతుంది. ఇదే కాక గ్రంథాలయ ఉద్యమానికు సంబంధించి జాతీయ సదస్సుల నిర్వహణకు తోడ్పాటునందిస్తోంది[1]తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడుగా డా మహమ్మద్ రియాజ్ నియమించబడ్డారు . [2]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "తెలంగాణ గ్రంథాలయాల సౌరభం". తెలంగాణ ప్రభుత్వం. 2019-06-04. Archived from the original on 2020-01-13. Retrieved 2020-01-18.
  2. "గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా అయాచితం శ్రీధర్". నమస్తే తెలంగాణ. Archived from the original on 2018-09-10. Retrieved 2017-02-16.

వెలుపలి లంకెలు[మార్చు]