Jump to content

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

వికీపీడియా నుండి
(తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
నినాదం సర్వే భవంతు సుఖినా
అందరు సంతోషంగా ఉండాలి
Agency overview
Formed 2019
Legal personality Governmental: Government agency
Jurisdictional structure
Federal agency [[ భారతదేశం]]
General nature
Operational structure
Headquarters నాంపల్లి, హైదరాబాద్
Agency executive జస్టిస్‌ గుండా చంద్రయ్య, ఛైర్మన్‌

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ 2019లో ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014, సెక్షన్‌ 5 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ (ఏపీహెచ్‌ఆర్‌సీ) నుంచి టీఎస్ హెచ్‌ఆర్‌సీని విభజించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన నుంచి ఏపీహెచ్‌ఆర్‌సీనే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఫిర్యాదులను అధికారులు వేర్వేరుగా స్వీకరిస్తున్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం నాంపల్లిలోని గృహకల్పలో ఉంది.[1]

నియామకం, పదవీ కాలం

[మార్చు]

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. కమిషన్ ఛైర్మన్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని గవర్నర్ నియమిస్తారు. ఒక సభ్యుడు హైకోర్టులో పదవిలో ఉన్న లేదా హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి కానీ కనీసం 7 సంవత్సరాలు జిల్లా న్యాయమూర్తిగా చేసిన అనుభవం ఉండాలి. మరో సభ్యుడు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 70 ఏళ్లు వచ్చే వరకు ఉంటుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను గవర్నర్‌ నియమిస్తాడు. వీరిని తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.[2]

ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పడే ఆరుగురు సభ్యుల అత్యున్నత అధికార కమిటీ వీరి నియామకంలో గవర్నర్‌కు సలహాలిస్తుంది. రాష్ట్రంలో శాసనమండలి ఉన్నట్లయితే శాసనమండలి ఛైర్మన్, ప్రతిపక్ష నాయకులను ఈ కమిటీలో ఉంటారు

  1. . రాష్ట్ర ముఖ్యమంత్రి (కమిటీకి ఛైర్మన్‌)
  2. . రాష్ట్ర శాసనసభ స్పీకర్‌
  3. . రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
  4. . రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు
  5. . శాసన మండలి చైర్మన్‌
  6. . రాష్ట్ర హోం శాఖ మంత్రి

విధులు

[మార్చు]
  • మానవ హక్కుల ఉల్లంఘన జరిగే విచారణను చేపడు తుంది.
  • ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలను, జైళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం
  • మానవ హక్కులకు భంగం జరుగుతున్న కేసుల విచారణ న్యాయస్థానంలో వాయిదా పడినపుడు జోక్యం చేసువడం
  • మానవ హక్కుల గురించి ప్రజల మధ్య ప్రచారం చేయడం, ఆ హక్కులకు గల రక్షణల గురించి వారికి అవగాహన కలిగించడం
  • రాష్ట్రంలో మానవ హక్కుల కాపలాదారుగా కమిషన్‌ వ్యవహరిస్తుంది. మానవ హక్కులను పెంపొందించడంలో అవసరమైన ఇతర చర్యలను చేపట్టడం.
  • మానవహక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, శాసన సభల చట్టాలను సమీక్షించి వాటిని ప్రభావవంతంగా అమలుచేయడానికి సూచనలివ్వడం

అధికారాలు

[మార్చు]

1.సివిల్ కోర్టుకున్న అధికారాలు ఉంటాయి.

    • ఎ) అఫిడవిట్లు, సాక్ష్యాధారాలు సేకరించడానికి.
    • బి) న్యాయస్థానం, ప్రభుత్వకార్యాలయం నుంచి అవసరమైన సమాచారం పొందడానికి..
    • సి) సాక్ష్యాలను విచారించడానికి, అధికార ప్రతులు పరిశీలించడానికి..

2.కమిషన్ తాను దర్యాప్తు చేస్తున్న కేసును మెజిస్ట్రేట్‌కు పంపడానికి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కేసును బదిలీ చేయడానికి అధికారం ఉంటుంది.

3.విచారణ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవచ్చు. ఆ సమయంలో ఆయా ఉద్యోగులు కమిషన్ పరిధిలో పని చేస్తారు.

చైర్మన్ , సభ్యులు

[మార్చు]
  • జస్టిస్‌ గుండా చంద్రయ్య - చైర్మన్‌ [3][4][5]
  • నడిపల్లి ఆనందరావు, సెషన్స్ రిటైర్డ్ జడ్జి (జ్యుడీషియల్) - సభ్యుడు
  • ముహమ్మద్ ఇర్ఫాన్ మొయినొద్దీన్ (నాన్ జ్యుడీషయల్) - సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. Andrajyothy (3 December 2019). "తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు". Archived from the original on 29 August 2021. Retrieved 29 August 2021.
  2. Nava Telangana (31 January 2020). "జాతీయ మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను ఎవరు నియమిస్తారు?". Archived from the original on 4 ఫిబ్రవరి 2020. Retrieved 29 August 2021.
  3. HMTV (24 December 2019). "హెచ్చార్సీ చైర్మన్‌ నియామకం". Archived from the original on 29 August 2021. Retrieved 29 August 2021.
  4. The Times of India (20 December 2019). "G Chandraiah new SHRC chief, CV Ramulu Telangana's first Lok Ayukta" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2021. Retrieved 29 August 2021.
  5. Sakshi Education (20 December 2019). "తెలంగాణ హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2021. Retrieved 29 August 2021.