జి.చంద్రయ్య
గౌరవ న్యాయమూర్తి జస్టిస్ జి. చంద్రయ్య | |
---|---|
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ | |
In office 20 డిసెంబరు 2019 – ప్రస్తుతం | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 10 మే 1954 తిమ్మాపూర్ గ్రామం , జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా , తెలంగాణ రాష్ట్రం |
కళాశాల | ఉస్మానియా యూనివర్సిటీ |
గుండా చంద్రయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. ఆయన 2019లో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]జి. చంద్రయ్య తెలంగాణ రాష్ట్రం , మంచిర్యాల జిల్లా , జన్నారం మండలం , తిమ్మాపూర్ గ్రామం లో జన్మించాడు. ఆయన తిమ్మాపూర్ గ్రామం లో మూడో తరగతి వరకు, తపలాపూర్‌లో పదో తరగతి పూర్తి చేసి ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్, బీఏ పూర్తి చేశాడు. జి. చంద్రయ్య ఉస్మానియా యూనివర్సిటీ లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాడు.[2]
వృత్తి జీవితం
[మార్చు]జి. చంద్రయ్య 1980 నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యి, ఐ.వెంకటనారాయణ దగ్గర చేరాడు. ఆయన 1991 నుండి 95 వరకు & 1999 నుండి నవంబరు 2002 వరకు సాంఘిక సంక్షేమ, మున్సిపల్ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశాడు. ఆయన 26 మే 2005న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 20 ఫిబ్రవరి 2006న శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా 09 మే 2016న పదవీవిరమణ చేశాడు.[3]
ఆయన 2019లో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా నియమితుడై, డిసెంబరు 23, 2019న భాద్యతలు చేపట్టాడు.[4]
అవార్డులు
[మార్చు]ఆయన 2020లో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హోదాలో పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికి గుర్తింపుగా నెల్సన్ మండేలా అవార్డ్,[5] న్యాయమూర్తిగా హైకోర్టులో మానవ హక్కుల కోసం నిరంతరం సేవలు అందిస్తూ మానవ హక్కుల పట్ల ఎంతో మందిని జాగతపరుస్తున్న ఆయన యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అవార్డు - 2020 అందుకున్నాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ HMTV (24 December 2019). "హెచ్చార్సీ చైర్మన్ నియామకం". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ Sakshi (20 December 2019). "లోకాయుక్తగా జస్టిస్ సీవీ రాములు". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ TSHC (2021). "THE HON'BLE SRI JUSTICE G. CHANDRAIAH". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ Sakshi (24 December 2019). "బాధ్యతలు స్వీకరించిన హెచ్చార్సీ చైర్మన్". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ Eenadu (2020). "జస్టిస్ చంద్రయ్యకు మండేలా అవార్డు". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ Nava Telangana (9 December 2020). "'యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అవార్డు-2020కి జస్టిస్ జి.చంద్రయ్య ఎంపిక'". Archived from the original on 9 సెప్టెంబరు 2021. Retrieved 9 September 2021.