తెలంగాణ రచయితల సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1953 అనేక సాహిత్య సన్నివేశాలకు తెరలేపిన సంవత్సరం. ఆలంపూరులో చిరస్మరణీయమైన సాహిత్య సభలు జరిగాయి. స్వయంగా ఉపరాష్ట్రపతి పాల్గొనటం, కాళో జీ నా గొడవను శ్రీశ్రీ ఆవిష్కరించటం, కవిసమ్మేళనం నిర్వహణ అన్నింటినీ కథలు కథలుగా చెప్పుకున్నారు. హైదరాబాదు కేంద్రంగా తెలంగాణ రచయితల సంఘం అప్పటికే ప్రారంభమయింది. ఈ సంఘం నగరంలోనూ, ఇతర జిల్లాలలోనూ అసంఖ్యాకంగా కవిసమ్మేళనాలను నిర్వహించింది. వీటిలో కాళోజీ, దాశరథి, వానమామలై, సినారెలు తమతమ ప్రత్యేకతలతో రాణిస్తూవచ్చారు. నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, శంకర్, వేణుసంకోజు, వి. ఆర్. విద్యార్థి వంటి కవులు, రచయితలు 2014లో సిద్ధిపేటలో తెలంగాణ రచయితల సంఘాన్ని పునః స్థాపించారు.