తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ
స్థాపన | 2015 ఏప్రిల్ 10 |
---|---|
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు, ఉర్దూ |
శాఖామంత్రి | కేసీఆర్ |
చైర్మన్ | సముద్రాల వేణుగోపాలాచారి |
మాతృ సంస్థ | తెలంగాణ నీటిపారుదల శాఖ |
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) అనేది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదలకు సంబంధించిన విషయాలకోసం ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది.
ప్రారంభం
[మార్చు]నీటిపారుదల అభివృద్ధి సంస్థ 2015 ఏప్రిల్ 10న స్థాపించబడింది.[1]
విధులు
[మార్చు]తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులతో చిన్న, సన్నకారు రైతులు, ఇతర బలహీన వర్గాల మెట్ట ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది.[2]
పరిపాలన
[మార్చు]ఈ సంస్థ తొలి చైర్మన్‌గా నియమించబడిన ఈద శంకర్‌రెడ్డి 2016 అక్టోబరు 26న బాధ్యతు స్వీకరించి, కొన్ని సంవత్సరాలపాటు పనిచేశాడు. అనంతరం 2022 డిసెంబరు 29న మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి రెండవ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేణుగోపాలచారి రెండేళ్ళపాటు ఈ పదవిలో ఉంటాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Telangana State Irrigation Development Corporation Limited Information". The Economic Times (in ఇంగ్లీష్). Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.
- ↑ "TSIDC – worksaccounts.com". Archived from the original on 2022-08-17. Retrieved 2022-12-29.
- ↑ Bureau, The Hindu (2022-12-29). "Venugopala Chary appointed TSIDC chairman". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.