Jump to content

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్

వికీపీడియా నుండి
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్)
తరహాపబ్లిక్
స్థాపన2015, మార్చి 26
ప్రధానకేంద్రము హైదరాబాదు, భారతదేశం
కీలక వ్యక్తులుకొండూరు రవీందర్‌రావు, చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్
పరిశ్రమఫైనాన్స్
వాణిజ్య బ్యాంకులు
వెబ్ సైటుhttps://tscab.org/

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒక సహకార బ్యాంక్.[1] నాబార్డు ద్వారా దేశంలోనే జాతీయ అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైంది.[2]

చరిత్ర

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1963లో హైదరాబాదు నగరంలోని హైదరాబాద్ సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రా రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ రెండూ విలీనమై, హైదరాబాదు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ (ఏపిసిఓబి) గా ఏర్పడింది. వ్యవసాయానికి పెట్టుబడి, ఉత్పత్తి క్రెడిట్ రెండింటినీ ఒకే ఏజెన్సీ ద్వారా అందించడానికి సింగిల్ విండో క్రెడిట్ డెలివరీ సిస్టమ్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా, 1994 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీర్ఘకాలిక పెట్టుబడి క్రెడిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ (ఏపిసిఓబి) తో విలీనం చేయబడింది.[3]

ఏర్పాటు

[మార్చు]

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, రెండు రాష్ట్ర సహకార బ్యాంకులుగా పునర్వ్యవస్థీకరించబడి 2015 ఏప్రిల్ 2 నుండి స్వతంత్రంగా పని చేయడం ప్రారంభించాయి. 2015 మార్చి 26న స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ రిజిస్టర్ (రిజిస్ట్రేషన్ నెం.TAB.321) చేయబడి, 2015 ఏప్రిల్ 2 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది.[3]

లక్ష్యాలు

[మార్చు]
  1. సమర్థవంతమైన నాయకత్వం, మార్గదర్శకత్వం, శిక్షణ, రీఫైనాన్స్ సేవలను అందించడం ద్వారా దేశంలోనే "ఉత్తమ రాష్ట్ర సహకార బ్యాంకు"గా అవతరించడం.[3]

అవార్డులు

[మార్చు]

ముంబైకు చెందిన బ్యాంకింగ్‌ ఫ్రంటియర్‌ మేగజైన్‌ ప్రకటించిందని అవార్డులలో నేషనల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకింగ్‌ సమ్మిట్‌ (ఎన్‌సీబీఎస్‌), ఫ్రాంటియర్స్‌ ఇన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకింగ్‌ అవార్డ్స్‌ (ఎఫ్‌సీబీఏ) నేతృత్వంలోని బ్యాంకింగ్‌ ఫ్రాంటియర్స్‌ వర్చువల్‌ మోడ్‌ పద్ధతిలో జాతీయ ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ ఎన్‌పీఏ నిర్వహణ, ఉత్తమ పెట్టుబడి, ఉత్తమ హెచ్‌ఆర్‌ ఆవిష్కరణ విభాగాలలో నాలుగు అవార్డులు వచ్చాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Telangana State Cooperative Apex Bank (TSCAB)". tscab.org/. Archived from the original on 2021-01-15. Retrieved 2021-12-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Telangana only State to win two national awards". www.thehansindia.com. 2021-07-14. Archived from the original on 2021-07-13. Retrieved 2021-12-27.
  3. 3.0 3.1 3.2 "About Apex Bank". Welcome to Apex Bank – Telangana State Co-operative Apex Bank Ltd (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-15. Retrieved 2021-12-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "TSCAB is 'Best Cooperative Bank'". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-24. Archived from the original on 2021-12-27. Retrieved 2021-12-27.