వికీపీడియా నుండి
(తెలుగులో లుప్తమైన అక్షరాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అక్షరం తెలుగు లో ఎప్పటి నుండో అస్తిత్వంలో ఉండి, వాడుకలో లేక లుప్తమయిన అక్షరం. ఇది ద్రావిడ భాష లకు ప్రత్యేకమయిన అక్షరాలలో ఒకటి. తమిఴం(తమిళం) లో ఴ ఈ అక్షరం. తమిழ் అని ఇన్నాళ్ళూ వాడుతూ వచ్చాము.[1]

ఈ అక్షరం తమిళం 'ழ', కన్నడ 'ೞ', మలయాళం 'ഴ' లాగా ఉంటుంది. ఴ (LLLA) అనేది రెట్రోఫ్లెక్స్ వాయిస్డ్ ఫ్రికేటివ్, ఇది ద్రావిడ భాషా కుటుంబానికి ప్రత్యేకమైనది. ఈ అక్షరాన్ని ఉపయోగించే ఇతర ద్రావిడ భాషల లిప్యంతరీకరణలను కలిగి ఉన్న గ్రంథాలలో తెలుగు అక్షరం ఴ అవసరం.[2]

ఉచ్చారణ[మార్చు]

ళ పలికినప్పుడు నాలుక ఇరుప్రక్కలూ దవడ ను అంటుకుని, నాలిక మడిచి, మూర్ధన్యాన్ని తాకుతాము. మూర్ధన్యమును తాకకుండా, కేవలం నాలుకకొనను ఎక్కడా తాకకుండా, నాలుక ప్రక్కలతో పై దంత పంక్తిని తాకినప్పుడు వచ్చే శబ్దం ఴ.

ఴ అక్షరం ఆకృతి

సాంకేతిక వివరాలు[మార్చు]

యూనికోడ్ ప్రకారం ఈ అక్షరం యొక్క కోడ్ పాయింట్ - 0C34. ఈ అక్షరం అందుబాటులో ఉన్న ఖతి - ధూర్జటి.

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart". https://www.compart.com/en/unicode/U+0C34 (in ఇంగ్లీష్). Retrieved 2023-04-16. {{cite web}}: External link in |website= (help)
  2. "ఴ - WordSense Dictionary". www.wordsense.eu (in ఇంగ్లీష్). Retrieved 2023-04-16.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఴ&oldid=3935949" నుండి వెలికితీశారు