ఴ
Jump to navigation
Jump to search
ఴ అక్షరం తెలుగు లో ఎప్పటి నుండో అస్తిత్వంలో ఉండి, వాడుకలో లేక లుప్తమయిన అక్షరం. ఇది ద్రావిడ భాష లకు ప్రత్యేకమయిన అక్షరాలలో ఒకటి. తమిఴం(తమిళం) లో ఴ ఈ అక్షరం. తమిழ் అని ఇన్నాళ్ళూ వాడుతూ వచ్చాము.[1]
ఈ అక్షరం తమిళం 'ழ', కన్నడ 'ೞ', మలయాళం 'ഴ' లాగా ఉంటుంది. ఴ (LLLA) అనేది రెట్రోఫ్లెక్స్ వాయిస్డ్ ఫ్రికేటివ్, ఇది ద్రావిడ భాషా కుటుంబానికి ప్రత్యేకమైనది. ఈ అక్షరాన్ని ఉపయోగించే ఇతర ద్రావిడ భాషల లిప్యంతరీకరణలను కలిగి ఉన్న గ్రంథాలలో తెలుగు అక్షరం ఴ అవసరం.[2]
ఉచ్చారణ
[మార్చు]ళ పలికినప్పుడు నాలుక ఇరుప్రక్కలూ దవడ ను అంటుకుని, నాలిక మడిచి, మూర్ధన్యాన్ని తాకుతాము. మూర్ధన్యమును తాకకుండా, కేవలం నాలుకకొనను ఎక్కడా తాకకుండా, నాలుక ప్రక్కలతో పై దంత పంక్తిని తాకినప్పుడు వచ్చే శబ్దం ఴ.
సాంకేతిక వివరాలు
[మార్చు]యూనికోడ్ ప్రకారం ఈ అక్షరం యొక్క కోడ్ పాయింట్ - 0C34. ఈ అక్షరం అందుబాటులో ఉన్న ఖతి - ధూర్జటి.
వనరులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart". https://www.compart.com/en/unicode/U+0C34 (in ఇంగ్లీష్). Retrieved 2023-04-16.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ "ఴ - WordSense Dictionary". www.wordsense.eu (in ఇంగ్లీష్). Retrieved 2023-04-16.