Jump to content

తెలుగు గజల్

వికీపీడియా నుండి

ఇది ఒక కవితా పక్రియ ఇది తెలుగు సాహిత్యంలోని 1963లో అడుగుపెట్టింది అయిదున్నర దశాబ్దాల కిందట తెలుగులోకి వచ్చిన ఈ కవితా ప్రక్రియలో ప్రస్తుతం వందల మంది రచనలు చేస్తున్నారు ‘వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది/ పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’.. 1965లో వచ్చిన తొలి తెలుగు గజల్‌లోని మక్‌తా ఇది. ఇది 14 ఏప్రల్ 1965 ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో "ఉగాది గజల్" అన్న శీర్షికతో అచ్చయింది[1]. దాశరది కృష్ణమాచార్యులు తొలి తెలుగు గజల్‌ కవి . 'గజల్' అనే శబ్దానికి అర్థం “ఇంతులతో మంత నాలు" అన్నారు దాశరథి. "గజల్" అంటే ప్రియురాలితో ఏకాంతమున జరిపే ప్రణయ సల్లాపమని నైఘంటికార్థం" అని వివరించారు ఉర్దూ భాషా సాహిత్యవేత్తలు శ్రీ సదా శివ [2]. తెలుగు గజల్‌ను మొట్టమొదటిసారి పాడి వినిపించింది పి.బి. శ్రీనివాస్ 1967లో దాశరథి రాసిన ‘‘అధరాల వీధిలోన మధుశాలలున్నదాన’’ అన్న గజల్‌ను ఈమని శంకర శాస్త్రి సంగీతంలో పాడాడు ,తెలుగులో గజల్‌కు దాశరథి "మంజరి" ‌అనీ పి.బి.శ్రీనివాస్ "వల్లరి" అనీ పేర్లు పెట్టారు[3].

గజల్ ప్రక్రియ

[మార్చు]

గజల్‌ తనాన్ని ‘గజలియత్‌’ అంటారు. ఈ గజలియత్, ఇతర రచనా విధానాల నుంచి శైలి పరంగా గజల్‌ను ప్రత్యేకంగా చూపిస్తుంది, గజల్ మాత్రా గణబద్ధమైన గేయకవితా ప్రక్రియకు సంబంధించింది. గజల్ లో కనీసం 5 షేర్ లు లేదా అషార్ లు వుంటాయి. 7, 9, 11… అషార్ లూ వుండవచ్చు. ప్రతి షేర్ లో రెండు మిస్రా లు వుంటాయి. ప్రతి మిస్రా ఛందస్సు గల్గి వుంటుంది. గజల్ ఛందాలో కొన్ని మాత్రలున్న పంక్తిని (పాద మైన ద్వయాన్ని) బహర్ అంటారు. ఏ బహర్ నైనా గజల్ చెప్పవచ్చు. ఏదేని ప్రత్యేకమైన బహర్లోనే చెప్పవలెనన్న నియమం లేదు త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్రగతుల్లో ఏ గతిలోనైనా గజల్ను రచించవచ్చు, గజల్లోని పాదాలన్నింటిలోనూ మాత్రా సంఖ్యా సమత్వం ఉండాలి. గజల్ పాట కాబట్టి, గజల్ లోని మొదటి రెండు పాదాలను పల్లవిగా భావించవచ్చు. చెప్పదలచు కున్న భావం ఈ రెండు పాదాలలో ముగిసి తీరాలి. పాదాన్ని 'మిస్రా' అంటారు. రెండు పాదాల కవితను 'షేర్' అంటారు. షేర్ను పాటలోని 'చరణం'గా లంభ అనుకోవచ్చు. అంటే ప్రతిషేర్ రెండు సమభాగాలుగా విరుగుతుందని అర్థం. గజల్లోని మొదటి షేర్ను 'మల్లా' అంటారు. గజల్లో ఐదు మొదలుకొని ఎన్ని షేర్ లైనా ఉండవచ్చు. సాధారణంగా పదిహేను షేర్లను మించవు. అయితే ముప్పయి ఒక్క షేర్లున్న గజల్ కూడా ఉన్నట్లు గజల్ చరిత్ర చెపుతున్నది. గజల్ మొదటి షేర్ అయిన 'మ'లోని రెండుపాదాలకూ చివర ఖాఫియా, రదీఫ్ అనే అంత్య ప్రాసలుంటాయి. మిగతా షేర్లలో రెండవ మిస్రాకు (పాదానికి ) మాత్రమే ఈ అంత్య ప్రాసల నియమం ఉంటుంది. గజల్లోని చిట్ట చివరి షేర్ను 'మఖా' అంటారు. అందులో కవి తన 'తఖల్లుస్' ను తెలుపుకుంటాడు. 'తఖల్లుస్' అంటే కవి కలంపేరు లేదా కవి నామముద్ర. ప్రతిషేర్లోని చివరి పదంకంటే ముందున్న పదం 'ఖాఫియా' అంటారు. అంటే అంత్య ప్రాసకు ముందుండే మరొక ప్రాసపదం అన్న మాట. ఈ ఖాఫియా పదాలు సమానమైన ఉచ్చారణ కలిగి ఉండాలి. షేర్ ని చిట్టచివరి పదాన్ని 'రదీఫ్' అంటారు. రదీఫ్ మాత్రం అదే పదమై ఉండాలి. అందుకే గజల్ కవికి ఖాఫియాలు దొరకడం కష్టం. వాటికి సముచితమైన రదీఫ్ను జోడించడం మరీ కష్టం. అందువల్ల గాలిబంటి కొందరు ఉర్దూ గజల్ కవులు రదీఫ్ లేకుండా ఖాఫియా నియమంతోనే షేర్లను పూర్తి చేశారు.భావకవిత్వానికి భావుకత ఎంత అవసరమో గజల్‌కి గజలియత్‌ కూడా అంతే అవసరం, గజల్ తెలుగులోకి మూడు దోషాలతో వచ్చింది. గజల్‌ తెలుగులోకి మూడు దోషాలతో వచ్చింది. ఒకటి కాఫియా అంటే అంత్యాను ప్రాస విషయంలో జరిగింది. రెండవది బహర్‌ అంటే ఛందస్సు లేకుండా రావడం. మూడవది గజలియత్‌ అంటే (శైలీ, శయ్య) గజల్‌తనం లేకపోవడం [4].తెలుగు గజల్ దాని దక్కనీ పర్షియన్ ఉర్దూ మూలాలని వదిలి తెలుగుగజల్ గా మారటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది.ఈ క్రమం లో ఎందరో గజల్ ని తెలుగు అలంకరణలతో మళ్ళీ మళ్ళీ ముస్తాబు చేసి మరింత దగ్గరగా తెచ్చే ప్రయత్నమూ చేసారు.

మూలాలు

[మార్చు]
  1. "andhrajyothy.com/telugunews/abnarchievestorys-704886#!". andhrajyothy. Archived from the original on 2021-08-27. Retrieved 2021-08-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "ఉర్దూకవుల కవితా సామగ్రి - కొందరు సుప్రసిద్ధ కవులు" అనే గ్రంథంలో (పుట.3, ప్రచురణ. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ 1970)
  3. "andhrajyothy.com/telugunews/abnarchievestorys-704886#!". andhrajyothy. Archived from the original on 2021-08-27. Retrieved 2021-08-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "అనల్ప శిల్పం.. గజల్ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2021-08-27. Retrieved 2021-08-27.