తేగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తేగ [ tēga ]. తెలుగు n. సరళంగా చెప్పుకోవాలంటే తేగ అనేది ఒక తాటి మొలక. తాటి కాయలు పండిన తరువాత దానిని పగలగొట్టి అందులో టెంకలు చుట్టూ ఉన్నటువంటి పదార్ధాన్ని పిసికి సేకరిస్తారు. ఇలా సేకరించిన పదార్ధంతో తాటి ఇడ్లీలు, తాటి అట్లు ఇంకా తాటి గారెలు వంటి ఆహారపదార్థాలు తయారుచేస్తారు. టెంకల చుట్టూ వున్న పదార్థాన్ని సేకరించిన తరువాత మిగిలిన టెంకలను చిన్నపాటి మట్టి దిబ్బను గుల్లగా తయారుచేసి దానిపై పడవేస్తారు. కొంతకాలానికి టెంకల నుండి మొలకలు వచ్చి భూమిలో కాండము ఏర్పడుతుంది. ఈ దశలో మట్టిని త్రవ్వి కాండపు భాగాలను సేకరించి మట్టికుండలో పేరుస్తారు. తరువాత పేర్చిన కుండను తిప్పి పెట్టి దాని చుట్టూ గడ్డిని పేర్చి కాలుస్తారు. ఇలా తయారుచేసిన తేగలను కట్టల రూపంలో విక్రయిస్తారు. దీనిని ఆహారంగా తినడానికి రుచిగా ఉంటుంది. తేగలో ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది తినడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తేగను చీల్చడానికి మధ్యలో ఒక చీలికలాగు ఉంటుంది. ఇది చీల్చితే రెండు బద్దలుగా విడిపోతుంది. ఈ బద్దలు గాక మధ్యలో కాడలాగ ఒకటి ఉంటుంది. దీనిపై అంచున మెత్తగా ఉండే పదార్థాన్ని చందమామగా పిలుస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=తేగ&oldid=2558171" నుండి వెలికితీశారు