తేనెగూడు
తేనెగూడును తెలుగులో తేనె పట్టు, తేనె తుట్టె, పురుగుల తుట్టె అని కూడా అంటారు. తేనెగూడును ఇంగ్లీషులో Honeycomb అంటారు. తేనెటీగలు ఒక సమూహంలా జీవిస్తాయి. ఇవన్నీ కలసి కట్టుగా ఈ గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడులోనే అవి సేకరించుకున్న ఆహారాన్ని (పుస్పములలోని మకరందం) దాచుకుంటాయి. ఈ ఆహారాన్ని తేనె అంటారు. ఇవి ఈ గూడులోనే గ్రుడ్లను పెట్టి తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి.
తేనె గూడు నిర్మాణం
[మార్చు]తేనెటీగలు గొప్ప నిర్మాణ సామర్థ్యం గల ఇంజనీర్ల వలె తమ గూడును షడ్భుజ (ఆరు కోణాలు) ఆకారం వచ్చెలా కొన్ని వందల, వేల గూడులను ప్రక్క, ప్రక్కనే నిర్మించుకుంటాయి. అలా ప్రక్క ప్రక్కనే నిర్మించుకొన్న గూడుల సమాహారమును మరింత విస్తరించుకొంటూ పెద్ద పట్టులా చేస్తాయి. తేనెటీగలు తమ నోటి నుంచి స్రవించే మైనం వంటి పదార్ధంతో అరల వంటి కాళీలతో కూడిన పట్టును నిర్మించుకుంటాయి.తేనెటీగలు తమ గూళ్ళను ఎత్తెన ప్రదేశాలలో భవనాలపై బాగాలలోనూ ఎత్తైన చెట్లపైనా తమగూళ్ళను నిర్మించు కుంటాయి.
చిత్రమాలిక
[మార్చు]-
తేనెగూడు
-
"కృత్రిమ తేనెగూడు" ప్లేట్
-
గుడ్లు, లార్వాలతో తేనెగూడు
-
బెంగుళూరు సమీపంలోని శ్రీరంగపట్నంలోని ఒక చెట్టుకు పెట్టిన తేనెగూడులు
-
వర్కర్ నుండి డ్రోన్ (పెద్ద) గదులకు పరివర్తనను కలిగి ఉన్న తేనెగూడు విభాగం - ఇక్కడ తేనెటీగలు సక్రమంగా, ఐదు మూలల గదులను (ఎరుపు చుక్కలతో గుర్తించబడతాయి) తయారు చేశాయి.