Jump to content

తోటరామన్నవూరు

అక్షాంశ రేఖాంశాలు: 13°04′59″N 79°07′08″E / 13.083°N 79.119°E / 13.083; 79.119
వికీపీడియా నుండి
(తోట రామన్న ఊరు నుండి దారిమార్పు చెందింది)

తోటరామన్నఊరు చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తోటరామన్నఊరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
తోటరామన్నఊరు is located in Andhra Pradesh
తోటరామన్నఊరు
తోటరామన్నఊరు
అక్షాంశరేఖాంశాలు: 13°04′59″N 79°07′08″E / 13.083°N 79.119°E / 13.083; 79.119
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం గుడిపాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

[మార్చు]

దాదాపు 18 వ శతాబ్దం ప్రారంభంలో తోట రామన్న, అతని తమ్ముడు తోట లక్ష్మన్న ఈ ప్రదేశంలో ఆవులు మేపుకుంటూ పాలు అమ్ముకుని బ్రతికేవారు.వారు పాలెంకొండ జమిందారుకి నమ్మకస్తులు. ఒకసారి ఆయన వేరే రాజ్యానికి వెళుతూ వీరికి ఆ జమీన్ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు. ఆయన వచ్చే వరకు ఆ జమీన్ ను ఆ జమిందారు భార్య బిడ్డల్ని కాపలా కాయడం వీరి పని.

ఒక రోజు ఆ జమీన్ లోకి దొంగలు పడ్డారు. ఈ అన్నదమ్ములు వారిని ఎదుర్కొని పోరాడారు.ఆ పాలెం కొండ జమిందారు భార్య బిడ్డల్ని కాపాడారు. అందుకు సంతోషించిన పాలెం జమిందారు వీరికి దాదాపు 100 ఎకరాల భూమిని ఇనాముగ ఇచ్చాడు. ఆ ప్రదేశాన్ని పెద్దవాడైన రామన్న పేరు మీద తోట రామన్న వూరు అని పేరు పెట్టి పట్టా చేసి ఇచ్చాడు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

తోట వంశం వారు ఈ గ్రామ వాస్తవ్యులుఅందుకే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది.

సరిహద్దులు

[మార్చు]

తూర్పున రామాపురం హరిజనవాడ, పడమర రాసనపల్లి అడవి, ఉత్తరం చీలాపల్లి అడవి, దక్షిణం 13 నెంబర్ గొల్లపల్లి

సమీప గ్రామాలు

[మార్చు]

197 రామాపురం, ఖైడుగాని కండ్రిగ, 13 గొల్ల పల్లి, చలిచీమల పల్లి, కమ్మ తిమ్మయ్య పల్లి,

ఈ గ్రామంలో 1998 వరకు ప్రాథమిక పాఠశాల వుండేది పిల్లలు లేని కారణంగా దాన్ని తొలగించారు

రవాణా సౌకర్యాలు

[మార్చు]

చిత్తూరు నుండి కమ్మతిమ్మపల్లి బస్సు ద్వారా రామాపురంలో దిగి అక్కడ నుంచి 1 కిలో మీటర్ నడచి గ్రామానికి చేరుకోవచ్చు, లేదా చిత్తూరు నుండి రామాపురం స్టేషనుకు రైలులో వచ్చి అక్కడ నుంచి గొల్ల పల్లి మీదుగా 1 కిలో మీటర్ నడచి గ్రామానికి చేరుకోవచ్చు,

విశేషాలు

[మార్చు]
  • తోటరామన్నఊరు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఒక అందమైన గ్రామం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పబ్బం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి.
  • ఈ ఊరిలో తోట వంశం వారు, చలిచీమల వంశం వారు నివసిస్తున్నారు.
  • ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది.
  • ఈ ఊరు నుండి చాలామంది తోట వారు చలిచీమల వారు బెంగుళూరులో స్థిర పడ్డారు.
  • హైదరాబాద్లో అలాగే పూనాలో కూడా ఉన్నారు. ఈ ఊరిలో ఎందరో గొప్పవారు పుట్టారు.
  • వారిలో కొందరు ఉపాధ్యాయులు ఉపన్యాసకులు న్యాయవాదులు సాంకేతిక నిపుణులు అమ్మకాల అధికారులు ఉన్నారు.
  • అలాగే నిర్మాణ రంగ నిపుణులు, ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు, మరీ ముఖ్యంగా ఈ గ్రామం వ్యవసాయానికి పుట్టినిల్లు.
  • ఇక్కడ ఎక్కువగా చెరుకు పండిస్తారు, దాని తరువాతి స్థానం మాత్రం మామిడి పండ్లది.
  • మామిడి పండ్లలో అన్ని రకాల జాతుల పండ్లు లభిస్తాయి.ఇక వరి పంట విషయానికి వస్తే గ్రామానికి కావలసిన ఆహారాన్ని వారే పండించుకుంటారు.

ఈ గ్రామం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే ఈ గ్రామాన్ని నాగాలమ్మ, అరిమాకుల గంగమ్మ, బొంతల గంగమ్మ కాపాడుతుంటారు .నాగాలమ్మకు ప్రత్యేకమైన గుడి ఉంది అలాగే వినాయకునికి కూడా చాల అందమైన గుడిని నిర్మించారు ఈ గ్రామా ప్రజలు.

ఈ ఊరిలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పబ్బం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి దాదాపు 12 ఎద్దులు ప్రతిరూపాలు. వీటిలో 6 రెడ్డి కులానికి 6 కమ్మ కులానికి చెందినవి సామాజిక వర్గాల సహజీవనానికి ఇది ఒక ఉదాహరణ.

మూలాలు

[మార్చు]