తోటరామన్నవూరు
తోటరామన్నఊరు చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తోటరామన్నఊరు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°04′59″N 79°07′08″E / 13.083°N 79.119°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | గుడిపాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ చరిత్ర
[మార్చు]దాదాపు 18 వ శతాబ్దం ప్రారంభంలో తోట రామన్న, అతని తమ్ముడు తోట లక్ష్మన్న ఈ ప్రదేశంలో ఆవులు మేపుకుంటూ పాలు అమ్ముకుని బ్రతికేవారు.వారు పాలెంకొండ జమిందారుకి నమ్మకస్తులు. ఒకసారి ఆయన వేరే రాజ్యానికి వెళుతూ వీరికి ఆ జమీన్ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు. ఆయన వచ్చే వరకు ఆ జమీన్ ను ఆ జమిందారు భార్య బిడ్డల్ని కాపలా కాయడం వీరి పని.
ఒక రోజు ఆ జమీన్ లోకి దొంగలు పడ్డారు. ఈ అన్నదమ్ములు వారిని ఎదుర్కొని పోరాడారు.ఆ పాలెం కొండ జమిందారు భార్య బిడ్డల్ని కాపాడారు. అందుకు సంతోషించిన పాలెం జమిందారు వీరికి దాదాపు 100 ఎకరాల భూమిని ఇనాముగ ఇచ్చాడు. ఆ ప్రదేశాన్ని పెద్దవాడైన రామన్న పేరు మీద తోట రామన్న వూరు అని పేరు పెట్టి పట్టా చేసి ఇచ్చాడు.
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]తోట వంశం వారు ఈ గ్రామ వాస్తవ్యులుఅందుకే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది.
సరిహద్దులు
[మార్చు]తూర్పున రామాపురం హరిజనవాడ, పడమర రాసనపల్లి అడవి, ఉత్తరం చీలాపల్లి అడవి, దక్షిణం 13 నెంబర్ గొల్లపల్లి
సమీప గ్రామాలు
[మార్చు]197 రామాపురం, ఖైడుగాని కండ్రిగ, 13 గొల్ల పల్లి, చలిచీమల పల్లి, కమ్మ తిమ్మయ్య పల్లి,
ఈ గ్రామంలో 1998 వరకు ప్రాథమిక పాఠశాల వుండేది పిల్లలు లేని కారణంగా దాన్ని తొలగించారు
రవాణా సౌకర్యాలు
[మార్చు]చిత్తూరు నుండి కమ్మతిమ్మపల్లి బస్సు ద్వారా రామాపురంలో దిగి అక్కడ నుంచి 1 కిలో మీటర్ నడచి గ్రామానికి చేరుకోవచ్చు, లేదా చిత్తూరు నుండి రామాపురం స్టేషనుకు రైలులో వచ్చి అక్కడ నుంచి గొల్ల పల్లి మీదుగా 1 కిలో మీటర్ నడచి గ్రామానికి చేరుకోవచ్చు,
విశేషాలు
[మార్చు]- తోటరామన్నఊరు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఒక అందమైన గ్రామం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పబ్బం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి.
- ఈ ఊరిలో తోట వంశం వారు, చలిచీమల వంశం వారు నివసిస్తున్నారు.
- ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది.
- ఈ ఊరు నుండి చాలామంది తోట వారు చలిచీమల వారు బెంగుళూరులో స్థిర పడ్డారు.
- హైదరాబాద్లో అలాగే పూనాలో కూడా ఉన్నారు. ఈ ఊరిలో ఎందరో గొప్పవారు పుట్టారు.
- వారిలో కొందరు ఉపాధ్యాయులు ఉపన్యాసకులు న్యాయవాదులు సాంకేతిక నిపుణులు అమ్మకాల అధికారులు ఉన్నారు.
- అలాగే నిర్మాణ రంగ నిపుణులు, ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు, మరీ ముఖ్యంగా ఈ గ్రామం వ్యవసాయానికి పుట్టినిల్లు.
- ఇక్కడ ఎక్కువగా చెరుకు పండిస్తారు, దాని తరువాతి స్థానం మాత్రం మామిడి పండ్లది.
- మామిడి పండ్లలో అన్ని రకాల జాతుల పండ్లు లభిస్తాయి.ఇక వరి పంట విషయానికి వస్తే గ్రామానికి కావలసిన ఆహారాన్ని వారే పండించుకుంటారు.
ఈ గ్రామం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే ఈ గ్రామాన్ని నాగాలమ్మ, అరిమాకుల గంగమ్మ, బొంతల గంగమ్మ కాపాడుతుంటారు .నాగాలమ్మకు ప్రత్యేకమైన గుడి ఉంది అలాగే వినాయకునికి కూడా చాల అందమైన గుడిని నిర్మించారు ఈ గ్రామా ప్రజలు.
ఈ ఊరిలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పబ్బం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి దాదాపు 12 ఎద్దులు ప్రతిరూపాలు. వీటిలో 6 రెడ్డి కులానికి 6 కమ్మ కులానికి చెందినవి సామాజిక వర్గాల సహజీవనానికి ఇది ఒక ఉదాహరణ.