Jump to content

తోడు నీడ (స్వచ్ఛంద సంస్థ)

వికీపీడియా నుండి
తోడు నీడ
వ్యవస్థాపకులుఎన్.ఎం.రాజేశ్వరి
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాద్
సేవా ప్రాంతాలుభారత్

తోడు నీడ అనేది భారతదేశానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఒంటరి వృద్ధుల సహజీవనాన్ని అదే విధంగా నూతన వివాహాలను ప్రోత్సహిస్తూ వారిని ఒక్కటి చేయటంపై కృషి చేస్తుంది.[1]

చరిత్ర

[మార్చు]

వయసు పైబడి భార్య/భర్తని కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న వృద్దులకు ఒక పరిష్కారంగా ఈ తోడు నీడ సంస్థను ఎన్.ఎం.రాజేశ్వరి స్థాపించింది.[2]

కార్యక్రమాలు

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవన శైలులను బట్టి మన భారతదేశంలో కూడా అటువంటి మార్పులు తీసుకురావాలని, వృద్దులలో ఒంటరితనానికి సంబందించిన అంశాలకు ఒక పరిష్కారం చూపాలనే ఆలోచనతో రాజేశ్వరి తోడు నీడ సంస్థ స్థాపించి వయసు పైబడిన వారికి తగు వేదికలు ఏర్పరుస్తూ సహజీవనం, వివాహం, డే కేర్ సెంటర్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.[3]

వివాహాలు

[మార్చు]

తోడు నీడ సంస్థ స్థాపించినప్పటినుండి నిర్వహిస్తున్న సామాజిక కార్యకలాపాలలో వివాహ పరిచయ వేదిక ఒకటి, దీంట్లో వయసు పైబడి ఒంటరితనం అనుభవిస్తున్న వారు ఒక వేదికపై చేరి ఒకరినొకరు తెలుసుకోవచ్చు. ఆలా పరిచయం ఏర్పడిన తరువాత వారి బంధువుల లేదా పిల్లల సమ్మతితో ఈ సంస్థ వారి వివాహాలు చేపడుతుంది.

పరస్పర అంగీకారంతో సహజీవనం

[మార్చు]

వయసు పైబడిన అందరు మల్లి వివాహం చేసుకోవడం కుదరకపోవచ్చు, ఆ అవసరం లేకుండా సహజీవనం చేస్తూ ఒకరికొకరు తోడుగా ఉండొవచ్చని ఈ సంస్థ సమాజంలో అవగాహన పెంచుతూ అలా సహజీవనంలో ఉండాలన్న వారికి ఒక్కదాటిపైకి తీసుకువచ్చి వారికి తోడ్పడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Feb 14, Donita Jose / TNN /; 2018; Ist, 06:00. "Thodu Needa: Over 60 and looking for love: Why not? | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2021-09-14. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "66టీవీ ఇంటర్వ్యూ".{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "మార్చి 7న హైదరాబాద్ లో 'తోడు నీడ' కార్యక్రమం". ETV Bharat News. Retrieved 2021-09-14.