తోపుడుపార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అన్ని పారలతో లాగడం ద్వారా మట్టి లేక ఇతర వస్తువును నింప గలిగితే ఈ పారను వస్తువుతో నింపడానికి తోస్తారు అందువలన దీనిని తోపుడు పార అంటారు.

ఈ పార సుమారు మీటరు (3 నుంచి 4 అడుగులు) లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది.

ఈ పారను ఎక్కువగా బట్టీలలో బొగ్గును వేసేందుకు ఉపయోగిస్తారు.

తొందరగా ధాన్యాన్ని బస్తాలకు నింపుటకు ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా నూనెను తీసే పరిశ్రమలలో విత్తనాల నుంచి నూనెను వేరుచేసిన తరువాత మిగిలిన పిట్టును (ఉదాహరణకు వేరుశనగ పిట్టు) కదిలించడానికి బస్తాలకు నింపడానికి తోపుడుపార బాగా ఉపకరిస్తుంది.

తోపుడుపారకు ఒక వైపు చేట వంటి ఆకారంలో ఉంటుంది. మరొక వైపు కర్ర లేదా రాడ్ బిగించబడి ఉంటుంది.

ఇది సుమారు 2 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది.

చేట వంటి ఆకారం సుమారుగా ఒక అడుగు పొడవు, వెడల్పు అడుగు కంటే తక్కువ ఉంటుంది. దీనికి రెండు అడుగుల కర్ర లేదా రాడ్ బిగించబడిన ఇది మొత్తం మీద అన్నంను వడ్డిచ్చుకునే హస్తం గరిటెను పోలి ఉంటుంది.