త్రిపురనేని శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిపురనేని శ్రీనివాస్ సాహితీ కారుడు, కవి. అతను ఎన్నో తెలుగు పత్రికల్లో సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను అజంత కలం పేరుతో సుపరిచితుడైన పీ వీ శాస్త్రి గారి కవితా సంకలనాన్ని 1993 లో "స్వప్నలిపి" అనే పుస్తకంగా కవిత్వం ప్రచురణల ద్వారా వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997 లో సాహిత్యఅకాడమీ కవిత్వ పురస్కారం అందుకుంది. అతను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ఇన్‌ఛార్జిగా కూడా పనిచేసాడు. అస్తిత్వవాద ఉద్యమాల పొద్దు పొడుపు కాలంలో ఆయన ఒక పాత్రికేయుడిగా ఎనలేని మేలు చేశాడు. దళిత, మైనారిటీ వాదాల సాహిత్య ప్రక్రియలకి పత్రికలో అత్యధిక పాధాన్యం కల్పించాడు. శ్రీనివాస్‌ కేవలం కవి మాత్రమే కాదు క్రాంతదర్శి, తిరుగుబాటుదారు కనుకనే అది సాధ్యమయింది.

అతను కవిత్వమొక తీరని దాహమన్న వాక్యానికి‌ నిలువెత్తు నిదర్శనంగా జీవించాడు. ఉద్యమం నుంచి బయటికి వచ్చిన తర్వాత కవిత్వరచనకి, పాత్రికేయ వృత్తికి మాత్రమే పరిమితం కాలేదు. పలువురు కొత్త కవులను ప్రోత్సహించసాగారు. 1989లో త్రిపురనేని శ్రీనివాస్‌ ‘రహస్యోద్యమం’ పుస్తకాన్ని రాసాడు. పదునైన పదజాలం, కొత్తవైన ప్రతీకలతో నవనవమనే అనుభవ కవిత్వంతో అబ్బురపరిచారు. ఆనాటి యువకవులను ప్రభావితం చేశాడు. వేగుంట మోహనప్రసాద్‌ ఆంగ్లానువాదంతో ఉభయ భాషల్లో ‘రహస్యో ద్యమం’ ప్రచురించాడు.[1]

1996 ఆగస్టు 17. హైదరాబాద్‌ లోయర్‌ టాంక్‌ బండ్‌ రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్‌ చనిపోయారు. అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలు.

ప్రచురణలు[మార్చు]

1990 నుంచి 95 వరకు అయిదేళ్లలో అతను. పద్నాలుగు పుస్తకాలు రాసాడు. అనేక కవిత్వాలను ప్రచురించాడు.[2]

  1. క్రితం తర్వాత... ఆరుగురు యువ కవుల సంయుక్త కవిత
  2. యెక్కడైనా యిక్కడే... ప్రీతిష్‌నంది కవిత్వానువాదం, త్రిపురనేని శ్రీనివాస్‌
  3. 19 కవితలు... గాలి నాసరరెడ్డి
  4. ఒఖడే... స్మైల్‌
  5. బతికిన క్షణాలు... వేగుంట మోహనప్రసాద్‌
  6. ఇక ఈ క్షణం... నీలిమా గోపీచంద్‌
  7. ఫోర్త్‌ పర్సన్‌ సింగులర్‌... గుడిహాళం రఘునాథం
  8. బాధలూ- సందర్భాలూ... త్రిపుర
  9. గురిచూసి పాడే పాట...స్త్రీ వాద కవితలు[3]
  10. ఎన్నెలో ఎన్నెలో... రావిశాస్త్రి కవిత్వం
  11. . పుట్టుమచ్చ... ఖాదర్‌ మొహియుద్దీన్‌
  12. మరోవైపు... దేశ దేశాల కవిత్వానువాదం, త్రిపురనేని శ్రీనివాస్‌
  13. స్వప్నలిపి...అజంతా
  14. చిక్కనవుతున్న పాట... దళిత కవిత్వం.

మూలాలు[మార్చు]

  1. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestoryv-141107[permanent dead link]
  2. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-141072[permanent dead link]
  3. "తెలుగు సాహిత్యం - స్త్రీవాదం" (PDF). hodhganga.inflibnet.{{cite web}}: CS1 maint: url-status (link)

బాహ్య లంకెలు[మార్చు]