త్రిలోచన్ కనుంగో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిలోచన్ కనుంగో
త్రిలోచన్ కనుంగో


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1999 – 2004
ముందు రంజీబ్ బిస్వాల్
తరువాత బ్రహ్మానంద పాండా
నియోజకవర్గం జగత్‌సింగ్‌పూర్, Odisha

వ్యక్తిగత వివరాలు

జననం (1940-11-24)1940 నవంబరు 24
బాదాములే, కటక్ జిల్లా, ఒరిస్సా, భారతదేశం
మరణం 2023 ఏప్రిల్ 21(2023-04-21) (వయసు 82)
భుబనేశ్వర్, ఒరిస్సా, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్
జీవిత భాగస్వామి అగస్తీ కనుంగో

త్రిలోచన్‌ కనుంగో ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

త్రిలోచన్‌ కనుంగో బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కటక్ మునిసిపాలిటీ ఛైర్మన్‌గా పని చేసి కటక్ నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా దోమల బెడదను అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందుకుగాను కటక్ మునిసిపాలిటీ ఛైర్మన్‌గా (1979-80, 1992-95) ప్రజాదరణ పొందాడు. ఆయన అనంతరం ఒడిశా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్‌పర్సన్‌గా పని చేసి 1971లో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

త్రిలోచన్‌ కనుంగో ఆ తరువాత 1974, 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

త్రిలోచన్‌ కనుంగో వయో సంబంధిత వ్యాధులతో భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2023 ఏప్రిల్ 21న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు , ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (21 April 2023). "బీజేడీ సీనియర్‌ నేత త్రిలోచన్‌ కనుంగో కన్నుమూత". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  2. The New Indian Express (21 April 2023). "Veteran Odisha politician Trilochan Kanungo dies aged 83". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.