థర్మన్ షణ్ముగరత్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థర్మన్ షణ్ముగరత్నం
தர்மன் சண்முகரட்ணம்
2023లో థర్మన్ షణ్ముగరత్నం
9వ సింగపూర్ అధ్యక్షుడు
ప్రథాన మంత్రిథర్మన్ షణ్ముగరత్నం
అంతకు ముందు వారు[లీ హ్సీన్ లూంగ్
వ్యక్తిగత వివరాలు
జననం
థర్మన్ షణ్ముగరత్నం

(1957-02-25) 1957 ఫిబ్రవరి 25 (వయసు 67)[1]
సింగపూర్
రాజకీయ పార్టీస్వతంత్ర
ఇతర రాజకీయ
పదవులు
పీపుల్స్ యాక్షన్ పార్టీ
(2001–2023)
జీవిత భాగస్వామిజేన్ యుమికో ఇట్టోగి
సంతానం4
తండ్రికనగరత్నం షణ్ముగరత్నం
చదువులండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్)
యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ)
హార్వర్డ్ యూనివర్సిటీ (మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)
వృత్తి
  • రాజకీయవేత్త
  • ఆర్థికవేత్త
సంతకం

థర్మన్ షణ్ముగరత్నం (జననం 1957 ఫిబ్రవరి 25) భారత సంతతికి చెందిన సింగపూర్ ప్రముఖ ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు. 2023లో సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యాడు.[2] 2023 సెప్టెంబరు 14న బాధ్యతలు చేపట్టి ఆయన ఆరేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.

సింగపూర్‌లో జన్మించిన ఆయన 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2019 నుండి సింగపూర్ సీనియర్ మంత్రిగా ఉన్న ఆయన 2015 నుంచి సామాజిక విధానాలకు సమన్వయ మంత్రి. ఆయన 2011, 2023ల మధ్య సింగపూర్ మానిటరీ అథారిటీ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఆయన పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) మాజీ సభ్యుడు. ఆయన 2001, 2023ల మధ్య తమన్ జురాంగ్ డివిజన్‌కు పార్లమెంటు సభ్యుడు. అంతేకాకుండా ఆయన 2011, 2019ల మధ్య ఉప ప్రధానమంత్రిగా, 2007, 2015ల మధ్య ఆర్థిక మంత్రిగా, 2003, 2008ల మధ్య విద్యాశాఖ మంత్రిగా కూడా పనిసాడు.

వృత్తిరీత్యా ఆర్థికవేత్త అయిన థర్మన్ షణ్ముగరత్నం తన మొత్తం జీవితాన్ని ప్రజా సేవలో, ప్రధానంగా ఆర్థిక, సామాజిక విధానాలకు సింహభాగం కేటాయించాడు. ఆయన వివిధ ఉన్నత స్థాయి అంతర్జాతీయ కౌన్సిల్‌లు, ప్యానెల్‌లకు కూడా నాయకత్వం వహించాడు. ఆయన గ్రూప్ ఆఫ్ థర్టీకి చెందిన ట్రస్టీల బోర్డుకు అధ్యక్షత వహిస్తున్నాడు. గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్‌పై G20 ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్‌కు అధ్యక్షుడిగా ఆయన నియమితుడయ్యాడు.

ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ట్రస్టీల బోర్డు సభ్యుడు కూడా. అంతేకాకుండా, 2024లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కోసం ఎఫెక్టివ్ మల్టీలెటరలిజంపై సిఫార్సులను చేసే ప్రభావవంతమైన బహుపాక్షికతపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఉన్నత స్థాయి సలహా మండలిలో ఆయన సభ్యుడు.[3] ఆయన అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక కమిటీకి కూడా అధ్యక్షత వహించాడు. అంతర్జాతీయ ద్రవ్య నిధి విధాన సలహా కమిటీకి 2011 నుండి 2014 వరకు మొట్టమొదటి ఆసియా అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదనంగా, ఆయన 2019 నుండి 2022 వరకు యునైటెడ్ నేషన్స్ మానవ అభివృద్ధి నివేదిక (HDR)కు చెందిన డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సలహా మండలికి సహ అధ్యక్షుడుగా ఉన్నాడు.

ఆయన 2001 సింగపూర్‌ సాధారణ ఎన్నికలలో తన రాజకీయ అరంగేట్రం చేసాడు. 2006, 2011, 2015, 2020లలో జరిగిన సాధారణ ఎన్నికలలో నాలుగు సార్లు పార్లమెంటుకు ఆయన ఎన్నికయ్యాడు. 2023 జూన్ 8న, ఆయన 2023 అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత ప్రభుత్వంలోని తన అన్ని పదవులకు, PAP సభ్యునిగా 2023 జూలై 7న రాజీనామా చేసాడు.[4]

సింగపూర్‌లో 2011 తర్వాత మొదటిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఆయనపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్‌ సాంగ్‌పై ఏకంగా 70.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించాడు. అత్యధిక ఓట్ షేర్ కైవసం చేసుకోవడమే కాక అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి నేరుగా ఎన్నికైన మైనారిటీ జాతికి చెందిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

థర్మన్ షణ్ముగరత్నం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో గ్రాడ్యుయేషన్ చేయడానికి ముందు ఆంగ్లో-చైనీస్ స్కూల్‌లో చదివాడు. ఆయనకు 2011లో గౌరవ ఫెలోషిప్‌ను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అందించింది.[5]

ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని వోల్ఫ్సన్ కాలేజీలో చేరి, ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పూర్తి చేశాడు.[6] తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌ నుంచి మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పూర్తి చేశాడు ఆ సమయంలో లూసియస్ ఎన్. లిట్టౌర్ ఫెలోస్ అవార్డు పొందాడు.

తన కంటే 3 సంవత్సరాలు సీనియర్ అయిన జపనీస్-చైనీస్ వంశానికి చెందిన సింగపూర్ న్యాయవాది జేన్ యుమికో ఇట్టోగిని వివాహం చేసుకున్నాడు.[7][8] ఆమె సింగపూర్‌లో సామాజిక సంస్థ అయిన లాభాపేక్ష లేని కళల విభాగంలో చురుకుగా నిమగ్నమై ఉంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.

థర్మన్ షణ్ముగరత్నం పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు. ఆయన తండ్రి కనగరత్నం షణ్ముగరత్నం, ఫాదర్‌ ఆఫ్‌ పాథలజీ ఇన్‌ సింగపూర్‌గా పేరుగాంచాడు.

మూలాలు[మార్చు]

  1. "MP | Parliament Of Singapore".
  2. "సింగపూర్‌ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం | Indian-Origin Tharman Shanmugaratnam Wins Singapore Presidential Election - Sakshi". web.archive.org. 2023-09-03. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Note to Correspondents: Secretary-General's High-Level Advisory Board on Effective Multilateralism Comprises 12 Eminent Current or Former Global Leaders, Officials, Experts". United Nations. 18 March 2022.
  4. Goh, Han Yan (8 June 2023). "SM Tharman to run for president, will resign from Govt and PAP on July 7". The Straits Times (in ఇంగ్లీష్). Retrieved 8 June 2023.
  5. "LSE announces its new Honorary Fellows". Archived from the original on 3 October 2015.
  6. "New MAS chief is top-notch economist". Straits Times – via Factiva.
  7. "Try discipline with love – Acting Education Minister Tharman: My kids, their Mandarin and their future in China". The New Paper. 9 June 2004. Archived from the original on 5 December 2008.
  8. "Tharman believes S'pore is ready for a non-Chinese PM". The Straits Times (in ఇంగ్లీష్). Retrieved 2023-08-25.