థామస్ హాబ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థామస్ హాబ్స్
జాన్ మైకేల్ రైట్ ద్వారా హబ్స్
జననం(1588-04-05)1588 ఏప్రిల్ 5
వెస్ట్ పోర్ట్ , విల్ట్‌షైర్, ఇంగ్లాండు
మరణం1679 డిసెంబరు 4(1679-12-04) (వయసు 91)
డెర్బీషైర్ , ఇంగ్లాండు
యుగం17వ శతాబ్ద తత్వశాస్త్రము
ప్రాంతంపశ్చిమ తత్వశాస్త్రం
తత్వ శాస్త్ర పాఠశాలలు
  • బ్రిటిష్ ఎంపిరిసియం
  • డిస్క్త్రిప్టివ్ ఇగోయిజం
ప్రధాన అభిరుచులురాజకీయ తత్వశాస్త్రము, చరిత్ర, ఎథిక్స్, జామెట్రీ
ప్రభావితులు
  • ప్లాటో, అరిస్టాటిల్, థుసైడైడ్స్, సిసిరో, టారిటస్, విలియం ఆఫ్ ఓకం, రెనె డిస్కాట్రస్, హూగో గ్రోటియస్]

థామస్ హాబ్స్ ఆంగ్ల రాజనీతి తత్త్వవేత్త.

జీవిత విశేషాలు

[మార్చు]

హాబ్స్ 1588 ఏప్రల్ 8 వ సంవత్సరంలో ఇంగ్లాడులో జన్మించాడు. ఇతని ప్రధాన లక్ష్యము స్టూవర్ట్ రాజుల అధికారాన్ని పూర్తిగా బలపరచటం. హాబ్స్ కాలంలో ఇంగ్లాండులో పూర్తిగా అంతర్యుద్ధాలు ఉండేవి. అనేక ఇతర రాజకీయ తత్త్వవేత్తలవలెనే హాబ్స్ కూడా సమకాలీన దేశకాల పరిస్థితులకు ప్రభావితుడైనాడు. తార్కికంగాను, హేతుబద్దం గానూ, ఆధునిక కాలంలో రాజనీతికి సంబంధించిన అనేక అంశాలను శాస్త్రీయ ధృక్పధంతో క్రమబద్దముగా వివరించిన మొట్టమొదట ఆధునిక రాజనీతి తత్త్వవేత్త హాబ్స్ అని చెప్పవచ్చును. అతను అక్టోబరు 1679లో 91 సంవత్సరాల వయస్సులో మరణించారు.

రచనలు-సిద్ధాంతాలు

[మార్చు]

ఇతడు 1651లో వ్రాసిన లెవియథాన్ ఇతని రచనలలో బాగా ప్రాచుర్యం పొందిన గ్రంధము. లెవియధాన అనగా ఒక భయంకరమైన జంతువు.దీనికి కొన్ని వందల తలలు, కాళ్ళు, చేతులు వుంటాయి.వాటితో ఇది అనేక ఇతర జంతువులను కబళించడానికి ప్రయత్నిస్తుంది.అదే విధంగా రాజ్యంలో కూడా ప్రభువుకు సర్వాధికారాలు ఉండి ప్రజాకార్యకలాపాలన్నింటినీ పూర్తిగా శాసించగలిగినప్పుడే ఇంగ్లాండులో రాజకీయ సుస్థిరత, క్రమబద్దమైన ప్రజా జీవనం, శాంతి భద్రతలు ఏర్పడుతాయ హాబ్స్ భావించాడు.హాబ్స్ సిద్దాంతము మానవుని స్వభావంలోని రెండు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి భయం, రెండవది అత్యాశ. ఈ రెండూ ప్రతి మానవుని మరొక మానవుడికి బద్ధ శత్రువుగా చేస్తాయి. హాబ్స్ మానవుడు దురాశా పరుడని, స్వార్ధపూరిత స్వభావుడని, ఎప్పుడూ తన ప్రయోజనాన్ని సాధించడానికి మాత్రమే కృషి చేస్తాడని అంటాడు. మానవ స్వభావం ఏకాంతమని, హీనమైనదని అందువల్ల రాజ్యవతరణకు ముందు ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితం మృగప్రాయమైనదని హాబ్స్ అభిప్రాయం.

సంపూర్ణ సార్వభౌమిక సిద్ధాంతము

[మార్చు]

హాబ్స్ సంపూర్ణ సార్వభౌమిక సిద్ధాంతమును ప్రతిపాదించాడు.దీనికి గాను సామాజిక ఒడంబడిక అనే భావాన్ని హాబ్స్ ఉపయోగించాడు.సామాజిక ఒడంబడిక మానవ సమాజాన్ని రెండు దశాలుగా విభజిస్తుంది. రాజకీయ సమాజం ఏర్పడక ముందు ప్రజలు గడిపిన జీవన విధానం ప్రాకృఇత్క వ్యవస్థ. ఈ దశలో మానవుడు జీవించిన తీరుతెన్నులు వారిన రాజకీయ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవటంలో ప్రభావితం చేస్తాయి.హాబ్స ప్రతిపాదించిన ఈ ప్రాకృతిక వ్యవస్థ అతని సిద్ధాంతంలో అతికీలకమైన భాగము.ప్రతిమానవుడు సహజ సమానత్వాన్ని కలిగియున్నాడు. రక్షణ లేకపోవటం వలన ప్రతిమనిషి ఇతర వ్యక్తులను చూసి భయపడేవాడు. ఇవన్నీ ప్రాకృతిక వ్యవస్థలో లోపిస్తాయి.

మానవ సమాజాన్ని ప్రాకృతిక వ్యవస్థ, రాజకీయ సమాజం అని రెండు దశలుగా హాబ్స్, లాక్, రూసోలు విభజించారు. ప్రజాసమ్మతిని ఆధారం చేసుకొని రాజకీయ సమాజం ఏర్పడుతుంది అంటాడు హాబ్స్. అయితే సామాజిక ఒడంబడిక సామూహికమైనది, ఏకపక్షమైనది. ఎందుకనగా ఒప్పందం ప్రజలమధ్య కానీ, ప్రభువుకు ప్రజలకు మధ్య జరగదు అంటాడు హాబ్స్.ప్రాకృతిక వ్యవస్థలో జీవించిన ప్రజలు సామాజిక ఒడంబడిక ద్వారా త్మ సర్వహక్కులను రాజుకు ఇచ్చివేస్తారు. అతడు అధిపతిగా రాజకీయ సమాజం అవతరిస్తుంది. ఇందులోని ప్రజలు సార్వభౌముని అహికారానికి పూర్తిగా విధేయులై ఉంటారు.

హాబ్స ప్రతిపాదించిన సార్వభౌమ అభికారం ప్రాకరము, సార్వభౌమునికి అధికారాలపై ఎటువంటి పరిమితులు లేవు, ఆయన ఆజ్ఞలే చట్టాలు, ఆ చట్టాలను ఆయనే నిర్ణయిస్తాడు. సార్వభౌమునికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాతు చేయరాదు.వార్కి ఆహక్కు లేదు. పౌరస్వేచ్చలు చట్టపరిమితులకు లోనై ఉంటాయి. అన్ని వ్యవహారాలలో ప్రభువుదే పై నిర్ణయం.

మూలములు

[మార్చు]
  • 1980 భారతి మాసపత్రిక. వ్యాసము:ధామస్ హాబ్స్ సార్వభౌమిక సిద్ధాంతము. వ్యాసకర్త: శ్రీ. వి. కృష్ణారావుగారు.