దండుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దండుని రాజ్యముపై బురద వర్షము కురుస్తున్నపుడు దానికి దూరముగా తన ఆశ్రమమునకు దగ్గరగా ఉన్న కొలను దగ్గర ఉండమని తన కూతురు అరుజకు సలహా ఇస్తున్న శుక్రాచార్యుడు.

దండుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. వీడు చాలా దుర్మార్గుడు. చిన్నప్పుడు తోటి పిల్లలను చాలా బాధించి, ఒకప్పుడు చంపేవాడు. అందుకు తండ్రి కోపించి ఊరు నుండి బహిష్కరించెను. దండుడు వింధ్యపర్వతము సమీపంలో మధుమంత పురము నిర్మించి పాలించుచుండెను.

ఇతడు రాక్షసులతో స్నేహం చేసి శుక్రాచార్యుని వద్ద విద్య నభ్యసించుచుండెను. పురోహితుడైన శుక్రాచార్యుని అండదండలతో దండుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. దండుడు ఒకరోజు శుక్రాచార్యుల ఆశ్రమానికి వెళ్లాడు. అచటా గురుపుత్రిక ఐన అరజను చూసి ఆమె అందానికి ముగ్దుడయ్యాడు. తన కోరిక తీర్చమని వెలిబుచ్చాడు. ఆమె ఓర్పుతో "రాజా! నేను పుణ్యకర్మలు చేస్తూ ఉండే శుక్రాచార్యుని పుత్రికను. నా పేరు అరజ. నా తండ్రి నీకు గురువు నీవు నన్ను కోరుకుంటున్నట్లయితే ధర్మసమ్మతంగా నా తండ్రి వద్దకు పోయి అడుగు, నా తండ్రిని యాచించు" అని చెప్పింది. కామపరవశుడైన ఆ దండుడు ఆమెను కౌగిలించుకుని బలాత్కారంగా అనుభవించాడు. పాపకృత్యాన్ని చేసి తన నగరానికి వెళ్లిపోయాడు. [1]

శుక్రునికీ వార్త తెలిసి కోపించి, అతని పురముపై శతయోజనముల వరకు మట్టి వర్షము కురియునట్లు శపించెను.[2] ఆ ప్రదేశంలో మొలిచిన అరణ్యమే దండకారణ్యము

మూలాలు

[మార్చు]
  1. "శుక్రాచార్యుడి శాపం - Vaartha". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-04-05.
  2. "Sri Vamana Mahapuranam". www.kamakoti.org. Retrieved 2021-04-05.
"https://te.wikipedia.org/w/index.php?title=దండుడు&oldid=3878515" నుండి వెలికితీశారు