దఖిని భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దఖిని్ (దఖిని హిందీ[1] లేదా దఖిని ఉర్దూ[2], దకని, దక్ఖిని) అనేది నాటి ఉత్తర భారత దేశంలో మాట్లాడబడే హిందూస్తానీ (ఉర్దూ/హిందీ) భాష యొక్క ఒక రూపం, ఒక శ్హైలి. ఇప్పుడు దక్షిణ భారత ప్రాంతంకు చెందిన భాషగా పరిగణింపబడుతుంది. దఖిని్ ప్రాథమికంగా క్రీ.శ. 14 వ శతాబ్దం నుండి క్రీ.శ. 18 వ శతాబ్దం వరకు బహమనీ, కుతుబ్ షాహి, ఆదిల్ షాహి సుల్తానుల కాలమానంంలో అభివృద్ధి చెందిన ఉర్దూ భాష యొక్క పూర్వ రూపం. తరువాత శతాబ్దంలో దీనిపై హిందీ తో పాటు ఇతర భాషల ప్రభావం కనబడుతుంది. ఢిల్లీ చుట్టూ ఉన్న ప్రదేశాలలో మాట్లాడే బ్రజ్ భాష, అవధ్ భాష, హర్యాణ్వి, పంజాబీలతో పాటు మరాఠీ, గుజరాతి ఇంకా తెలుగు, కన్నడ మొదలగు దక్షిణ భాషల ప్రభావం చాలా ఉంది. అంతే కాకుండ అరబిక్, పర్షియన్, టర్కిష్ పదాలను కూడా తీసుకొని దఖిని్ ఒక ప్రత్యేకమైన శైలితో అభివృద్ధి చెందింది. ఇది ప్రధానంగా పర్షియన్ లిపిలో వ్రాయబడుతుంది. కవులు ప్రధానంగా ఈ భాషను 'హింద్వి', 'హిందు దఖిని' అని పిలిచేవారు. దఖిని్ని ఒక విధంగా ఆధునిక హిందీ/ఉర్దూ కన్న ముందే వాడకంలో ఉన్న భాష అని చెప్పవచ్చు.

ఈనాడు దఖినిలో హిందూస్తానీ పదాలు ఉన్నాయి. ఇవి ఆధునిక హింది, ఉర్దూలో ఇప్పుడు లేవు. దఖిని ఎక్కువగా దక్షిణ భారతంలో ఇస్లాం మతంకు చెందిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతారు. ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్రభాష ప్రభావం ఉంటుంది. మహారాష్ట్ర లో మరాఠి, కర్ణాటాకలో కన్నడ, తమిళనాడు లో తమిళం, ఆంధ్ర-తెలంగాణలో తెలుగు ప్రభావం కనబడుతుంది. ఆంధ్రలో తెలుగు పదాలు దఖిని భాషలో ఎక్కువగా కనబడతాయి.

మూలాలు[మార్చు]

దఖిని మాట్లాడే ప్రాతం
  1. Khan, Abdul Jamil (2006). Urdu/Hindi: An Artificial Divide: African Heritage, Mesopotamian Roots, Indian Culture & Britiah Colonialism. Algora Publishing. ISBN ISBN 978-0-87586-438-9. Check |isbn= value: invalid character (help).
  2. Azam, Kousar J. (9 August 2017). Languages and Literary Cultures in Hyderabad. Routledge. ISBN 978-1-351-39399-7
"https://te.wikipedia.org/w/index.php?title=దఖిని_భాష&oldid=3368597" నుండి వెలికితీశారు