దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్
201603 Danyang-Kunshan grand bridge (wuxi).JPG
మోసే వాహనాలు రైలు
ప్రదేశం చైనా జియంగ్సు ప్రావిన్స్
మొత్తం పొడవు 164.8 kilometres (102.4 mi)
నిర్మాణ ప్రారంభం ca. 2006
నిర్మాణం పూర్తి 2010
ప్రారంభం 30 జూన్ 2011
Danyang–Kunshan Grand Bridge.png
భౌగోళికాంశాలు 31°35′52″N 120°27′25″E / 31.597837°N 120.456848°E / 31.597837; 120.456848

దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్ (Danyang–Kunshan Grand Bridge) అనేది ప్రపంచంలో అతిపొడవైన వంతెన. ఇది బీజింగ్-షాంఘై హై-స్పీడ్ రైలుమార్గం కోసం నిర్మించబడిన 164.8 కిలోమీటర్ల (102.4 మైళ్ళు) పొడవైన వయాడక్ట్ (అనేక మధ్య గోడల వంతెన).

వంతెన[మార్చు]

వంతెన ఈస్ట్ చైనా జియంగ్సు ప్రావిన్స్ లో షాంఘై మరియు నాన్జింగ్ మధ్య రైలు మార్గంలో ఉంది. ఇది యాంగ్జీ నది డెల్టా ప్రాంతంలో ఉంది ఈ భౌగోళిక ప్రాంతం లోతట్టు ప్రాంత వరి మడులు, కాలువలు, నదులు మరియు సరస్సుల లక్షణాలను కలిగి ఉంది. ఈ వంతెన సుమారు 8 నుంచి 80 కిమీ (5 నుండి 50 మైళ్ళు) నదికి దక్షిణంగా, యాంగ్జీ నదికి సమాంతరంగా ఉంటుంది.

2010లో పూర్తయిన ఈ వంతెన 2011లో ప్రారంభించబడింది. దీని నిర్మాణానికి 10,000 మంది సిబ్బందితో నాలుగు సంవత్సరాలు పట్టింది, దీని నిర్మాణ వ్యయం 8.5 బిలియన్ డాలర్లు. ఈ బ్రిడ్జి 2011లో ప్రపంచంలో అతి పొడవైన వంతెనగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది.[1]

మూలాలు[మార్చు]

  1. Longest bridge, Guinness World Records. Last accessed July 2011.