దయావీరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దయావీరులు
"దయావీరులు" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: చల్లా రాధాకృష్ణ శర్మ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పరోపకారానికి తెలియజేసే ఐదు కథలు
ప్రచురణ: తిరుపతి తిరుమల దేవస్థానములు
విడుదల: 1983
ముద్రణ: తిరుపతి తిరుమల దేవస్థానములు ప్రెస్
ప్రతులకు: తిరుపతి తిరుమల దేవస్థానములు

దయావీరులు తిరుమల తిరుపతి దేవస్థానములు 1983 సంవత్సరంలో ప్రచురించిన తెలుగు పుస్తకము. దీనిని చల్లా రాధాకృష్ణ శర్మ రచించాడు[1].

నేటి తరంలో మానవీయ విలువల్ని పెంచి పోషించడానికి తిరుపతి తిరుమల దేవస్థానం ఈ గ్రంథాన్ని ప్రచురిందింది. ఈ చిన్న పుస్తకంలోని కథలు పరోపకార గుణాన్ని పెంపొందించుకోవడానికి అత్యంత ఉపయుక్తాలు అవుతాయి.

చల్లా రాథాకృష్ణశర్మ రచిందిన దయావీరులు అనే ఈ చిన్న పుస్తకంలో - శ్రీరాముడు లంకను కడుతున్న వారధి నిర్మాణంలో తనఒంతు సహకారాన్ని అందించిన ఉడుత భక్తి గురించి, స్వర్గమర్గాన తనతో పాటు నడిచివచ్చిన కుక్కను కూడా మార్గమధ్యంలో వదలి పెట్టిరావడానికి ఇచ్చగించని ధర్మరాజు భూతదయ గురించి, తన కుమారుని గరుడునికి ఆహారంగా పంపలేక విలపిస్తున్న నాగమాతను ఓదార్చి తాను ప్రాణత్యాగానికి సిద్ధమయిన జీమూత వాహనుని గురించి, యువరాజు రథచక్రాలక్రింద పడి ప్రాణాలు వదలిన ఆవుదూడను చూచి తనకు న్యాయం చేయమని కోరిన గోమాతను ఓదార్చి, తన కుమారుడైన యువరాజుజు తన రథ చక్రాలతో త్రొక్కించడానికి వెనుకాడని మనునీతి చోళుని గురించి, తన దగ్గరకు వచ్చిన కుక్కకు నేతి గారెలు తినిపిస్తూ ఆ ప్రాణిలో కూడా తన ఆరాధ్యదైవమైన పాండురంగని దర్శించిన నామదేవుని గురించి - ఐదు కథలు ఉన్నాయి. ఈ పుస్తకాని 1982లో ప్రథమ ముద్రణను తిరుపతి తిరుమల దేవస్థానం వారు చేసారు.[2]

విషయసూచిక

[మార్చు]
  • ఉడుతభక్తి
  • ధర్మరాజు భూతదయ
  • జీమూతవాహనుడు
  • మనునీతి చోళుడు
  • నామదేవుడు

మూలాలు

[మార్చు]
  1. దయావీరులు, రచన: చల్లా రాధాకృష్ణ శర్మ, తి.తి.దే.ప్రచురణల క్రమసంఖ్య 114, ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1983
  2. "Dayavirulu | By Tirumala Tirupati Devasthanams". ebooks.tirumala.org. Retrieved 2020-05-10.

బాహ్య లంకెలు

[మార్చు]