Jump to content

దశభుజ వినాయక దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 18°30′20.80″N 73°49′32.88″E / 18.5057778°N 73.8258000°E / 18.5057778; 73.8258000
వికీపీడియా నుండి
దశభుజ వినాయక దేవాలయం
దశభుజ వినాయక దేవాలయం is located in Maharashtra
దశభుజ వినాయక దేవాలయం
మహారాష్ట్రలో దేవాలయ ప్రాంతం
దశభుజ వినాయక దేవాలయం is located in India
దశభుజ వినాయక దేవాలయం
దశభుజ వినాయక దేవాలయం (India)
భౌగోళికం
భౌగోళికాంశాలు18°30′20.80″N 73°49′32.88″E / 18.5057778°N 73.8258000°E / 18.5057778; 73.8258000
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాపూణే జిల్లా
ప్రదేశంఎరంద్‌వానే, కార్వే నగర్ రోడ్డు, పూణే
సంస్కృతి
దైవంవినాయకుడు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుపశ్చిమ భారత నిర్మాణ శైలీ

దశభుజ వినాయక దేవాలయం, మహారాష్ట్రలోని పూణేలో ఉన్న వినాయకుడి దేవాలయం. పూణేలోని కార్వే రోడ్‌లో ఉన్న పురాతన దేవాలయాలలో ఇది ఒకటి.[1] దశభుజ వినాయక దేవాలయాన్ని ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు సందర్శిస్తారు. వినాయక చవితి సందర్భంగా అధికసంఖ్యలో విచ్చేస్తారు.[2]

చరిత్ర

[మార్చు]

పీష్వా సర్దార్ అయిన సర్దార్ హరిపంత్ ఫడ్కే యాజమాన్యంలో ఉన్న ఈ దేవాలయం పీష్వాలకు విరాళంగా ఇవ్వబడింది. పది చేతుల గణపతి విగ్రహం ప్రతిష్టించబడినందున దశభుజ గణపతి అనే పేరు వచ్చింది.

ప్రత్యేకత

[మార్చు]

ఇక్కడున్న వినాయకుడి తొండం అతని కుడివైపున ఉంటుంది, ఇది వినాయక విగ్రహాల ఇతర రూపాలకంటే అరుదైనది, పవిత్రమైనదిగా భావించబడుతోంది.[3] రద్దీగా ఉండే కూడలిలో ఉన్నప్పటికీ కార్వే రోడ్ ఫ్లైఓవర్ నుండి ఈ దేవాలయం కనిపిస్తుంది. స్థానిక నివాసితులలో ముఖ్యంగా సాయంత్రం పూట దేవాలయానికి వచ్చే సీనియర్ సిటిజన్‌లతో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ దేవాలయంలో హనుమంతుని గుడి కూడా ఉంది.

ప్రదేశం

[మార్చు]

ఈ దేవాలయం మహారాష్ట్ర, పూణే నగరం, ఎరంద్‌వానేలోని పాండురంగ్ కాలనీలో కార్వే నగర్ రోడ్డు పక్కన ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Dashbhuja Ganpati Temple, Pune". Tripadvisor (in ఇంగ్లీష్). Retrieved 2022-07-03.
  2. Shilpa (2019-10-31). "Dashabhuja temple, Pune". Retrieved 2022-07-03.
  3. Menon, Anoop. "Ganesh Chaturthi 2017: Famous Ganesh Temples in Pune | India.com". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-03.
  4. "Dashabhuja Ganapati Temple Pune Timings, Entry Fee, Ticket Cost Price; Dashabhuja Ganapati Temple Opening & Closing Time, Holidays & Phone Number - Pune Tourism 2021". punetourism.co.in. Retrieved 2022-07-03.

బయటి లింకులు

[మార్చు]