Jump to content

దసరా పద్యాలు

వికీపీడియా నుండి
దుర్గాదేవి - దేవీ నవరాత్రులు (దసరా)

దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గృహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు..

పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. మచ్చుకు కొన్ని పద్యాలు చూడండి

పద్యం 1

[మార్చు]

ఏ దయా మీ దయా మా మీద లేదు,

ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,

దసరాకు వస్తిమనీ విసవిసలు పడక

చేతిలో లేదనక అప్పివ్వరనక

పావలా.. .ఐతే ...పట్టేది లేదు,

అర్ధ రూపాయైతె అంటేది లేదు,

ముప్పావలా అయితే ముట్టేది లేదు,

అచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,

అయ్య వారికి చాలు ఐదు వరహాలు

పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు

జయీభవా...దిగ్విజయీభవా

పద్యం 2

[మార్చు]

రాజాధిరాజ శ్రీ రాజ మహరాజ

రాజ తేజోనిధీ రాజ కందర్ప

రాజకంఠీరావా రాజ మార్తాండ

రాజ రత్నాకరా రాజకుల తిలక

రాజ విద్య్త్సభా రంజన మనోజ

రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస

సుజన మనోధీశ సూర్య ప్రకాశ

నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ

ప్రకటిత రిపు భంగ పరమాత్మ రంగ

వర శిరో మాణిక్య వాణి సద్వాక్య

పరహిత మది చిత్ర పావన చరిత్ర

ఉభయ విద్యా ధుర్య ఉద్యోగ ధుర్య

వివిధ సద్గుణ ధామ విభవాభిరామ

జయీభవా...దిగ్విజయీభవా

ఛందస్సు: మత్తేభవిక్రీడితము

ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై

సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై

వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా