దాండియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాండియా రాస్ డాన్స్

రాస్ లేదా దాండియా రాస్ అనేది భారత దేశంలోని బృందావనంకి సంబంధించిన సంప్రదాయ జానపద నృత్యం, అక్కడ దీన్ని హోలీ దృశ్యాలను, రాధా కృష్ణుల లీలా దృశ్యాలను వివరిస్తూ ప్రదర్శిస్తారు. నవరాత్రులలో పశ్చిమ భారత దేశంలో సాయంకాలం వేళల్లో గర్బా నృత్యంతో పాటు ఇది కూడా ఒక ముఖ్య నృత్యంగా ప్రదర్శించడం జరుగుతుంది.

పదచరిత్ర[మార్చు]

"రాస్" అను పదం సంస్కృతంలోని "రస్" అనే పదం నుంచి వచ్చింది. రాస్ యొక్క మూలాలు ప్రాచీన కాలానికి చెందినవిగా గుర్తించవచ్చు. కృష్ణ భగవానుడు రాస లీల ప్రదర్శించాడు. (లీల అనగా దేవుడైన కృష్ణుడి యొక్క వినోదభరితమైన నాట్యం. "లీల" అనే పదం దేవుడు చేసే వాటిలో మనకు పూర్తిగా అర్ధం కాని వాటిని కూడా సూచిస్తుంది).

రాస్ యొక్క రూపాలు[మార్చు]

రాస్ యొక్క రూపాలు అనేకం, కానీ గుజరాత్ లో నవరాత్రులలో ప్రదర్శించే "దాండియా రాస్" అత్యంత జనప్రియమైన రూపం. రాస్ యొక్క ఇతర రూపాలలో ఒకే ఒక పెద్ద కర్ర ఉపయోగించి రాజస్తాన్ లో చేసే దంగ్ లీల మరియు దక్షిణ భారతంలో చేసే "రాస లీల" ఉన్నాయి. రాస్ లీల మరియు దాండియా ఒక దానిని ఒకటి పోలి ఉంటాయి. కొందరు అయితే గర్బాను రాస్ లో ఒక రూపంగా భావించి రాస్ గర్బా అని అంటారు.

దాండియా రాస్ లో పురుషులు మరియు స్త్రీలు చేతిలో కర్రలు పట్టుకుని రెండు వలయాలలో నాట్యం చెయ్యడం చేస్తారు. ప్రాచీన కాలంలో అయితే రాస్ లో పాటలు పాడటం అంటూ పెద్దగా ఉండేది కాదు, కేవలం డోలు దరువులే సరిపోయేవి. "దాండియా" అనగా సుమారు 18" పొడుగు ఉన్న కర్రలు. ప్రతి నర్తకి లేదా నర్తకుడు రెండు కర్రలు పట్టుకున్నప్పటికీ, అప్పుడప్పుడూ దాండియాలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒకే ఒక్క దాన్ని కుడి చేతిలో ఉపయోగిస్తారు. సాధారణంగా, ఒక నాలుగు దరువుల తాళానికి ఎదురెదురుగా నర్తించేవారు ఒకే సమయానికి తమ కర్రలను ధ్వని వెలువడేలా అవతలివారి కర్రలకు తాకించడంతో వినసొంపు అయిన ధ్వని సృష్టించబడుతుంది. ఒక వలయం గడియారపు ముళ్ళు తిరిగే దిశలో ముందుకు సాగితే మరొకటి దానికి వ్యతిరేక దిశలో ముందుకు సాగడం చేస్తుంది. పశ్చిమంలో, నర్తించే వారు పూర్తి వలయాలను ఏర్పరచరు, అందుకు మారుగా తరచూ పంక్తులు ఏర్పరచడం చేస్తారు.

దాండియా రాస్ పుట్టుక[మార్చు]

భక్తి సంబంధిత గర్బా నృత్యాలుగా ఆరంభమై, ఎల్లవేళలా దుర్గాదేవి గౌరవార్ధం ప్రదర్శించబడే నృత్యాలలో ఒకటి అయిన ఈ నృత్య రూపం వాస్తవానికి దుర్గాదేవికీ, పరాక్రమవంతుడైన దానవరాజు మహిషాసురునికీ మధ్య జరిగిన పోరాటం యొక్క ప్రదర్శన, ఇది "ఖడ్గ నృత్యం" అని కూడా పిలవబడుతుంది. నృత్య సమయంలో, రూపకల్పన చేసిన విధంగా నాట్యకారులు చేతులు మరియు పాదాలు సంగీతానికి అనుగుణంగా కష్టమైన రీతిలో అనేక విధాలుగా లయబద్ధంగా కదుపుతూ అత్యంత శక్తితో తిరగడం చేస్తారు. డోలుతో పాటు ధోలక్, తబలా మరియు ఇతర శబ్ద వాయిద్యాలు కూడా ఉపయోగించడం జరుగుతుంది.

నృత్యంలోని కర్రలు (దాండియా లు) దుర్గాదేవి ఖడ్గంకి సూచనగా నిలుస్తాయి. స్త్రీలు ఎంబ్రాయిడరీ చేసిన, అద్దాల పనితనంతో తళుక్కుమనే సాంప్రదాయ దుస్తులు, అంటే రంగు-రంగుల జాకెట్టు, పరికిణీ మరియు బంధాని దుపట్టా వంటివి ధరించి బరువైన నగలు కూడా ధరిస్తారు. పురుషులు ప్రత్యేకమైన తలపాగాలు మరియు కేడియాలు ధరిస్తారు, అయితే, ఇవి ప్రాంతానుగుణంగా మారుతూ ఉంటాయి.

దుర్గాదేవి గౌరవార్ధం హారతి (భగవతారాధనలో ఒక ఆచారం) కి ముందు భక్తి సంబంధిత ప్రదర్శనలలో ఒక దానిగా గర్బా నృత్యం ప్రదర్శిస్తే, దాండియాను వినోదంలోని భాగంగా ఆ తర్వాత ప్రదర్శించడం జరుగుతుంది. రాస్ దాండియా మరియు గర్బాలో పురుషులు మరియు స్త్రీలు జతగా చేరడం జరుగుతుంది. దాండియా రాస్ లోని వలయాకార కదలికలు గర్బాలోని వాటికంటే అతి సంక్లిష్టమైనవి. రాస్ లేక ఈ నృత్య ప్రదర్శనలకు మూలం కృష్ణుడు. నేడు, రాస్ గుజరాత్ లో నవరాత్రులలో ఒక ముఖ్య భాగం మాత్రమే కాదు, పైరులకు, పంటకోతలకూ సంబంధించిన అనేక పండుగలకు కూడా విస్తరించబడింది. సౌరాష్ట్ర్రలోని మెర్ అనువారు రాస్ నృత్యాన్ని అత్యంత బలం మరియు సత్తువలతో ప్రదర్శిస్తారని ప్రతీతి.

చరిత్ర[మార్చు]

దుర్గాదేవి గౌరవార్ధం ప్రదర్శించే భక్తి సంబంధిత గర్బా నృత్యాలలో ఒకటిగా దాండియా రాస్ పుట్టడం జరిగింది. వాస్తవానికి దుర్గాదేవికి, పరాక్రమశాలి అయిన దానవరాజు మహిషాసురునికి మధ్య జరిగిన పోరాటాన్ని అనుసరిస్తూ చేసే ప్రదర్శన ఈ నృత్య రూపం. ఈ నృత్యాన్ని "ఖడ్గ నృత్యం" అని కూడా అంటారు. నృత్యం లోని కర్రలు దుర్గాదేవి ఖడ్గాన్ని సూచిస్తాయి.

ఈ నృత్యాలు కృష్ణుడు జీవించిన కాలంలో సంభవించిన వాటిగా గుర్తించవచ్చు. [1]నేడు, రాస్ గుజరాత్ లోని నవరాత్రులలో ఒక ముఖ్య భాగం మాత్రమే కాదు, పైరులకూ, పంటకోతలకూ సంబంధించి అనేక పండుగలకు కూడా విస్తరించడం జరిగింది.

రూపం[మార్చు]

సామాజిక కార్యక్రమాలలోను మరియు రంగస్థలము పైన కూడా రాస్ ను ప్రదర్శించడం జరుగుతూ ఉంది. రంగస్థలం పై ప్రదర్శించే రాస్ అత్యంత సంక్లిష్టమైన అడుగులు మరియు సంగీతంతో ప్రదర్శించేదిగా కూడా ఉండవచ్చు. రాస్ ఒక జానపద కళ, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఆఫ్రికా లోని బానిసలు మరియు ఓడలోని పనివారు (వారు ముస్లింలు ) సౌరాష్ట్ర్ర తీరాన్ని చేరుకున్నప్పుడు రాస్ ను తమ నృత్యంగా స్వీకరించి ఆఫ్రికన్ డ్రమ్స్ ఉపయోగించడం చేసారు. రాస్ హిందూ సంప్రదాయంలో జన్మించినప్పటికీ ముస్లిం వర్గం వారు సౌరాష్ట్రగా అవలంబించడం జరిగింది. తర్వాత కాలంలో రాస్ లో పాటలు కూడా ప్రవేశించటం జరిగింది. ప్రారంభంలో చాలా పాటలు దేవుడు కృష్ణుడు గురించినవి అయినా కాలక్రమేణా ప్రేమ గీతాలు, సాహసకరమైన యుద్ధాలలో పోరాడిన యోధులను మరియు దుర్గాదేవిని స్తుతిస్తూ గీతాలు జన్మించాయి, అంతే కాదు ముస్లిం రాస్ గీతాలు కూడా పుట్టాయి. రాస్ అంటే చాలా వేగవంతంగా ఉండాలేమో అని సాధారణంగా అనుకోవడం కద్దు, అయితే అది నిజం కాదు. నెమ్మదైన, నాజూకు కదలికలు కూడా అంతే ముఖ్యమైనవి.

సి - 60 కేసెట్ల ఆగమనంతో ముందుగా రికార్డు చేసి పెట్టిన 'నాన్ స్టాప్' రాస్ సంగీతం వచ్చి చేరింది. నేడు, బహు అరుదుగా మాత్రమే రికార్డు చెయ్యబడే ప్రత్యేక రాస్ రూపాలను అది అధిగమించడం జరిగింది. డిస్కో దరువులు మరియు పాశ్చాత్య డ్రమ్స్ ప్రజాదరణ పొందడం జరిగినప్పటికీ మనం వడోదరా లో గల ఫైన్ ఆర్ట్స్ కాలేజీని నవరాత్రులలో సందర్శిస్తే మధ్యలో సంగీతకారులు కూర్చుని వాయిస్తూ ఉండగా చుట్టూ జనులు నర్తించడాన్ని చూడవచ్చు. గుజరాతీ సినిమాలు 50లు మరియు 60ల చివరి భాగంలో ప్రవేశించడం జరిగింది. చలన చిత్ర రంగం నుండి భారీగా దిగుమతి చేసుకుని రాస్ ఒక భిన్న రూపాన్ని సంతరించుకోవడం జరిగింది.

రాస్ లో ఇతర విలక్షణమైన రూపాలు కూడా ఉన్నాయి, మహువ పట్టణంలో ఉన్నది అటువంటిదే ఒకటి, అందులో పురుషులు పైన వ్యాపించి ఉన్న ఒక త్రాడుతో ఒక చేతిని కట్టివేసుకొని ఇంకొక చేతిలో ఒక కర్రను పట్టుకోవడం చేస్తారు. ఇది సంపూర్ణంగా దుర్గాదేవిని స్తుతిస్తూ చేసేది. విశాలమైన నిర్వచనం ఉపయోగించిన సందర్భంలో "మంజీర"ను కూడా రాస్ లో ఉపయోగించవచ్చు. "మంజీర"తో రాస్ చేసే ప్రత్యేకమైన తెగలు కూడా ఉన్నాయి. "టార్నేటర్" వద్ద నృత్యం చేసే కొందరు పురుషులు అచ్చం బ్రిటిష్ పోలిస్ వారి మాదిరిగా కాళ్ళను చుట్టి మేజోళ్ళను పోలినటువంటి రంగు-రంగుల గుడ్డ పట్టీలు ధరించేవారు. ముంబై పట్టణం తనదైన ఒక ప్రత్యేక శైలి దాండియా రాస్ ను వికసింపజేసుకోవడం జరిగింది. నేడు, నవరాత్రులలో జనులు దాండియా చేస్తారు, అయితే ఎక్కువగా ఫ్రీ స్టైల్ డాన్స్ వలె చేస్తారు. యుఎస్ఎ లో, రాస్ లో "తల కదలికలు" యువతలో సర్వసాధారణం, అయితే అది గుజరాతి చలన చిత్రాల నుండి వచ్చి చేరింది. "తల కదలికలు" గాయకుల కోసం మాత్రమే, నర్తకుల కోసం కాదు.

దుస్తులు మరియు సంగీతం[మార్చు]

స్త్రీలు సాంప్రదాయ దుస్తులు, అంటే అద్దాల పనితనంతో జిగేలుమనేలా, ఎంబ్రాయిడరి చేసినటువంటి వారి సాంప్రదాయ దుస్తులు అయిన రంగు-రంగుల జాకెట్టు, పరికిణి మరియు బందాహ్ని దుపట్టా ఇంకా భారీ నగలు ధరించడం చేస్తారు. పురుషులు ప్రత్యేకమైన తలపాగాలు మరియు కేడియాలు ధరించడం చేస్తారు, అయితే ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ముందుగా కూర్చిన విధానాన్ని అనుసరిస్తూ, సంగీతానికి, భారీ మద్దెల దరువులకు అనుగుణంగా చేతులు, కాళ్ళు కదుపుతూ నాట్యకారులు వలయాకారంలో తిరగడం చేస్తారు. డోలుతో పాటు ధోలక్, తబలా మొదలైన వాటి ఉపయోగంతో నిజమైన నృత్యం అత్యంత సంక్లిష్టతను మరియు శక్తిని సంతరించుకుంటుంది. ఈ రెండు నృత్యాలు కూడా పంటకోతల కాలంతో సంబంధం కలిగినటువంటివి.

దాండియాకు గర్బాకు మధ్య గల భేదం[మార్చు]

గర్బాకు, దాండియాకు మధ్యగల ముఖ్యమైన భేదం ఏమనగా గర్బా హారతి (భగవతారాధనలో ఒక ఆచారం) కి ముందు దుర్గాదేవి గౌరవార్ధం భక్తి సంబంధిత ప్రదర్శనగా చేస్తే దాండియాను ఆ తర్వాత వినోద కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించడం జరుగుతుంది. గర్బా కేవలం స్త్రీలే ప్రదర్శించగా రాస్ దాండియాలో స్త్రీలు, పురుషులు ఇద్దరూ జత చేరడం జరుగుతుంది. ప్రదర్శకులు రంగులతో అలంకరించిన ఒక జత కర్రలు ప్రతీకలుగా ఉపయోగించడంతో దీన్ని "ఖడ్గాల నృత్యం" అని కూడా అంటారు. దాండియా రాస్ లోని వలయాకార కదలికలు గర్బాలో వాటికంటే అతి సంక్లిష్టమైనవి.

భారతీయ డయాస్పోరా నడుమ[మార్చు]

యుఎస్ఎలో రాస్ యొక్క ఒక కొత్త రూపం ప్రదర్శించబడుతూ ఉంది. ఇది అధిక భాగం ఒక ప్రదర్శన వస్తువు, ఇందులో భారత దేశానికి చెందినవారైన కళాశాల విద్యార్థులు నాన్ స్టాప్ రాస్ సంగీతాన్ని బలమైన డ్రమ్స్ దరువులు మరియు స్టంట్స్ తో పాటు వెడ్డింగ్, స్టార్ వార్స్ మరియు లయన్ కింగ్ వంటి "థీమ్స్"తో జత చెయ్యడం జరుగుతూ ఉంది. వారు స్వేచ్ఛగా సంప్రదాయమైన అడుగులకు ఇతర అడుగులను కలిపెయ్యడం చేస్తారు. జీవిత చక్రాన్ని, గుండె చప్పుడును సూచించేది కావడంతో రాస్ ఎల్లప్పుడూ ఉత్సాహవంతమైనదిగానే ఉంటుంది. ఇది కాలానుగుణంగా మార్పులు చెందినది, ఇంకా మార్పులు చెందబోయేది అయిన ఒక సజీవమైన జానపద కళ.

బాహ్య లింకులు[మార్చు]

  1. హెచ్ టి టి పి://డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు .ఆర్ ఐ ఐ టి ఐ .కాం/2006 -09-గర్బా _దాండియా_ రాస్ డాన్సస్_అండ్_మ్యూజిక్_ఆఫ్_నవరాత్రి.హెచ్ టి ఎం ఎల్
"https://te.wikipedia.org/w/index.php?title=దాండియా&oldid=2435170" నుండి వెలికితీశారు