Jump to content

దాకూరు ద్వారక

వికీపీడియా నుండి
రణచోడ్‌రాయ్‌జీ అనే కృష్ణుడి ఆలయం

ప్రవేశిక

[మార్చు]

గుజరాత్ రాష్ట్రంలోని కెడా జిల్లాలో ఉన్న నగరపాలితాలలో దాకూరు ద్వారకా నగరం ఒకటి. ఈ నగరం ప్రస్తుతం రణచోడ్‌రాయ్‌జీ కృష్ణ దేవాలయానికి ప్రసిద్ధి. ఈ నగరాన్ని పంచద్వారకా నగరంలో ఒకటిగా భావిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని ప్రాచీన తీర్ధయాత్రా ప్రదేశాలలో దాకూర్ ఒకటి. వాస్తవానికి ప్రారంభదశలో దాకూరు దన్కాంత్ శివాలయానికి శివారాధనకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం. అయినా తరువాతి దశలో ఇది రణచోడ్‌రాయ్‌జీ ఆలయం కారణంగా వైష్ణవ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణం 1772లో జరిగింది. ప్రస్తుతం ఈ ప్రదేశం పుణ్య క్షేత్రంగానే కాకుండా వాణిజ్యకేంద్రంగా కూడా ప్రసిద్ధి చెంది ఉంది. హిందువుల పూజ, ఇతర ఆచారాల అనుష్టానికి కావలసిన సామానులు లభ్యమౌతాయి.

చరిత్ర

[మార్చు]

1957లో ఈ కథ ప్రచారంలోకి వచ్చింది. బోధనా ఒక కృష్ణభక్తుడు శ్రమపడి దాకూరు నుండి సుదూరంలో ఉన్న ద్వారకకు ప్రతి పౌర్ణమిరోజూ నడచి వెళ్ళేవాడు. బోధనాకు వృద్ధాప్యం వచ్చిన తరువాత ద్వారకకు చేరుకోవడం ప్రయాశ అయిన పని అయింది. అప్పుడు భగవంతుడైన కృష్ణుడు బోధనతో ఇక ద్వారకకు శ్రమపడి రానవసరం లేదని తానే అతడితో దాకూర్‌కు వచ్చిక్కడ నివసిస్తానని మాటిచ్చాడు. అందువలన కొంత మంది భక్తులు కృష్ణ విగ్రహాన్ని దాకూర్‌కు తరలించే ప్రయత్నాలు చేసారు. ద్వారకా ప్రజలు అందుకు తమ అభ్యంతరం తెలిపి వారిని శక్తికొద్దీ ఎదుర్కొన్నారు. కృష్ణుడు భక్తులతో విగ్రహాన్ని నీటిలో పడవేయమని చెప్పాడు. ప్రాంతీయవాసులు విగ్రహాన్ని వెదుకుతూ కర్రలతో నీటిలో గుచ్చారు. అయినా వారు విగ్రహాన్ని కనిపెట్ట లేక పోయారు. భక్తులు కృష్ణ విగ్రహాన్ని వెలుపలికి తీసినప్పుడు విగ్రహం అంతా గాయాలను చూసారు. ఈ గాయాలు కర్రలతో పొడిచినప్పుడు ఏర్పడినవే. అప్పుడు ప్రాంతీయ వాసులు భక్తులను ఆ విగ్రహానికి సరి ఎత్తు బంగారాన్ని ఇమ్మని అడిగారు. భక్తుడు వద్ద ఉన్న బంగారం భక్తుని భార్యవద్ద ఉన్న ముక్కెర మాత్రమే. అయినప్పటికీ కృష్ణభగవానుడి విగ్రహం త్రాసులో పెట్టినప్పుడు ఆ భక్తుడి భార్య ముక్కెరతో సమానంగా తూగింది. కృధ్ణభగవానుడు భక్తుని మీద ఉన్న అనుగ్రహం కారణంగానే ముక్కెరకు సమానంగా బరువు తగ్గించుకున్నాడని భక్తుల విశ్వాసం. ప్రాంతీయ వాసులకు కృష్ణభగవానుడి విగ్రహానికి బదులుగా స్వల్పమైన బంగారం మాత్రమే లభించింది. ఈ దృష్టాంతం కారణంగా కృష్ణ భగవానుడు తన భక్తుల కొరకు నివాసాన్ని కూడా మార్చుకుంటాడని నిరూపితమైంది. సమీప కాలంగా దాకూరు గుజరత్ ప్రభుత్వ యాత్రాధమ్ వికాస్ బోర్డ్ చేత నిర్ణయించబడిన 6 పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గుజరాత్ ప్రభుత్వం లక్షల మంది సందర్శించే ఊఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసి చక్కగా నిర్వహించి భక్తులకు సౌకర్యాలను కలిగించడానికి ప్రణాళిక తయారు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ క్షేత్రాన్ని 70-80 లక్షల కంటే అధికమైన భక్తులు సందర్శిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరానికి నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఫాల్గుణ పూర్ణిమ రోజు ఉత్సవాలను దర్శించడానికి మాత్రమే ఇక్కడకు 10-15 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ ఉత్సవ సమయంలో భక్తుల మానసిక విశ్వాసం, మనిసిక ఉద్రేకం నమ్మశక్యం కానివి.

ఆలయము

[మార్చు]

దాకూరు కాలక్రమంలో చాలామార్పులకు గురి అయింది. చిన్న గ్రామం స్థాయి నుండి దాకూరు ఈ ప్రాంతంలో ఇప్పుడు అధ్యాత్మికంగానూ వాణిజ్యపరంగానూ అభివృద్ధిచెందినది. చిన్న ఆలయంగా ఉన్న కృష్ణమందిరం ఇప్పుడు పెద్ద నలుచదరపు ఆలయసముదాయాల మధ్య పొదగబడింది. ఈ ఆలయము నాలుగు ద్వారాలు కలిగి విశాలమైన ఆలయరూపము దాల్చింది. ఆలయ వెలుపలి ప్రాకారంలో సామానులు భద్రపరిచేగది వివిధకార్యాలయాలు నిర్మించబడి ఉన్నాయి. ప్రధానాలయం ప్రాకారం మధ్యలో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. గర్భగుడిలో ఉండే కృష్ణుని రూపం విష్ణుమూర్తిలా చతుర్భుజ రూపంలో ఉంటుంది. భగవానుడి రూపం శంఖు, చక్ర, గదా, తామరపుష్పములతో అభయ, కటి హస్తములతో ఉంటుంది. ఇక్కడ కృష్ణుడిని ద్వారకానాధ్‌గా ఆరాధిస్తారు. ఇక్కడ దైవము యువకుడైన కృష్ణుడి రూపములో ఉంటుంది.

పండుగ

[మార్చు]

పౌర్ణమి రోజున ప్రజలు ఆలయానికి కృష్ణభగవానుడిని ఈ ఆలయానికి తీసుకు వచ్చిన భక్తుడి నుండి ఆశీర్వాదము కోరుతూ వస్తుంటారు. అందువలన ప్రజలు నగరానికి ప్రవాహంలా వస్తుండడం వలన నగరం జనంతో నిండి పోతుంది. హోలీ పండుగ సందర్భంలో ఫిబ్రవరి, మార్చి మాసాలలో ఇక్కడ సంబరాలు, సంత కూడా ఉత్సాహంగా ఏర్పాటు చేస్తారు. హిందువులు ఈ పండుగ రోజును పవిత్ర దినంగానూ సత్యానికి మంచితనానికి కలిగిన విజయంగా భావించి ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు. నవరాత్రి తరువాత వచ్చే శరత్కాల పూర్ణుమ రోజు కృష్ణుడు దాకూర్‌కు రణచోడ్‌రాయ్‌జీగా తన ప్రియ భక్తుడైన బోధనతో వస్తాడని భక్తులు విశ్వసిస్తారు. కృష్ణభగవానుడు దాకూర్‌కు తాను తన భక్తుడైన బోధనాకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి వస్తాడని భ్యక్తులు విశ్వసిస్తారు.

భౌగోళికం

[మార్చు]

దాకూరుద్వారక సముద్రమట్టానికి 49 మీటర్లు (160 అడులు) ఎత్తులో ఉంది.

అనుసంధానం

[మార్చు]

దాకూరు రహదారి మార్గము ద్వారా, రలి మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. ఆనంద్ - గోద్రా వరకు ఉన్న మీటర్ గేజ్ రైలు మార్గంలో దాకూరు రైల్ స్టేషను ఉంది. ఆనంద్, నాడియాడ్ మధ్య ఉన్న 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరం రైలుమార్గం, రహదారి మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. అహమ్మదాబాదు, వడోదరా దాకూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ రెండు దాకూరుతో రైలు మార్గం, వాయుమార్గం, రహదారి మార్గాలతో చక్కగా అనుసంధానించబడ్శి ఉన్నాయి.

జనభా గణాంకం

[మార్చు]
సంఖ్య వివరణ సంఖ్య లేక శాతం
1 జనాభా 2001 జనాభా లెక్కలు- 23,784
2 పురుషులు 53%
3 స్త్రీలు 47%
4 అక్షరాస్యత 76%
5 పురుషుల అక్షరాస్యత 82%
6 స్త్రీలక్షరాస్యత 69%
7 6 సంవత్సరముల లోపు బాలబాలికలు 10%

వెలుపలి లింకులు

[మార్చు]

పరిశీలనకు

[మార్చు]