దాగుడు మూతలు (ఆట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాగుడు మూతలు ఆట ఆడుతున్న బాలురు 1881 లో చిత్రం)

తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఆడుకునే ఆట దాగుడుమూతలు. ఇది ఏ కాలంలో నైనా ఆడుకోగల ఆట. ఇంగ్లీషులో 'హైడ్‌ అండ్‌ సిక్‌' అంటూ ఆడే ఆట ఇదే. ఈ ఆటను ఆడించేవారు విడిగా ఉంటారు. పిల్లలు పంటలు వేసుకుని ఒక దొంగను ఎంచుకుంటారు. ఆడించే వ్యక్తి ఆ దొంగను ముందు కూచోబెట్టుల్కుని కళ్ళు మూసి, ఒక చెయ్యి పట్టుకుని ఎదురుగా నిలబడ్డ పిల్లలలో ఒకరి వంక చూపిస్తూ, "వీరీవీరీ గుమ్మడిపండు వీరి పేరేమి" అని అడుగుతారు. దొంగ ఎవరో ఒకరి పేరు చెప్పగానే ఆడించే వ్యక్రి, ఆ పిల్ల పేరునే చెబుతూ నువ్వెళ్ళి దాక్కో అని చెబుతారు. ఆ తరువాత మరొక పిల్లవాడీ పేరు అడుగుతారు. ఇలా అందరి పేర్లూ అడిగి అందరినీ దాక్కోమంటారు. . ఇలా ఆటగాళ్ళందరూ ఎక్కడో ఒకచోట దొంగకు కనబడకుండా దాక్కుంటారు.

ఆ తరువాత ''దాగుడు మూతలు దండాకోర్‌! పిల్లీ వచ్చే ఎలుకా భద్రం, ఎక్కడి వాళ్ళక్కడే గప్‌చుప్‌ సాంబారు బుడ్డీ'' అని పాడుతూ దొంగ కళ్ళపై అడ్డుగా ఉన్న చెయ్యి తీసేసి, దాక్కున్న ఆటగాళ్ళను కనుక్కోమని చెబుతారు. దొంగ ఆటగాళ్ళ కోసం అంతా వెదుకుతాడు. ఎవరు ముందు దొరికితే వాళ్ళు దొంగ అవుతారు. ఈ కొత్త దొంగతో ఆట మళ్ళీ మొదలౌతుంది. [1][2]


ఈ పేరుతో 2 తెలుగు సినిమాలు, సినిమాల్లో పాటలూ వచ్చాయి.

మూలాలు

[మార్చు]
  1. "హుషారునిచ్చే పాత ఆటలు | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.
  2. తెలుగువారి సంప్రదాయాలు. నిత్ర పబ్లికేషన్స్. pp. 363–365.