దాసరి రమేష్
తెలుగు సాహిత్యంలో ఉన్న వివిధ ప్రక్రియలలో శతకం వినూత్నమైనది. ఎందరో కవులు శతక రచనలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎందరో కవులు పురాణ కథలను వస్తువులుగా స్వీకరించి కావ్యాలతో, అతి వర్ణనలతో, ఊహాలోకంలో విహరిస్తుంటే కొందరు కవులు తమ పాండిత్యాన్ని ఎన్నో శతకాల రూపంలో రచించి సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించడానికి ఉపకరించారు. నీతి, వైరాగ్య, హాస్య, శృంగారాత్మక నేపధ్యాలతో ఎందరో కవులు ఈ శతకాలను రచించారు. అలాంటి వారిలో కవి చౌడప్ప, కాసుల పురుషోత్తమ కవి, వేమనలు తెలుగు సాహిత్యంలో చెరగని ముద్రను వేసుకున్నారు. మరీ ముఖ్యంగా వేమన అలతి పదాలతో ఆటవెలది ఛందస్సులో రాసిన పద్యాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి. మూఢనమ్మకాలతో, వింత ఆచారాలతో, మనుషులలో మూర్ఖత్వం పెరిగిపోయి, మానవత్వం నశించి పోతున్న తీరును విమర్శిస్తూ సమాజాన్ని ఉత్తమ దిశలో నడిపించేలా పద్యాలను కూర్చారు. వీరి స్ఫూర్తితో తదనంతర కాలంలో ఎందరో కవులు వేమన మకుటాన్ని ప్రయోగిస్తూ వేమన వలెనే పద్యాలు రచించగా, మరికొందరు ఆటవెలది పద్యాలతో ముక్తకాలను రచించి పిల్ల వేమనలు అనిపించుకున్నారు. కథలు, వచన కవితలు, హైకు, నానీలు విరివిగా రచించబడుతున్న ఈ కాలంలో పద్య రచన చేసే యువ కవులు చాలా తక్కువనే చెప్పవచ్చు. అలాంటి వారిలో ఒకరు డా. దాసరి రమేష్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
దాసరి రమేష్ - జీవన రేఖలు:
[మార్చు]యువకవి అయిన దాసరి రమేష్ గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలోగల కొండేపాడు గ్రామంలో దాసరి కనకరాజు, మేరీ కుమారి పుణ్య దంపతులకు జూన్ 12, 1986 లో జన్మించారు. వీరి బాల్యం అంతా కొండేపాడులోనే గడిచింది. ప్రాధమిక విద్యాభ్యాసం వీరి స్వస్థలం అయిన కొండేపాడులోని మండల ప్రాథమిక పాఠశాలలోనూ, ఉన్నత విద్యను కోయవారిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొంత వరకు, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల బాలుర వసతి గృహ పాఠశాల పల్లపట్లలోనూ, కళాశాల విద్యను ఎన్.టి.ఆర్ కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులోగల ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలోనూ, స్నాతకవిద్యను హిందూకాలేజీ గుంటూరులోనూ, స్నాతకోత్తరస్థాయి విద్య, పిహెచ్.డి. విద్యను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ పూర్తి చేశారు. వీరి వివాహం 2018లో జరిగింది.
రమేష్ సాహిత్యం:
[మార్చు]రమేష్ కవిగా మొదట గుర్తింపు తెచ్చినది డా. ఎన్. వి. కృష్ణారావు గారి సంపాదకత్వంలో వచ్చిన “కర్మ కాదు క్రియ” వచన కవితా సంపుటి. ఇది 2018లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. ఆవిష్కరించబడింది. తరువాత వీరి శతకమైన "శాంతి పుత్ర శతకం" 2020లో ప్రచురణ పొందింది. ఆ తరువాత వారు పని చేసే పాఠశాలలోని విద్యార్థులతో ‘అమ్మ’ అనే అంశం మీద వచన కవితలను రాయడంలో వారిని ప్రోత్సహించి, [1]అమ్మకు అక్షరాభిషేకం” అనే వచన కవిత సంపుటిని 2022 లో వెలువరించారు. సాహిత్యం పట్ల విద్యార్థులలో కూడా ఆసక్తిని కలిగించి, వారిలో స్వీయ రచన కౌశలాలను అభివృద్ధి చేయడంలో కృషిచేశారు. వీరి రచనా ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.
శాంతి పుత్ర శతకం - సామాజికత:
[మార్చు]రమేష్ రచించిన శతకాలలో ఇది మొదటిది. శతక శీర్షికనే మకుటంగా స్వీకరించి, వీరు రచించడం జరిగింది. శాంతి కాంక్ష కలిగిన వ్యక్తిగా తన శతకంలోని శాంతిని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ రచించిన విధానం కనిపిస్తుంది. “ఈ శతకంలోని పద్యాలకు వస్తువు బైబిల్, సమకాలీన సమాజంలోని సమస్యలు, సంఘటనలు హేతువులయ్యాయి. బైబిల్ ను ఆధారంగా చేసుకొని రచించినా, ఇక్కడ చెప్పబడినవి మాత్రం ప్రాపంచిక సత్యాలు.” (పీఠిక – శాంతిపుత్ర శతకం – పుట: vii) అయితే ఇందులో భక్తి భావం కనిపించే పద్యాలు తక్కువే అని చెప్పాలి. అన్నీ కూడా నీతి పద్యాలే కనిపిస్తాయి. పెడత్రోవ పడుతున్న సమాజానికి హిత బోధ చేసేలా కనిపిస్తాయి.
శాంతి పుత్ర శతకం - నామౌచిత్యం:
[మార్చు]శాంతి పుత్ర శతకం అని పేరు పెట్టడంలో, మకుటంగా ఎంచుకోవడంలో శతక కర్త ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రపంచమంతా శాంతితో వర్ధిల్లాలని ఉద్యమించే ప్రతీ ఒక్కరూ శాంతి పుత్రులే. కాగా అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవారు క్రీస్తు, గౌతమ బుద్ధుడు వంటి వారని శతక కర్త అభిప్రాయం. ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని వ్యక్తులను ఉద్దేశించి ప్రయోగించారు.
శాంతి పుత్ర శతకం - నీతి ప్రభోదకత:
[మార్చు]మూర్ఖ జన చిత్రణ:
[మార్చు]మంచి బుద్ధి కల వారు ఎవరు ఏమి చెప్పినా దానిలో మంచి చెదులను విచక్షణ చేసి, మంచిని గ్రహించి అమలు చేస్తాడు. కాని మూర్కులు ఒకరు చెప్పేది వినిపించుకోరు. మూర్ఖులు వల్ల సమాజానికి విఘాతం కలుగుతుంది. అందుకే మూర్ఖుల విషయంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో వివరణ ఇస్తున్న తీరుని మనం ఈ పద్యాల్లో గమనించవచ్చు.
“ఎవ్వరెన్ని జెప్పిరేని మూర్ఖ మదికి
ఎవ్విధముగనైన నెరుక గాదు
నిజము, యట్టి వారిఁ నిర్జించి జీవించు
శాంతి నొసగుమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట: 11)
మూర్ఖుడి మనసు చాలా కఠినమైనది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వాదిస్తుంటారు. ఇలాంటి వారిని ఎంత మంది వచ్చి, ఎన్ని మంచి మాటలు చెప్పి వారిని మార్చేందుకు ప్రయత్నించినా వారు మాత్రం నిజాన్ని గుర్తించలేరు. అలాంటి వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోవటం ఉత్తమమైన పని అని చెప్తున్నారు. అంతేకాక మరొక పద్యంలో-
“ఖరువునకు చబుకు, ఖరమునకు కళ్ళెము
మూర్ఖ చిత్త నరుని మూపు మీద
వాతలు సరి .........................” (శాంతి పుత్ర శతకం - పుట:11)
కొన్ని కొన్ని సందర్భాల్లో మూర్ఖుడు మాటలకు లొంగనప్పుడు గుర్రం కళ్ళకు గంతలు, గాడిదకు చిక్కం ఎలాగ ఉపయోగపడుతుందో అదే విధంగా మూర్ఖుడి వీపు మీద దెబ్బలు పడితేనే వారిలో మూర్ఖత్వం తగ్గుతుందని సూచించారు. మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు చెవికి ఎక్కించుకోరని వాపోయారు. దీనికి సాదృశ్యంగా మరొక పద్యం చూడవచ్చు.
“నదుల జలము లెన్ని నాళ్ళు కలిసినా
జలది నందు నొప్పి చవి తరగదు
మంచి మాట వలన మందుడు మారునా
శాంతి నొసగుమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట:30)
మరొక సందర్భంలో మూర్ఖురాలైన స్త్రీ గురించి కూడా చెప్పారు. స్త్రీలు మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే తామే నష్టపోతారు. మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల భర్తల వల్ల చేటుని కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు. అదే తెలివి గలిగిన స్త్రీ అయితే తమ భర్తలకు, కుటుంబానికి కిరీటం లాగా ఉంటుందని సూచించారు.
మూలాలు:
[మార్చు]1. https://www.auchithyam.com/advanced/latest/index.php%7Caccess-date=2024-04-22%7Cwebsite=AUCHITHYAM%7Clanguage=te}}[permanent dead link]</ref>
- ↑ "archive.org". AUCHITHYAM. Retrieved 2024-04-22.
{{cite web}}
: External link in
(help)|author-link=