Jump to content

దాసుపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
వికీపీడియా నుండి
దాసుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
దాసుపాలెం is located in Andhra Pradesh
దాసుపాలెం
దాసుపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు మండలం
ప్రభుత్వం
 - సర్పంచి మానుకొండ శివకుమారి
పిన్ కోడ్ 522005
ఎస్.టి.డి కోడ్ 0863

దాసుపాలెం గుంటూరు జిల్లా, గుంటూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామములోని ప్రజల ప్రదాన వృత్తులు వ్యవసాయం, కుమ్మరి.గ్రామంలో పండిచే పంటలు ముఖ్యంగా వరి, మినుము, కంది, జనుమ, ప్రత్తి, మిర్చి, పసుపు, పొగాకు, కూరగాయ పంటలు పంటలు పండిస్తారు. కుమ్మరులు మట్టితొ కుండలు, కూజాలు, తాబేటి కాయలు, పూలకుండీలు, దీపపు ప్రమిదలు, పాత్రలు తయారు చేస్తారు.

గ్రామానికి సాగు, త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

త్రాగునీటి చెరువు

[మార్చు]

ఈ చెరువు నుండి దాసుపాలెం గ్రామంతోపాటు మల్లవరం, తోకవారిపాలెం గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందించుచున్నారు. ఈ చెరుకు వంకాయలపాడు మైనర్ కాలువ నుండి నీరు అందించుటకు సౌకర్యం ఉంది. ఈ చెరువుకు 15 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

దాసుపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 2001లో మొదటి సర్పంచిగా ఆ గ్రామానికి చెందిన చేతరాసుపల్లి ఆదినారాయణ ఎన్నికైనారు. కొత్తగా పంచాయతీ ఏర్పడటంతో తొలిసారిగా మూడున్నర లక్షల రూపాయలతో, పంచాయతీ భవన నిర్మాణం, మరొక రెండున్నర లక్షల రూపాయలతో మహిళామండలి భవన నిర్మాణం పూర్తి చేశారు. ఆ బిల్లుల చెల్లింపులో మండల పరిషత్తు కార్యాలయలో లంచం అడిగినందుకు అసిస్టెంటు ఇంజనీరుని, అవినీతి నిరోధక శాఖాధికారులకు నేరుగా పట్టించారు, గ్రామ సర్పంచి ఆదినారాయణ

గ్రామంలోని దేవాలయాలు

[మార్చు]

శ్రీ సువర్చలా సహిత శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం

[మార్చు]

దాసుపాలెం గ్రామంలోని ప్రధాన దేవాలయం సువర్చలా సహిత శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం. ఈ దేవాలయం ఎంతో ప్రాఛీన దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం నాడు శ్రీ హనుమజ్జయంతిని, ప్రతి సంవత్సరం స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సువర్చలా సహిత శ్రీ వీరాంజనేయస్వామి వారి కల్యాణాన్ని చాల వైభవంగా జరుపుతారు. సాధారణంగా ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి. సువర్చలతో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు.అలాంటి అరుదైన సువర్చలా సహిత శ్రీ వీరాంజనేయస్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో గుంటూరు మండలం లోని దాసుపాలెం గ్రామంలో రావిచెట్టు, జమ్మిచెట్టు, వేపచెట్ల మధ్యన, రామదాసు చెరువు సమీపంలో ఉంది.ఆలయం ముందర మహా మండపము ఉంది. ఈ మహా మండపములో భక్తులు 'హరిభజన' చేయుదురు, భ్రమేత్సవాల సమయములో స్వామి వారికి వైఖానస ఆగమ విధానంలో హోమములు, యాగములు నిర్వహించబడును.మహా మడపం ముందుగల ధ్వజస్తంభం ఇత్తడి తొడుగుతో చూడముఛటగా వంటుంది.ధ్వజస్తంభం క్రిందబాగంలో నాగేంద్ర స్వామివారి ప్రతిమలు, స్వామివారి పాదపద్మములు, దాసాంజనేయ స్వామివారి ప్రతిమలను దర్శింఛవచ్చును.ఇంతటి ప్రాఛీన దేవాలయం నిర్మించిన పుణ్యాత్ముల పేర్లు కోసము ప్రయత్నిస్తున్నాము. నిత్యము భక్తులు సువర్చలా సహిత శ్రీ వీరాంజనేయస్వామి వార్లను సేవించి తరిస్తున్నారు తమల పాకుల పూజ, పండ్లతో పూజ గంధ శింధురంతో అర్చనా విశేషంగా జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు భక్తులు ప్రదఖినలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి. - - - - సర్వ్ జనః సుఖినో భవంతు.విశ్వ శాంతి రస్తు.లోక కళ్యాణ మస్తు. == [1]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)